మరో ఉప్పెన కోసం మెగా హీరో తిప్పలు..!
మెగా మేనల్లుడి కెరీర్ లో మరో ఉప్పెన లాంటి సినిమా పడాలి. అలాంటి సినిమా మరోటి పడితే కానీ మళ్లీ వైష్ణవ్ తేజ్ కెరీర్ ట్రాక్ ఎక్కే పరిస్థితి లేదు.
మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ ఎంట్రీ ఇవ్వడమే సూపర్ హిట్ అందుకున్నాడు. సుకుమార్ శిష్యుడు బుచ్చి బాబుతో వైష్ణవ్ తేజ్ తొలి సినిమా ఉప్పెన సినిమా సెన్సేషనల్ హిట్ సాధించింది. ఆ సినిమాతో హీరోగా వైష్ణవ్ తేజ్, డైరెక్టర్ గా బుచ్చి బాబు, హీరోయిన్ గా కృతి శెట్టికి సూపర్ ఎంట్రీ దొరికింది. ఆ సినిమా సక్సెస్ తో బుచ్చి బాబు రెండో సినిమా ఏకంగా రాం చరణ్ తోనే సినిమా ఫిక్స్ చేసుకున్నాడు. ఐతే ఉప్పెన తర్వాత డైరెక్టర్ బుచ్చి బాబు రెండో సినిమా ఈమధ్యనే మొదలు పెట్టగా అటు కృతి శెట్టి ఇటు వైష్ణవ్ తేజ్ ఇద్దరు వరుస సినిమాలు చేశారు.
ఐతే కెరీర్ పరంగా అటు వైష్ణవ్ కి ఏమంత ఆశాజనకంగా లేదు. ఉప్పెన తప్ప మరో సినిమా ఏది హిట్ అందుకోలేదు. చివరగా వచ్చిన ఆదికేశవ్ సినిమా అయితే డిజాస్టర్ అనిపించుకుంది. మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ కి అర్జెంట్ హిట్ కావాలి. తను చేస్తున్న కథలు ఏవి అంతగా వర్క్ అవుట్ అవ్వట్లేదు. ప్రతి హీరోకి ఒక సెపరేట్ స్టైల్ ఉంటుంది. ఐతే నాలుగైదు సినిమాలు చేసినా వైష్ణవ్ తేజ్ ఇంకా తన ఓన్ స్టైల్ ని పట్టుకోలేదు.
మెగా మేనల్లుడి కెరీర్ లో మరో ఉప్పెన లాంటి సినిమా పడాలి. అలాంటి సినిమా మరోటి పడితే కానీ మళ్లీ వైష్ణవ్ తేజ్ కెరీర్ ట్రాక్ ఎక్కే పరిస్థితి లేదు. ఎలా లేదన్నా అతని సినిమాలు కూడా మీడియం రేంజ్ బడ్జెట్ తో తెరకెక్కిస్తుండగా సినిమాల ఫలితాలు మాత్రం చాలా నిరాశ పరుస్తున్నాయి. అందుకే నిర్మాతలు కూడా వైష్ణవ్ తేజ్ తో సినిమా అంటే కాస్త ముందు వెనక ఆలోచిస్తున్నారు.
వైష్ణవ్ తేజ్ కూడా తన సత్తా చాటేలా మరో కథ కోసం ఎదురుచూస్తున్నాడు. ప్రస్తుతం సితార బ్యానర్ లోనే మరో సినిమా చేసేలా ప్లానింగ్ లో ఉన్నట్టు తెలుస్తుంది. మరి మెగా హీరోకి ఈసారైనా హిట్టు దక్కేనా లేదా అన్నది చూడాలి. మెగా సపోర్ట్ ఎంత ఉన్నా సొంత టాలెంట్ తోనే హీరోగా నిలబడాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ టైం లో మెగా ఫ్యామిలీ సపోర్ట్ కన్నా వైష్ణవ్ తేజ్ సొంతంగా సక్సెస్ అందుకోవడంలోనే మంచి కిక్ ఉంటుంది.