బిగ్ బాస్ 8 : యాంకరమ్మ వాటి కోసమే హౌస్ లోకి వెళ్లిందా..?

ఐతే బిగ్ బాస్ సీజన్ 8 లో వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ కంటెస్టెంట్ అవుతుంది అనుకున్న విష్ణు ప్రియ అసలేమాత్రం ప్రభావం చూపించట్లేదు.

Update: 2024-10-11 09:30 GMT

బిగ్ బాస్ సీజన్ 8 లో యాంకర్ విష్ణు ప్రియ మోస్ట్ ఫేవరేట్ కంటెస్టెంట్ గా ఈ సీజన్ లోకి ఎంట్రీ ఇచ్చింది. గత రెండు మూడు సీజన్ల నుంచి ఆమె హౌస్ లోకి వస్తుందని అనుకోగా ఫైనల్ గా సీజన్ 8 లో సర్ ప్రైజ్ ఎంట్రీ ఇచ్చింది. ఐతే యాంకర్స్ కి ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉంటారు. సోషల్ మీడియా ఫాలోవర్స్ సంఖ్య ఎక్కువే. ఐతే అది వారు హౌస్ లో ఆడే ఆటని బట్టి బయట సపోర్ట్ ఉంటుంది. ఐతే బిగ్ బాస్ సీజన్ 8 లో వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ కంటెస్టెంట్ అవుతుంది అనుకున్న విష్ణు ప్రియ అసలేమాత్రం ప్రభావం చూపించట్లేదు.

పోనీ ఆట ఆడట్లేదు ఆమె సత్తా చూపించే ఆట రాలేదు అనుకుంటే.. ఆమె పృధ్వితో చేస్తున్న అతిని ప్రేక్షకులు చూడలేకపోతున్నారు. పృధ్వితో తను చేసే పనులన్నీ కంటెంట్ లో భాగమే అని స్పష్టంగా తెలుస్తున్నా తెలియకుండానే పృధ్వి మాయలో పడి విష్ణు ప్రియ తన ఆటని పూర్తిగా మర్చిపోయిందని చెప్పొచ్చు. హౌస్ లో మొన్నటిదాకా ఉన్న వారితోనే కాకుండా పృధ్వి వైల్డ్ కార్డ్ గా వచ్చిన నయని పావనితో కూడా సరదాగా ఉంటున్నాడు. అది విష్ణు ప్రియ భరించలేకపోతుంది.

గురువారం ఎపిసోడ్ లో పృధ్విని డైరెక్ట్ గా నీకు నయని పావని నచ్చిందా అని ఆడిగేసింది. అతను మాత్రం ఏ చెట్టు గాలి అన్నట్టుగా లేదు అని చెప్పాడు. ఐతే విష్ణు ప్రియ హౌస్ లోకి వెళ్లి తన పూర్తి ఫోకస్ అంతా పృధ్వి మీదనే పెట్టింది. అందుకే ఆమె గ్రాఫ్ పడిపోతూ వచ్చింది. ఐతే నామినేషన్స్ లో ఉన్నా కూదా ఎలాగోలా బయట పడుతున్నా ఇలానే చేస్తే ఆమె త్వరలోనే ఎలిమినేట్ అవడం ఖాయమని అంటున్నారు.

బిగ్ బాస్ సీజన్ 8 లో టాప్ 5 లో విష్ణు ప్రియ ఉంటుందేమో అనుకున్న వారికి ఆమె పూర్తిగా నిరాశ పరుస్తుంది. అంతేకాదు హౌస్ లో ఒక లేడీ కంటెస్టెంట్ సిగరెట్ కూడా కాల్చుతుందని సోనియా పలు ఇంటర్వ్యూలో చెప్పగా అది విష్ణు ప్రియానే అంటూ కొందరు వార్తలు రాస్తున్నారు. తనేదో బిగ్ బాస్ హౌస్ కి ఎంజాయ్ చేయడానికి వచ్చినట్టు ఉంది తప్ప అసలేమాత్రం సీరియస్ నెస్ కనిపించట్లేదు. అందుకే ఆమె ఓటింగ్ పర్సెంటేజ్ కూడా పెరగట్లేదు. మరి విష్ణు ప్రియ ఆట మార్చుకుంటుందా లేదా ఇలానే కొనసాగుతుందా అన్నది చూడాలి.

Tags:    

Similar News