సుక్కు.. చరణ్ కంటే ముందు మరొకటి!
లాంగ్ రన్ లో ఈ సినిమా కలెక్షన్స్ 1500 కోట్ల వరకు చేరొచ్చని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప 2' గ్లోబల్ లెవల్ లో కలెక్షన్స్ పరంగా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తోంది. యూఎస్ లో ఇప్పటికే 10 మిలియన్ డాలర్స్ క్రాస్ చేసిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 1000 కోట్ల క్లబ్ లో చేరిపోయింది. కేవలం ఆరు రోజుల్లోనే ఈ ఫీట్ అందుకున్న ఫస్ట్ ఇండియన్ మూవీగా 'పుష్ప 2' నిలిచింది. లాంగ్ రన్ లో ఈ సినిమా కలెక్షన్స్ 1500 కోట్ల వరకు చేరొచ్చని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.
ఇక నార్త్ ఇండియన్ బెల్ట్ లో ఇప్పటికే 350+ కోట్లకి పైగా కలెక్షన్స్ ని ఈ సినిమా కొల్లగొట్టింది. ఓవరాల్ గా 7000 కోట్ల వరకు ఈ మూవీ అక్కడ వసూళ్లు చేస్తుందని అనుకుంటున్నారు. అదే జరిగితే ఈ సినిమా ఖాతాలో అరుదైన రికార్డ్ చేరుతుంది. 'పుష్ప' సిరీస్ తో సుకుమార్ పాన్ ఇండియా డైరెక్టర్ గా మారిపోయింది. అతని బ్రాండ్ కూడా స్ట్రాంగ్ గా ఎస్టాబ్లిష్ అయ్యింది.
డిసెంబర్ ఆఖరు వరకు ఈ మూవీ హంగామా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఆపై సుకుమార్ కొద్దిగా ఫ్రీ అవుతారు. కొద్ది రోజులు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసి రిలాక్స్ అవుతారు. తరువాత నెక్స్ట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తారని తెలుస్తోంది. అయితే సుకుమార్ 'పుష్ప 2' తర్వాత రామ్ చరణ్ తో 'RC 17' మూవీ స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ చేస్తాడని అందరు అనుకున్నారు. కానీ అంతకంటే ముందుగా నెట్ ఫ్లిక్స్ కోసం ఒక డాక్యుమెంటరీ చేయబోతున్నాడంట.
అది కూడా 'పుష్ప' స్టోరీతోనే ఉండబోతోంది. ఈ మూవీ కోసం గంధపుచెట్లు, వాటి పెంపకం, ఎగుమతి, అక్రమ రవాణా, ఎక్కడికి ఎక్స్ పోర్ట్ అవుతాయి. ఆ గంధపు చెట్లని వేటికోసం ఉపయోగిస్తారు వంటి విషయాల గురించి సుకుమార్ చాలా రీసెర్చ్ చేశారంట. మూవీ స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్నప్పుడే చాలా సమాచారం సేకరించారని తెలుస్తోంది. 'పుష్ప 2' కోసం అందులో కొంత మాత్రమే ఉపయోగించారంట.
మిగిలిన ఇన్ఫర్మేషన్ తో నెట్ ఫ్లిక్స్ కోసం డాక్యుమెంటరీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. నెట్ ఫ్లిక్స్ కూడా ఈ మధ్యకాలంలో ఇంటరెస్టింగ్ కథలతో డాక్యుమెంటరీ ఫిల్మ్స్ చేస్తోంది. వాటికి మంచి ఆదరణ లభిస్తోంది. ఇండియాలో కేవలం చిత్తూరు పరిసరాల్లో మాత్రమే దొరికే గంధపు చెట్లకి విపరీతమైన డిమాండ్ ఉంది. కోట్ల విలువైన కలప ఎప్పటికప్పుడు పట్టుబడుతూ ఉంటుంది. దీనికోసం తమిళనాడు నుంచి కార్మికులు వస్తూ ఉంటారు. ఈ అంశాలు అన్ని కూడా సుకుమార్ చేయబోయే డాక్యుమెంటరీలో ఉంటాయని తెలుస్తోంది. దీని తర్వాత 'RC 17' మూవీ స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ చేస్తారని టాక్.