'భార‌తీయుడు 2' టాప్ సీక్రెట్స్ లీక్

ఓవైపు క‌ల్కి మానియా గురించి చ‌ర్చిస్తూనే 'భార‌తీయుడు 2' గురించి అభిమానుల్లో ముచ్చ‌ట కొన‌సాగుతోంది.

Update: 2024-06-22 13:43 GMT

2024 మోస్ట్ అవైటెడ్ సినిమాల జాబితాలో విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ న‌టించిన భార‌తీయుడు 2 (ఇండియ‌న్ 2) అగ్ర ప‌థంలో ఉంది. ప్ర‌భాస్ - నాగ్ అశ్విన్ ల క‌ల్కి త‌ర్వాత భార‌తీయుడు 2 గురించి స‌ర్వ‌త్రా ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఓవైపు క‌ల్కి మానియా గురించి చ‌ర్చిస్తూనే 'భార‌తీయుడు 2' గురించి అభిమానుల్లో ముచ్చ‌ట కొన‌సాగుతోంది.

ఇటీవ‌ల 'భార‌తీయుడు 2' ట్రైల‌ర్ రాక కోసం అభిమానులు ఎంతో ఎగ్జ‌యిటింగ్ గా వేచి చూస్తున్నారు. ఇంత‌లోనే ఇప్పుడు ట్రైలర్ సెన్సార్ రిపోర్ట్ అందింది. ప్ర‌స్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్ రిగ‌ర‌స్ గా కొనసాగుతున్నాయి. మేకర్స్ తమ ఇంటెన్స్ ప్రమోషనల్ ప్లాన్ తో రెగ్యులర్ అప్‌డేట్‌లు ఇస్తూనే ఉన్నారు. 'ఇండియన్ 2' ట్రైలర్ సెన్సార్ పూర్తి కాగా, ట్రైలర్ కాపీకి సంబంధించిన స్క్రీన్ షాట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇండియన్ 2 ట్రైలర్ సినిమా విడుదలకు రెండు వారాల సమయం ఉండగానే విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ సోమ‌వారం ట్రైల‌ర్ ని ఆవిష్క‌రించేందుకు అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. ప్రమోషనల్ వీడియో బజ్‌ను మరింత పెంచుతుందని భావిస్తున్నారు. ట్రైలర్ రాక‌తో ఈ చిత్రానికి సంబంధించిన చాలా విష‌యాలు బహిర్గతం అయ్యే అవకాశం ఉంది. సినిమా ట్రైలర్‌కి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

'ఇండియన్ 2' 1996 తమిళ చిత్రం 'ఇండియన్'కి సీక్వెల్. రెండు దశాబ్దాల తర్వాత దర్శకుడు శంకర్‌తో కమల్ హాసన్ పునఃకలయిక ఉత్కంఠ‌ను పెంచింది. మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ కోసం లైకా సంస్థ‌, ఉద‌య‌నిధితో క‌లిసి భారీ పెట్టుబ‌డుల్ని స‌మ‌కూర్చిన సంగ‌తి తెలిసిందే. అలాగే సినిమా నిర్మాణానికి ఎక్కువ సమయం పట్టింది. ఇప్పుడు అత్యంత భారీ థియేట్రిక‌ల్ రిలీజ్ తో ఈ చిత్రం బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్ట‌డం ఖాయ‌మ‌ని అంచ‌నా వేస్తున్నారు. ఇండియన్ 2 తమిళం, తెలుగు, హిందీ భాషలలో అత్యంత భారీగా విడుదల కానుంది. ఈ చిత్రానికి మూడవ భాగం కూడా ఉంటుందని చిత్ర‌బృందం వెల్ల‌డించిన సంగ‌తి తెలిసిందే. రెండవ భాగం విడుద‌లైన కొన్ని నెలల తర్వాత విడుదల కానుంది.

కమల్ హాసన్ ఈ చిత్రంలో సేనాపతిగా పునరాగమనం చేయనున్నారు. ఈ చిత్రంలో సిద్ధార్థ్, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్, వివేక్, నేదురుమూడి వేణు, SJ సూర్య, గుల్షన్ గ్రోవర్, బాబీ సింహా తదితరులు న‌టించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందించారు.

నిడివి ఎంతో తెలుసా?

భార‌తీయుడు జూలై 12న విడుద‌ల కానుంది. తాజాగా అందిన స‌మాచారం మేర‌కు సెన్సార్ పూర్త‌యింద‌ని దీనికి ఏ స‌ర్టిఫికెట్ ఇచ్చార‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఓవ‌ర్సీస్ మార్కెట్ లో బుకింగ్స్ ఇప్ప‌టికే మొద‌లు కాగా సెన్సార్ గురించి అక్క‌డి నుంచే వివ‌రాలు అందాయి. శంక‌ర్ సినిమాల నిడివి ఎప్పుడూ సుదీర్ఘంగా ఉంటుంది. ఎప్ప‌టిలానే ఈ సినిమా 3గం.10 నిమిషాల నిడివితో అల‌రించ‌నుంద‌ని స‌మాచారం.

Tags:    

Similar News