థింక్ లొకల్లీ...యాక్ట్ గ్లోబల్లీ!
ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, మహేష్ అంతా పాన్ ఇండియా బాట పట్టిన సంగతి తెలిసిందే.
ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, మహేష్ అంతా పాన్ ఇండియా బాట పట్టిన సంగతి తెలిసిందే. ఇకపై వీళ్లంతా పాన్ ఇండియాలోనే సినిమాలు చేస్తారు. వాళ్లను చూసి టైర్ -2 హీరోలు కూడా పాన్ ఇండియా కాన్సెప్ట్ ల వైపే మొగ్గు చూపుతున్నారు. ఇటీవలే 'తండేల్' తో నాచగైతన్య కూడా పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగు పెట్టాడు. అంతకు ముందే నిఖిల్ `కార్తికేయ2` తోనూ ఇండియాలో లాంచ్ అయ్యాడు.
ప్రస్తుతం `స్వయంభు` సినిమా చేస్తున్నాడు. ఇది పాన్ ఇండియా చిత్రమే. అలాగే తేజ సజ్జ `హనుమాన్` తో లాంచ్ అయ్యాడు. ప్రస్తుతం నటిస్తోన్న `మిరాయ్` కూడా పాన్ ఇండియా చిత్రమే. ఇలా స్టార్ హీరోల నుంచి యంగ్ హీరోల వరకూ అంతా పాన్ ఇండియా మోజులోనే ఉన్నారు. హీరోలంతా ఇలా పాన్ ఇండియా సినిమాలు చేయడం టాలీవుడ్ కి మంచిదే. దేశీయ మార్కెట్ లో రాణించడం ఎంతో గొప్ప విషయమే.
అయితే ఈ ప్రోసస్ లో రీజనల్ మార్కెట్ ని విస్మరిస్తున్నారు? కొన్ని జానర్ సినిమాలకే పరిమితం అవుతున్నారు? అన్న విమర్శ కూడా వ్యక్తమవుతోంది. దీంతో థింక్ లోకల్లీ..యాక్ట్ గ్లోబల్లీ విధానాన్ని అనుసరిస్తే రెండు రకాలుగానూ కలిసొస్తుంది అన్నది కొందరి సలహా. పాన్ ఇండియా ఆసక్తితో కొన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీలను హీరోలు అశ్రద్ద చేస్తున్నారని కొంత మంది రచయితలు అభిప్రాయ పడుతున్నారు.
ఆయా స్టోరీల్లో హీరోలు నటిస్తే రీజనల్ మార్కెట్ తో పాటు పాన్ ఇండియాలోనూ కలిసొస్తుందని... కానీ ఆ ఛాన్స్ తీసుకోకుండా కేవలం యూనివర్శల్ అప్పీల్ ఉన్న కథలవైపు వెళ్తూ తెలుగు ఆడియన్స్ కి దూరమ వుతున్నారని కొందరు సీనియర్ రచయితలు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయంలో హీరోలంతా సమాలోచన చేయాలని కోరుతున్నారు. మరి మన హీరోలకు అంత టైమ్ తీసుకుంటారా? అంటే సందేహమే.