2000 కోట్ల టార్గెట్.. సూర్య తెలివైన సమాధానం
అందుకు తగ్గట్లుగానే ఈ ఫిల్మ్‌ను ప్రేక్షకులకు మరింతగా చేరువ చేసేలా సినిమా యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను సైతం చేస్తోంది.
ఇండియాలోని ప్రతి సినిమా ఇండస్ట్రీ నుంచి భారీ భారీ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి ఓ రేంజ్‌లో అలరిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో ఈ తరహా చిత్రాల సంఖ్య అధికం అయిపోయింది. మరీ ముఖ్యంగా సౌత్ ఇండియా నుంచి పాన్ ఇండియా రేంజ్ సినిమాలు ఎక్కువగా రూపొందుతోన్నాయి. అలా ఇప్పుడు తెరకెక్కిన క్రేజీ యాక్షన్ సినిమానే ‘కంగువ’.
కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా.. మాస్ డైరెక్టర్ శివ రూపొందించిన సినిమానే ‘కంగువ’. పిరియాడిక్ జోనర్‌లో ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం పాన్ ఇండియా రేంజ్‌లో రానుంది. దీంతో ఈ మూవీ గురించి దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అందుకు తగ్గట్లుగానే ఈ ఫిల్మ్‌ను ప్రేక్షకులకు మరింతగా చేరువ చేసేలా సినిమా యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను సైతం చేస్తోంది.
‘కంగువ’ సినిమా విడుదలకు సమయం దగ్గర పడడంతో చిత్ర యూనిట్ ప్రమోషనల్ ఈవెంట్లను జెట్ స్పీడుతో చేసుకుంటూ వెళ్తోంది. ఇలా ఇప్పటికే కొన్ని నగరాల్లో ప్రెస్‌మీట్లను సైతం నిర్వహించారు. ఓ సందర్భంలో నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా ‘కంగువ సినిమాతో సూర్య 2000 కోట్ల రూపాయల కలెక్షన్లను అందుకుంటాడు. ఇది కచ్చితంగా జరిగి తీరుతుంది’ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
‘కంగువ’ సినిమా కలెక్షన్ల గురించి నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతున్నాయి. దీంతో చాలా మంది ఆయనను ట్రోల్స్ కూడా చేస్తున్నారు. ఆయనది ఓవర్ కాన్ఫిడెంట్ అని, సినిమాను హైలైట్ చేయడానికి ఇలా మాట్లాడారని అభిప్రాయపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ఈవెంట్‌లో సూర్యను తెలుగు మీడియా ప్రతినిధులు దీనిపై ప్రశ్నించారు.
మీడియా నుంచి వచ్చిన ప్రశ్న పై సూర్య స్పందిస్తూ.. ‘అంత ఎక్కవ కలెక్షన్లు రావాలని కోరుకోవడంలో తప్పు ఏముంది? పెద్ద టార్గెట్లను పెట్టుకుంటే నష్టం ఏమీ లేదు కదా. బాహుబలి, కేజీఎఫ్ వంటి పెద్ద సినిమాలను ప్రేమతోనే తీసి ఉంటారు. డబ్బు కోసం తీసి ఉండరని అనుకుంటున్నా. మేము కూడా అదే ఆలోచనలో ఉన్నాము. కలెక్షన్లు మాకు కూడా అలాగే వస్తాయని అనుకుంటున్నాము’ అని చెప్పుకొచ్చాడు.
అటు నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా.. ఇటు సూర్య ‘కంగువ’ సినిమాపై చేసిన వ్యాఖ్యలు.. ఆ మూవీ రేంజ్‌ను పెంచాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇక, ఈ సినిమా నవంబర్ 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇందుకోసం భారీ ఏర్పాట్లే జరుగుతున్నాయి.