'కర్ణ'తో ఆ సెంటిమెంట్ ని బ్రేక్ చేస్తారా?
ఈ ప్రాజెక్ట్ విషయంలో కోలీవుడ్లో ఓ సెంటిమెంట్ కూడా వెంటాడుతుంది. కర్ణ పాత్ర అంటే నటసార్వభౌమ ఎన్టీఆర్ గుర్తొస్తారు.
కొన్ని సార్లు ప్లానింగ్ లు ఛేంజ్ అవుతుంటాయి. ఒక హీరో చేయాల్సిన ప్రాజెక్ట్ మరో హీరోకి వెళ్తుంది. అది హిట్ అయినా..ప్లాప్ అయినా ఆ తర్వాత దానిపై రివ్యూలు తెరపైకి వస్తుంటాయి. ఇప్పుడు కర్ణ ప్రాజెక్ట్ విషయంలో కూడా అదే సన్నివేశం కనిపిస్తుంది. మూడేళ్ళ క్రితం విక్రమ్ కర్ణ పాత్రలో ఆర్ఎస్ విమల్ దర్శకుడిగా 'సూర్యపుత్ర మహావీర్ కర్ణ' మొదలై మధ్యలో ఆగిపోయిన సంగతి తెలిసిందే.
ఫస్ట్ లుక్.. మోషన్ పోస్టర్ కూడా రిలీజ్ అయ్యాయి. మహాభారతంలోని కర్ణుడి విశిష్టతను కొత్త టెక్నాలజీతో చెప్పాలని ప్రయత్నించారు. కానీ బ్రేక్ వచ్చిన తర్వాత ఆ ప్రాజెక్ట్ నుంచి విక్రమ్ తప్పుకున్నారు. ఇప్పుడా ప్రాజెక్ట్ మళ్లీ మూవ్ అవుతోన్న సంగతి తెలిసిందే.
అయితే ఈసారి కొత్త టీమ్ తో ఈ సినిమా మొదలవు తుంది. విక్రమ్ పాత్రలో సూర్య నటిస్తుండగా...విమల్ స్థానంలో ఓం ప్రకాష్ మెహతా వచ్చారు.
500 కోట్ల భారీ బడ్జెట్ తో చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ పనుల్లో ఉంది. అంతా ఒకే అనుకుంటే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. అయితే విక్రమ్-విమల్ ఎందుకు వెనకడుగు వేసారు? అన్నది ఆలోచించాల్సిన విషయమే.
ఏ కారణంగా ప్రాజెక్ట్ ఆపేసారు అన్నది కీలకం అంశం. ఇదంత వీజీ సబ్జెక్ట్ కాదు. ఈ ప్రాజెక్ట్ విషయంలో కోలీవుడ్లో ఓ సెంటిమెంట్ కూడా వెంటాడుతుంది. కర్ణ పాత్ర అంటే నటసార్వభౌమ ఎన్టీఆర్ గుర్తొస్తారు.
దానవీరశూరకర్ణగా ఆయన అభినయం...ఆహార్యం ఎంతో అద్భుతం. ఆ తర్వాత ఇదే ప్రయత్నం కోలీవుడ్ నటులు శివాజీ గణేశన్ లాంటి కొందరు దిగ్గజాలు చేసారు. కానీ వాటి ఫలితాలు ఆశాజనకంగా లేవు. ఓరిజినల్ ని మ్యాచ్ చేయలేకపోయారు. మరి టెక్నాలజీని బేస్ చేసుకుని సూర్య అండ్ కో ఈ ప్రాజెక్ట్ ని ఎలా ఆవిష్కరిస్తారు? అన్నది వేచి చూడాలి.
పైగా ఈసినిమా ఇప్పటికిప్పుడు పట్టాలెక్కించేది కూడా. బ్యాకెండ్ లో చాలా వర్క్ చేయాల్సి ఉంది. ఆర్ట్ వర్క్..సాంకేతిక..వర్క్ షాప్స్ ఇలా చాలా అంశాలపై ముందే అపార పరిజ్ఞానం తప్పని సరి.