ఆస్కార్ రేస్ నుంచి ఆ సినిమా అవుట్
96వ అకాడమీ అవార్డుల కోసం షార్ట్‌లిస్ట్‌ను అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ విడుదల చేసింది. ఇందులో 2018 సినిమాకి చోటు లభించలేదు.
ప్రతి ఏడాది ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మన దేశంలో తెరకెక్కే సినిమాలలో బెస్ట్ మూవీ అనుకున్నదానిని ఎంపిక చేసి ఆస్కార్ అవార్డుల నామినేషన్స్ కి పంపిస్తారు. అలా ఫిల్మ్ ఫెడరేషన్ ఎంపిక చేసిన వాటిలో ఇప్పటి వరకు ఒక్క మూవీ కూడా ఆస్కార్ అవార్డుని గెలుచుకోలేదు. కొన్ని సినిమాలు అయితే ఫైనల్ రేస్ వరకు వెళ్లి ఆగిపోయాయి.
అయితే ఆర్ఆర్ఆర్ మూవీని ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆస్కార్ కి పంపించకుండా ఆరంభంలోనే తిరస్కరించింది. ఈ మూవీ స్థానంలో ఒక గుజరాతీ ఫిలింని ఎంపిక చేసింది. అయితే ఆర్ఆర్ఆర్ మూవీని ప్రైవేట్ గా ఆస్కార్ అవార్డులకి పంపించారు. ఇంటర్నేషనల్ స్థాయిలో పలు అవార్డులని మూవీ సొంతం చేసుకుంది.
బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటు నాటు పాటని ఆస్కార్ వరించింది. ఇండియా మొత్తం దీనిని సెలబ్రేట్ చేసుకున్నారు. ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆస్కార్ నామినేషన్స్ ప్రక్రియని కూడా చాలా మంది తప్పు పట్టారు. దానిపై ఫిల్మ్ ఫెడరేషన్ పెద్దగా రియాక్ట్ కాలేదు. 2024 ఆస్కార్ అవార్డులకి మలయాళీ మూవీ 2018ని ఇండియా తరపున అధికారిక ఎంట్రీగా ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎంపిక చేసింది.
ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు సైతం అందుకోవడంతో కచ్చితంగా ఫైనల్ రేసులో మూవీ పోటీ పడే అవకాశం ఉంటుందని అందరూ భావించారు. అయితే ఈ సినిమా పోటీ నుంచి నిష్క్రమించింది. 96వ అకాడమీ అవార్డుల కోసం షార్ట్‌లిస్ట్‌ను అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ విడుదల చేసింది. ఇందులో 2018 సినిమాకి చోటు లభించలేదు.
ఈ సినిమాలో టోవినో థామస్, లాల్, నరేన్, అపర్ణ బాలమురళి, కళాయిరసన్, అజు వర్గీస్, వినీత్ శ్రీనివాసన్, కుంచాకో బోబన్ కీలక పాత్రల్లో నటించారు. జేడ్ ఆంథనీ జోసెఫ్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కింది. ఈ ఏడాది ఆరంభంలో ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ సినిమా రిలీజ్ అయిన అన్ని భాషలలో సక్సెస్ అయ్యింది. మలయాళం ఇండస్ట్రీలో హైయెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది.