విజయ్ మూవీ.. కీర్తి ఓకేనా? డామినేట్ చేస్తుందా?
అదే సమయంలో తన లైనప్ లో ఉన్న చిత్రాలపై ఆడియన్స్ లో ఆసక్తి రేపుతున్నారని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు.;

టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. గట్టి కమ్ బ్యాక్ ఇచ్చేందుకు ఎదురుచూస్తున్న ఆయన.. కింగ్ డమ్ మూవీతో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. అదే సమయంలో తన లైనప్ లో ఉన్న చిత్రాలపై ఆడియన్స్ లో ఆసక్తి రేపుతున్నారని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు.
అయితే విజయ్ లైనప్ లో రౌడీ జనార్ధన్ ప్రాజెక్ట్ ఉన్న విషయం తెలిసిందే. రాజా వారు రాణి వారు మూవీతో మంచి పాపులారిటీ సంపాదించుకున్న రవి కిరణ్ కోలా దర్శకత్వం వహిస్తున్న ఆ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు గ్రాండ్ గా నిర్మించనున్నారు. భారీ బడ్జెట్ తో రూపొందించనున్నారు.
త్వరలోనే షూటింగ్ మొదలుపెట్టనున్నామని దిల్ రాజు రీసెంట్ గా ఓ కార్యక్రమంలో తెలిపారు. మే నెలలో చిత్రీకరణ స్టార్ట్ చేయనున్నారని.. 2026లో మూవీని రిలీజ్ చేయనున్నారని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. అన్నీ సరిగ్గా జరిగితే.. సంక్రాంతికి రిలీజ్ చేసే అవకాశం ఉందని కూడా ప్రచారం జరుగుతోంది.
అయితే రౌడీ జనార్ధన్ మూవీకి రుక్మిణీ వసంత్ ను హీరోయిన్ గా ఫిక్స్ చేశారని టాక్ వినిపించింది. కానీ కొన్ని కారణాల వల్ల ఆమె ఆఫర్ ను మిస్ చేసుకుందని తెలుస్తోంది. ఇప్పుడు స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ ను ఫిమేల్ లీడ్ రోల్ గా ఫిక్స్ చేశారని ప్రచారం సాగుతోంది. త్వరలోనే అధికారికంగా అనౌన్స్ కూడా చేయనున్నారని సమాచారం.
ఇప్పటికే విజయ్, కీర్తి స్క్రీన్ షేర్ చేసుకున్న విషయం తెలిసిందే. సూపర్ హిట్ మూవీ మహానటిలో కీర్తి సావిత్రిగా.. జర్నలిస్ట్ గా విజయ్ యాక్ట్ చేశారు. ఇప్పుడు రౌడీ జనార్ధన్ మూవీలో జంటగా నటించనున్నారట! అదే సమయంలో ఇప్పుడు సోషల్ మీడియాలో కొత్త చర్చ మొదలైంది. వారి కెమిస్ట్రీ ఎలా ఉండనుందోనని డిస్కస్ చేసుకుంటున్నారు.
నిజానికి.. రష్మికతో విజయ్ కెమిస్ట్రీ వేరే లెవెల్. వారిద్దరూ కలిసి గీత గోవిందం, డియర్ కామ్రేడ్ లో అద్భుతంగా నటించారు. ఆ తర్వాత విజయ్- రష్మిక కెమిస్ట్రీని ఏ హీరోయిన్ కూడా సరిపోల్చలేకపోయింది. దీంతో ఇప్పుడు కీర్తి సురేష్ తో విజయ్ కెమిస్ట్రీ.. రష్మికతో కెమిస్ట్రీని డామినేట్ చేస్తుందో లేదో చూడాలని అంటున్నారు. మరి వేచి చూడాలి ఏం జరుగుతుందో..