60లో 30 ఆయనకే ఇచ్చారట..!

అయితే మరోసారి విక్రమ్‌కి బ్యాడ్‌ టైం కంటిన్యూ అయింది. ఈ సినిమా ఆర్థిక ఇబ్బందుల కారణంగా విడుదల సమయంలో కాస్త ఇబ్బందులు ఎదుర్కొంది.;

Update: 2025-04-02 08:20 GMT
60లో 30 ఆయనకే ఇచ్చారట..!

'తంగలాన్‌' నిరాశ పరచడంతో విక్రమ్‌ ఫ్యాన్స్‌ 'వీర ధీర శూర 2' సినిమాపై చాలా అంచనాలు పెంచుకున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా విక్రమ్‌కి టైం కలిసి రావడం లేదు. ఎంత కష్టపడ్డా ఫలితం దక్కడం లేదు. ప్రతి సినిమాకి పడ్డ కష్టం బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. దాంతో వీర ధీర శూర సినిమా ఫలితం ఎలా ఉంటుందా అనే అనుమానాలు కొందరు వ్యక్తం చేస్తే, కొందరు ఫ్యాన్స్ మాత్రం ఈ సినిమాపై చాలా నమ్మకంతో ఎదురు చూశారు. విక్రమ్‌ తన ప్రతి సినిమాకు ఎలా అయితే కష్టపడుతాడో ఈ సినిమా కోసం కూడా కష్టపడ్డాడు. అయితే మరోసారి విక్రమ్‌కి బ్యాడ్‌ టైం కంటిన్యూ అయింది. ఈ సినిమా ఆర్థిక ఇబ్బందుల కారణంగా విడుదల సమయంలో కాస్త ఇబ్బందులు ఎదుర్కొంది.

'వీర ధీర శూర 2' సినిమా ఆర్థిక ఇబ్బందుల కారణంగా విడుదల రోజు కోర్ట్‌ స్టేను ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే నిర్మాతలు వేగంగా స్పందించడంతో ఆ రోజు సాయంత్రం వరకు స్టే ఎత్తి వేయడం, థియేటర్‌లో సినిమా రిలీజ్ కావడం జరిగింది. వీర ధీర శూర 2 సినిమాకు ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదురయ్యాయి అనే ప్రచారం జరిగిన నేపథ్యంలో అసలు ఈ సినిమా బడ్జెట్‌ ఎంత అనే చర్చ మొదలైంది. చిత్ర యూనిట్‌ సభ్యులు ఇటీవల బడ్జెట్‌తో పాటు విక్రమ్‌ పారితోషికం, ఇతర సినిమా మేకింగ్‌ కాస్ట్‌ గురించి అనధికారికంగా చెప్పుకొచ్చారు. ఆఫ్ ది రికార్డ్‌ లెక్కల ప్రకారం వీర ధీర శూర 2 సినిమా కోసం నిర్మాతలు రూ.60 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.

ఈ సినిమా కోసం ఖర్చు చేసిన మొత్తం రూ.60 కోట్లలో విక్రమ్‌కి పారితోషికంగా రూ.30 కోట్లు ఇచ్చారని తెలుస్తోంది. మిగిలిన రూ.30 కోట్లతో ఇతర నటీ నటుల పారితోషికాలు ఇవ్వడంతో పాటు, సినిమా మేకింగ్‌కి ఖర్చు చేశారని తమిళ మీడియాలో కథనాలు వస్తున్నాయి. కేవలం 30 కోట్లలో నటీనటుల పారితోషికాలు, మేకింగ్‌ ఎలా సాధ్యం అంటూ ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి ఈ సినిమా మీడియం రేంజ్‌ బడ్జెట్‌తో రూపొందిన కారణంగా నిర్మాతలు సేఫ్ అని కోలీవుడ్‌ వర్గాల్లో బలంగా టాక్‌ వినిపిస్తుంది. తమిళనాట సినిమాకు పాజిటివ్‌ రెస్పాన్స్ వచ్చిన నేపథ్యంలో మంచి వసూళ్లు నమోదు అవుతున్నాయి. మోహన్‌లాల్‌ నటించిన ఎల్‌ 2 : ఎంపురాన్‌ సినిమా ఉన్నప్పటికీ ఈ సినిమాకు డీసెంట్‌ ఓపెనింగ్స్ నమోదు అయ్యాయట.

ఈ సినిమాకు పాజిటివ్‌ రెస్పాన్స్ దక్కిన నేపథ్యంలో ప్రిక్వెల్‌ను చేస్తామంటూ దర్శకుడు ఎస్‌ యు అరుణ్‌ కుమార్‌ ప్రకటించాడు. విభిన్న మాస్ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన వీర ధీర శూర 2 సినిమా విక్రమ్‌ ఫ్యాన్స్‌కి సంతృప్తిని కలిగించింది అని తమిళ మీడియాలో కథనాలు వస్తున్నాయి. తెలుగులోనూ విడుదలైన ఈ సినిమాకు పెద్దగా పాజిటివ్ రెస్పాన్స్ రాలేదు, దాంతో వసూళ్లు సైతం అంతంత మాత్రమే ఉన్నాయి. వరుస ఫ్లాప్స్‌ పడ్డా విక్రమ్‌ రూ.30 కోట్ల పారితోషికం అందుకోవడం ఆశ్చర్యంగా ఉందని కొందరు కామెంట్‌ చేస్తుంటే, యంగ్‌ హీరోలకు సమానంగా విక్రమ్‌ మరిన్ని సినిమాలు చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Tags:    

Similar News