ఉర్ఫీ నిశ్చితార్థం.. ఎవరు ఈ పుష్పా?
ఉర్ఫీ స్వయంగా ఇన్‌స్టాలో వివరాలు అందించింది. ఎక్స్ ఖాతాలో ఒక సీక్రెట్ పోస్ట్‌ను షేర్ చేస్తూ ఉర్పీ ఇలా రాసింది. ''యే ఇష్క్ నహీ అసన్ బస్ ఇత్నా సమాజ్ లిజియే ధోకే కా ఖత్రా హై, రోకా కర్కే జానా హై.
సోషల్ మీడియా సెన్సేషన్, కాంట్రవర్శీ క్వీన్ ఉర్ఫీ జావేద్‌కి నిశ్చితార్థమైంది. ఒక మిస్టరీ మ్యాన్ ఉర్ఫీ వేలికి ఉంగరం తొడుగుతున్న ఫోటో ఇంటర్నెట్‌లో సందడి చేస్తోంది. అరుదైన ఆ క్షణానికి సంబంధించిన స్నాప్‌షాట్ సోషల్ మీడియాలో వైరల్ కాగా, రకరకాల ఊహాగానాలు చెలరేగాయి. సోషల్ మీడియా సెన్సేషన్ కి రహస్యంగా నిశ్చితార్థం అయిందా? లేదా ఇంకేదైనా ట్విస్ట్ ఉందా? అంటూ సందేహాలు వ్యక్తమయ్యాయి.
అభిమానులు ఈ ఫోటోగ్రాఫ్ పై ఉత్సాహంగా కామెంట్లు చేసారు. ఈమోజీలతో అభినందనలు తెలియజేసారు. కొందరు డిటెక్టివ్‌గా మారి ఆరాలు తీయడం ప్రారంభించారు. ఈ ఫోటోలో ఉన్న రహస్య వ్యక్తి ఎవరు? అని వెతికారు. అతడు పుష్ప అని కొందరు, లేదు ఓర్రీతో నిశ్చితార్థం చేసుకుందని మరికొందరు ఛమత్కరించారు. చివరికి ఇది కొత్త షో కోసం పబ్లిసిటీ స్టంట్ అని కూడా క్లారిటీ వచ్చింది. ఉర్ఫీ స్వయంగా ఇన్‌స్టాలో వివరాలు అందించింది. ఎక్స్ ఖాతాలో ఒక సీక్రెట్ పోస్ట్‌ను షేర్ చేస్తూ ఉర్పీ ఇలా రాసింది. ''యే ఇష్క్ నహీ అసన్ బస్ ఇత్నా సమాజ్ లిజియే ధోకే కా ఖత్రా హై, రోకా కర్కే జానా హై. ఫిబ్రవరి 14 నుండి డిస్నీ+ హాట్‌స్టార్‌లో ఈ షో స్ట్రీమింగ్ కానుంది'' అని తెలిపింది. ఈ నిశ్చితార్థం రియాలిటీ షో కోసమేనని క్లారిటీనిచ్చింది.
ఉర్ఫీ జావేద్ నటి, మోడల్ కం సోషల్ మీడియా సెన్సేషన్. ఈ భామ బోల్డ్ ఫ్యాషన్ ఎంపికలు నిరంతరం చర్చల్లోకి వచ్చాయి. ఊర్ఫీ తన కెరీర్‌ను టెలివిజన్‌లో ప్రారంభించింది. బడే భయ్యా కి దుల్హానియా, మేరీ దుర్గా, బెపన్నా, , కసౌతి జిందగీ కే వంటి పాపులర్ షోలలో కనిపించింది. అయితే 2021లో బిగ్ బాస్ ఓటీటీలో పార్టిసిపెంట్‌గా అందరి దృష్టిని ఆకర్షించింది. టెలివిజన్‌కు మించి ఉర్ఫీ ఇంటర్నెట్‌ను షేక్ చేయడంలో ప్రావీణ్యం సంపాదించింది. ఈ భామ ఎక్కడ కనిపించినా వివాదాలతో ప్రచారం కొట్టేస్తుంది. కెరీర్ మ్యాటర్ కి వస్తే... గత సంవత్సరం ప్రైమ్ వీడియోలో తొమ్మిది ఎపిసోడ్‌ల సిరీస్ అయిన 'ఫాలో కర్ లో యార్'లో నటించింది. ఉర్ఫీ లైఫ్ స్టైల్ పై షో పెద్ద సక్సెసైంది.