హీరోల తాట తీసే హీరోయిన్లు వీళ్లే!
నటనతో పాటు వీళ్లలో డాన్సు అనేది అదనపు క్వాలిఫికేషన్ లా సినిమాలకు కలిసొస్తుంది.
టాలీవుడ్ లో టాప్ డాన్సర్లు కం హీరోలు ఎవరంటే? కొంత మంది పేర్లు ప్రత్యేకంగా చెప్పొచ్చు. యంగ్ టైగర్ ఎన్టీఆర్..ఐకాన్ స్టార్ అల్లు అర్జున్..మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ఎనర్జిటిక్ స్టార్ రామ్ ఇలా కొంత మంది ఫేమస్ డాన్సర్లు ఉన్నారు. నటనతో పాటు వీళ్లలో డాన్సు అనేది అదనపు క్వాలిఫికేషన్ లా సినిమాలకు కలిసొస్తుంది. డాన్సుల్లో వీళ్ల మధ్య ఎప్పుడూ మంచి పోటీ కనిపిస్తుంటుంది.
ఇక హీరోయిన్ల పరంగా చూసుకుంటే? పాత రోజుల్లో కొంత మంది ఫేమస్ అయిన డాన్సర్లు ఉండేవారు. కానీ ఇప్పుడొస్తున్న హీరోయిన్లల అంత ఎనర్జీ కనిపించలేదన్నది వాస్తవం. అలా ఫిల్టర్ చేసి చూస్తే గొప్ప డాన్సర్లుగా సాయి పల్లవి...శ్రీలీలను చెప్పొచ్చు. డాన్సు పరంగా ఇద్దరి మధ్య మంచి పోటీ కనిపిస్తుంది. ఇద్దరు గొప్ప డాన్సర్లు అనడంలో ఎలాంటి సందేహం లేదు. నటనతో పాటు డాన్సు వాళ్లకి ప్రత్యేకమైన ఐడెంటిటీని తీసుకొచ్చింది.
ఈ భామలతో డాన్సులు చేయాలంటే హీరోలు కూడా ఆలోచించుకోవాల్సిన సన్నివేశమేనని నిన్నటి రోజున మహేష్ చేసిన వ్యాఖ్యల్ని బట్టి చెప్పొచ్చు. గుంటూరు కారం ప్రీ రిలీజ్ లో మహేష్ డాన్సుల్లో తాట తీసేస్తుంది శ్రీలీల అంటూ అమ్మడి డాన్సింగ్స్ స్కిల్స్ ప్రత్యేకంగా చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. అందుకు తగ్గట్టే కుర్చి మడత పెట్టి సాంగ్ లో శ్రీలీల ఏ రేంజ్ ఎనర్జీ లెవల్ తో డాన్సు చేసిందో తెలిసిందే.
శ్రీలీలతో పోటీ పడలేక మహేష్ వెనక్కి తగ్గాడు. ఈ విషయాన్ని ఆయనే ఒప్పుకున్నాడు. అంతకుముందు రవితేజ నటించిన ధమాకాలోనూ శ్రీలీల మాస్ స్పెప్పులతో ఎలా అదరగొట్టిందో తెలిసిందే. అసలు పెళ్లి సందడి అనే డెబ్యూ సినిమాతోనే తానో గొప్ప డాన్సర్ అని ప్రూవ్ చేసుకుంది. ఇక సాయి పల్లవి డాన్సింగ్ స్కిల్స్ గురించి చెప్పాల్సిన పనిలేదు.
టాలీవుడ్ సహా కోలీవుడ్ హీరోల్ని సైతం హడలెత్తించిన బ్యూటీ ఈవిడ. సాయి పల్లవితో పోటీ పడి డాన్సు చేయాలని ఉందన్న సంగతిని బన్నీ స్వయంగానే ఓ సదర్భంలో చెప్పాడు? అంటే పల్లవి డాన్సు గురించి ఇక చెప్పాల్సిన పనిలేదు. అంత గ్రేట్ డాన్సర్ ఆమె. ఏది ఏమైనా ఇద్దరి భామలతో డాన్సు చేయడమంటే హీరోలకు సహవాసం లాంటిందే.