హారర్ లో మెగా హీరో ప్రయోగం

ఇక నెక్స్ట్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా నెవ్వర్ బిఫోర్ అనేలా ఓ ప్రయోగానికి సిద్ధమయ్యాడు.

Update: 2025-01-19 06:27 GMT

హారర్ కాన్సెప్టులు క్లిక్కయితే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు మామూలుగా ఉండవు. ఇక కాస్త కామెడీ టచ్ ఇస్తే ఆడియెన్స్ నుంచి వచ్చే రెస్పాన్స్ కూడా అద్బుతంగా ఉంటుంది. ఇక ప్రస్తుతం హారర్ లైన్స్ ను టచ్ చేస్తున్న దర్శకులు వీలైనంత కొత్తగా ఉండేలా చూసుకుంటున్నారు. డిఫరెంట్ బ్యాక్ డ్రాప్స్ తో ఎనౌన్స్ మెంట్స్ తోనే మంచి హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా నెవ్వర్ బిఫోర్ అనేలా ఓ ప్రయోగానికి సిద్ధమయ్యాడు.


వరుణ్ మెర్లపాక గాంధీ దర్శకత్వంలో పూర్తి భిన్నమైన హారర్ కామెడీ జానర్‌ను ఎంచుకోవడం విశేషం. వీటీ 15 పేరుతో రూపొందుతున్న ఈ చిత్రం ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. వెంకటేష్ ఉభయ నిర్మాణ సంస్థలు యూవీ క్రియేషన్స్ ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ కలిసి ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నాయి. వరుణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచింది.

పోస్టర్‌లో మంటల మధ్యలో కోరియన్ ఫైర్ డ్రాగన్ లోగోతో ఉన్న ఒక జార్ కనిపించడం ఆసక్తి రేపింది. ఈ చిత్రం ఓ ఇండో-కోరియన్ హారర్ కామెడీగా రూపొందనుందని, ఇది ప్రేక్షకులకు భిన్నమైన అనుభూతిని అందిస్తుందని స్పష్టమవుతోంది. "వెన్ హాంటింగ్ టర్న్స్ హిలేరియస్!" అనే ట్యాగ్‌లైన్‌తో, ఈ సినిమా వినోదంతో పాటు భయం కలిగించే అంశాలను సమపాళ్లలో అందిస్తుందని అర్థమవుతోంది.

ఈ చిత్రంలో వరుణ్ తేజ్ కొత్త లుక్‌లో కనిపించనున్నారు. ఇంతకు ముందు ఎప్పుడు కనిపించని విధంగా ఈ కథలో ఆయన పాత్ర ఉంటుందని సమాచారం. తన కెరీర్‌లో ఈ విభిన్న జానర్‌లో నటించడం వరుణ్ తేజ్‌కు ఇదే మొదటిసారి. దర్శకుడు మెర్లపాక గాంధీ ఈ చిత్రానికి ఒక వినూత్నమైన కథను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

ఇంతకు ముందు తొలిప్రేమ వంటి విజయవంతమైన చిత్రంలో సక్సెస్ సాధించిన వరుణ్ తేజ్, మళ్ళీ తిరిగి ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్ థమన్‌తో కలిసి పనిచేయనున్నారు. ఈ ప్రాజెక్ట్ షూటింగ్ మార్చి నుండి ప్రారంభమవుతుంది. నటీనటులు సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు. కోరియన్ థీమ్‌ను ప్రధానంగా తీసుకుని రూపొందించబడుతున్న ఈ హారర్ కామెడీ చిత్రం, వరుణ్ తేజ్ కెరీర్‌లో ఎలాంటి మ్యాజిక్ ను క్రియేట్ చేస్తుందో చూడాలి.

Tags:    

Similar News