వెంకీ అట్లూరి.. మొత్తానికి భయటపడినట్లే..
ఈ సినిమాల తర్వాత వెంకీ అట్లూరి ప్రేమకథలు తప్ప మరేమీ డీల్ చేయలేడనే కామెంట్స్ వినిపించాయి.
వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన ‘తొలిప్రేమ’ సినిమాతో వెంకీ అట్లూరి దర్శకుడిగా తన జర్నీ స్టార్ట్ చేశారు. అంతకు ముందు ‘స్నేహగీతం’ అనే సినిమాలో వెంకీ అట్లూరి ఒక హీరోగా నటించాడు. అయితే నటుడిగా కెరియర్ లో పెద్దగా గ్రోత్ లేకపోవడంతో దర్శకత్వం వైపు అడుగులేసాడు. మొదటి సినిమానే వరుణ్ తేజ్ తో చేసే ఛాన్స్ అందుకున్నాడు. ఆ మూవీతో సూపర్ హిట్ అందుకున్నాడు. తరువాత అక్కినేని అఖిల్ తో ‘మిస్టర్ మజ్ను’ మూవీ చేశాడు.
ఈ సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకుంది. అయితే ‘తొలిప్రేమ’ కథని కొద్దిగా మార్చి ‘మిస్టర్ మజ్ను’ చేసాడనే విమర్శలు వినిపించాయి. ఈ చిత్రం తర్వాత నితిన్ తో ‘రంగ్ దే’ చిత్రాన్ని వెంకీ అట్లూరి చేశాడు. ఈ సినిమాని రొమాంటిక్ లవ్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ తెరకెక్కించారు. మూవీ బాగుందనే టాక్ తెచ్చుకున్నా కమర్షియల్ సక్సెస్ కాలేదు. దీనికి కారణం ఇది కూడా వెంకీ అట్లూరి చేసిన మొదటి, రెండు సినిమాలకి భిన్నమైన కాన్సెప్ట్ కాకపోవడమే అనే టాక్ వినిపించింది.
ఈ సినిమాల తర్వాత వెంకీ అట్లూరి ప్రేమకథలు తప్ప మరేమీ డీల్ చేయలేడనే కామెంట్స్ వినిపించాయి. అయితే నాలుగో సినిమాని కంప్లీట్ గా జోనర్ మార్చేసి సోషల్ మెసేజ్ తో కాంటెంపరరీ స్టోరీ లైన్ తీసుకొని ‘సార్’ సినిమా చేశాడు. కార్పొరేట్ ఎడ్యుకేషన్ మీద సెటైరికల్ గా తెరకెక్కిన ఈ సినిమా సూపర్ సక్సెస్ అయ్యింది. దీని తర్వాత దుల్కర్ తో ‘లక్కీ భాస్కర్’ అంటూ మరో కొత్త కథతో ప్రేక్షకులని వెంకీ అట్లూరి మెప్పించాడు.
తెలుగులో ఇప్పటి వరకు ఎవ్వరు టచ్ చేయని బ్యాంకింగ్ సెక్టార్ లో కథని ‘లక్కీ భాస్కర్’ సినిమా ద్వారా వెంకీ అట్లూరి చెప్పి సక్సెస్ అయ్యాడు. సామాన్యులకి కూడా అర్ధమయ్యే విధంగా ఈ మూవీ కాన్సెప్ట్ ఉందని విమర్శకుల ప్రశంసలు సొంతం చేసుకుంది. ఈ మధ్యకాలంలో వచ్చిన బెస్ట్ సినిమాలలో ఇది ఒకటనే మాట వినిపిస్తోంది. ఈ చిత్రంతో వెంకీ అట్లూరి తన మీద ఉన్న విమర్శలకి పూర్తిగా చెక్ పెట్టాడు.
ఎలాంటి కథని అయిన వెంకీ అట్లూరి డీల్ చేయగలడనే అభిప్రాయం జనాల్లోకి వెళ్ళింది. ఈ నేపథ్యంలో వెంకీ అట్లూరి నెక్స్ట్ చేయబోయే సినిమా కోసం ఎలాంటి కథని ఎంచుకుంటాడనే ఆసక్తి అందరిలో ఉంది. కచ్చితంగా డిఫరెంట్ స్టోరీతో వస్తాడని ప్రేక్షకులు నమ్ముతున్నారు. మరి వెంకీ తన ఆరో సినిమా కోసం ఎలాంటి జోనర్ కథని రెడీ చేస్తాడో చూడాలనే ఆసక్తి అందరిలో ఉంది.