లియో.. ఇలా షాకిచ్చాడేంటి?
ఎవరో అనుకుని తనను రౌడీ గ్యాంగ్స్ టార్గెట్ చేస్తుంటే.. వాళ్ల నుంచి తప్పించుకోవడానికి కుటుంబాన్ని కాపాడుకోవడానికి హీరో చేసే పోరాటమే ఈ కథ
దసరాకి ఇండియాలో రిలీజవుతున్న చిత్రాల్లో అత్యధిక అంచనాలున్నది లియో సినిమా మీదే. విక్రమ్ లాంటి మెగా బ్లాక్‌బస్టర్ తర్వాత లోకేష్ కనకరాజ్‌తో తమిళ టాప్ స్టార్ విజయ్ జట్టు కట్టడంతో ఈ సినిమాపై మొదట్నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా అనౌన్స్మెంట్ వీడియో దగ్గర్నుంచి హైప్ పెరుగుతూ వచ్చిందే తప్ప తగ్గలేదు. రిలీజ్‌కు ఇంకో రెండు వారాలే ఉండగా.. ఈ రోజు లియో ట్రైలర్ లాంచ్ చేసింది చిత్ర బృందం. ట్రైలర్ ఒక రేంజిలో ఉంటుందని చాలా ఆశలు పెట్టుకున్నారు అభిమానులు. కానీ ఆ ట్రైలర్ తుస్సుమనిపించేసింది. విజయ్ అభిమానులు, ప్రేక్షకులు ఏదో ఊహించుకుంటే అక్కడ ఇంకేదో చూపించారు. ట్రైలర్ యాక్షన్ ప్యాక్డ్గా ఉంది కానీ.. కథ పరంగా ఏ ఎగ్జైట్మెంట్ కనిపించలేదు. అలాగే ట్రైలర్లో సర్ప్రైజ్లు అంటూ ఏమీ లేవు.
ఎవరో అనుకుని తనను రౌడీ గ్యాంగ్స్ టార్గెట్ చేస్తుంటే.. వాళ్ల నుంచి తప్పించుకోవడానికి కుటుంబాన్ని కాపాడుకోవడానికి హీరో చేసే పోరాటమే ఈ కథ. సినిమాలో విజయ్ ద్విపాత్రాభినయం చేశాడని ట్రైలర్లో రివీల్ చేసేశారు. ఐతే రెండో విజయ్ పాత్రను, తన వ్యవహారాన్ని సినిమాలో సర్ప్రైజ్ లాగా దాచిపెట్టినట్లు ఉన్నారు కానీ.. ట్రైలర్లో చూపించిన విజయ్ పాత్ర మాత్రం పూర్తిగా నిరాశ పరిచింది. విజయ్ ఆ పాత్రలో మిస్ ఫిట్ అన్నట్లు కనిపించాడు. తన విగ్, ఓవరాల్ గెటప్ కూడా సరిగా కుదర్లేదు.
అనిరుధ్ బ్యాగ్రౌండ్ స్కోర్ సైతం నిరాశ పరచడం ఆశ్చర్యం కలిగించే విషయం. ట్రైలర్ మొత్తంలో అసలు హై పాయింట్స్ అన్నవే కనిపించలేదు. హీరోయిన్ త్రిష కూడా చాలా సాధారణంగా కనిపించింది. విలన్ సంజయ్ దత్ కూడా పెద్దగా ఇంపాక్ట్ వేయలేకపోయాడు. అన్నింటికీ మించి లోకేష్ మల్టీవర్స్ ఛాయలు కూడా ఇందులో కనిపించలేదు. మొత్తంగా ట్రైలర్‌తో తీవ్రంగా నిరాశపరిచిన లియో టీం.. ఇక సినిమాతో ఏమేర మెప్పిస్తుందో చూడాలి.