త‌మన్నా చేతిపై ఆ టాట్టూపైనే ప్ర‌జ‌ల క‌ళ్లు

అదే స‌మ‌యంలో త‌న వెబ్ సిరీస్ కోస్టార్ విజ‌య్ వ‌ర్మ‌తో డీప్ గా ప్రేమ‌లో ప‌డిన సంగతి తెలిసిందే.

Update: 2024-12-31 14:06 GMT

మిల్కీ వైట్ బ్యూటీ త‌మ‌న్నా భాటియా కెరీర్, లైఫ్ జ‌ర్నీ గురించి తెలిసిందే. సౌత్ లో అగ్ర క‌థానాయిక‌గా ఓ వెలుగు వెలిగిన త‌మ‌న్నా ఇటీవ‌ల హిందీ చిత్ర‌సీమ‌లో బిజీ న‌టిగా మారింది. వ‌రుస‌గా వెబ్ సిరీస్ లలో న‌టిస్తోంది. అదే స‌మ‌యంలో త‌న వెబ్ సిరీస్ కోస్టార్ విజ‌య్ వ‌ర్మ‌తో డీప్ గా ప్రేమ‌లో ప‌డిన సంగతి తెలిసిందే. ఈ జంట పెళ్లి గురించి ఎలాంటి క్లూ ఇవ్వ‌డం లేదు. కానీ ఎగ్జోటిక్ లొకేష‌న్ల‌లో ఔటింగులు, రొమాంంటిక్ డేట్ ల‌కు కొద‌వేమీ లేదు.

అలాంటి ఒక డేట్ నుంచి ఇప్పుడు విజ‌య్ వ‌ర్మ అద్భుత‌మైన ఫోటోగ్రాఫ్స్ ని షేర్ చేసాడు. వీటిలో త‌న స్నేహితుల‌తో క‌లిసి అత‌డు వెకేష‌న్ ని ఎంజాయ్ చేస్తూ క‌నిపించాడు. ప‌నిలో ప‌నిగా త‌న ప్రేయ‌సి త‌మ‌న్నా భాటియాతో రొమాన్స్ లో త‌గ్గేదే లేద‌ని నిరూపించిన ఫోటోలు కూడా లీక‌య్యాయి.

విజ‌య్ షేర్ చేసిన ఫోటోల‌ బంచ్‌ అంద‌రి దృష్టిని ప్ర‌త్యేకంగా ఆక‌ర్షించింది. దీనికి కార‌ణం ఈ ఫోటోగ్రాఫ్స్ లో ఒక‌దానిలో త‌న గాళ్ ఫ్రెండ్ త‌మ‌న్నా చేతిపై ఉన్న టాట్టూ. 'విజ‌య్' అని మూడ‌క్ష‌రాల టాట్టూ క‌ళ్లు తిప్పుకోనివ్వ‌లేదు. డిసెంబర్ 31న కొత్త సంవ‌త్స‌రానికి వెల్ కం చెబుతూ, పాత సంవ‌త్స‌రానికి గుడ్ బాయ్ చెప్పే ప‌నిలో ఉంది త‌మ‌న్నా- విజ‌య్ వ‌ర్మ జంట‌. స్నేహితుల‌తో క‌లిసి ఈ జంట వెకేష‌న్ లో ఫుల్ గా చిల్ చేస్తున్నారు. అదే క్ర‌మంలో విజయ్ వర్మ తన స్నేహితులతో విహార‌యాత్ర‌ల్లో వ‌రుస ఫోటోలు దిగాడు. వీటిలోనే త‌మ‌న్నాతో ఫోటో కూడా లీక్ అయింది. సీఫేసింగ్ లో ఒక యాచ్‌పై అద్భుతమైన స్నాప్స్ వైర‌ల్ అవుతున్నాయి. తన ఇత‌ర‌ స్నేహితులతో కూల్ గా ఉన్న ఒక వీడియోని కూడా విజ‌య్ వ‌ర్మ షేర్ చేసాడు. మూడవ వీడియోలో రణదీప్ హుడా భార్య లిన్ లైష్రామ్ త‌దిత‌రులు రొమాంటిక్ డ్యాన్స్‌ల‌ను ఆస్వాధిస్తూ క‌నిపించారు.

ఈ పోస్ట్‌పై విజయ్ వ‌ర్మ‌ స్నేహితుడు వంశ్ స్పందిస్తూ.. 'విజయ్‌పై (త‌మ‌న్నా) ప్రేమ నిజమైనది' అని టీజ్ చేసాడు. ప‌లువురు అభిమానులు ఈ పోస్ట్‌కి ప్రతిస్పందించారు. 'విజయ్! స్క్రీన్‌లను సీజ్ చేసి మమ్మల్ని స్తంభింపజేయండి! అని ఒక‌రు వ్యాఖ్యానించ‌గా, మరొక అభిమాని 'సీ-వాన్ జిల్లే మే స్వాగత్ హే ఆప్కా' అని చమత్కరించాడు. వేరొక‌ అభిమాని 2025లో వేవ్స్ క్రియేట్ చేయండి అని రాసాడు. ఇంత‌కుముందు త‌మ‌న్నా కూడా త‌న బ‌ర్త్ డే వేడుక‌ల ఫోటోలు, వీడియోల‌ను షేర్ చేయ‌గా అవి వైర‌ల్ అయ్యాయి. ప్రియుడు విజయ్ వర్మ, స్నేహితులతో కలిసి వీడియో గేమ్‌ను ఆస్వాధిస్తూ త‌మ‌న్నా ఈ వీడియోల‌లో క‌నిపించింది.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే... విజయ్ తదుపరి ఉల్ జలూల్ ఇష్క్‌లో న‌టిస్తున్నారు. ఫాతిమా సనా షేక్, నసీరుద్దీన్ షా ఇందులో కీల‌క పాత్ర‌ధారులు. విభు పూరి దర్శకత్వం వహిస్తున్నారు. దీనికి మనీష్ మల్హోత్రా స్టేజ్ 5 ప్రొడక్షన్ పెట్టుబ‌డులు స‌మ‌కూరుస్తోంది. త‌మ‌న్నా త‌దుప‌రి ప్రాజెక్టుల‌తో బిజీగా ఉంది.

Tags:    

Similar News