కొడుకు పెళ్లి..మరి లిక్కర్ కింగ్ వస్తాడా?
అలాగే ఈ వేడుకకు ఎవరెవరు హాజరవుతారు? అన్న దానిపై స్పష్టత లేదు.
లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా ఇంట పెళ్లి భాజాలకు రంగం సిద్దమవుతోంది. కుమారుడు సిద్దార్ధ్ మాల్యా చిరాకల ప్రేయసి జాస్మిత్ ని వివాహం చేసుకుంటున్నాడు. ఈ వారంలోనే ఇద్దరి వివాహం జరగనుందని సమాచారం. అయితే ఏ తేదీని వివాహం జరుగుతంది అన్నది క్లారిటీ రాలేదు. అలాగే ఈ వేడుకకు ఎవరెవరు హాజరవుతారు? అన్న దానిపై స్పష్టత లేదు. కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలోనే జరుగుతుందా? లేక అంగరంగ వైభవంగా ప్లాన్ చేస్తున్నారా? అన్నది కూడా క్లారిటీ లేదు.
సిద్దార్ధ్-జాస్మిన్ చాలా కాలంగా స్నేహితులు . గత ఏడాది హలోవీన్ సందర్భంలో రింగ్ తొడిగి ప్రపోజ్ చేసాడు. అప్పటి నుంచి పెళ్లి ఎప్పుడు అంటూ నెట్టింట ప్రచారం సాగింది గానీ ఎలాంటి సమాచారం రాలేదు. తాజాగా వివాహమనే వార్త రావడం హాట్ టాపిక్ గామారింది. మరి ఈ పెళ్లికి లిక్కర్ కింగ్ హాజరవుతాడా? లేదా? అన్నది చూడాలి. విజయ్ మాల్యా- సమీరా త్యాబ్జి దంపతులకు సిద్దార్ధ్ మాల్యా జన్మించాడు.
లాస్ ఏంజెల్స్ లో పుట్టి లండన్, యూఏయిలో పెరిగాడు. లండన్ రాయల్ సెంట్రల్ స్కూల్ ఆఫ్ స్పీచ్ అండ్ డ్రామా నంచి డిగ్రీ పొందాడు. అటుపై మోడలింగ్ వైపు వచ్చాడు. ఐపీఎల్ తరుపున ఆర్సీబీ డైరెక్టర్ గా కొనసాగాడు. ఆ తర్వాత కింగ్ ఫిషర్ కి మోడల్ జడ్జి గా పలువరు హీరోయిన్లతో ఫోజులిచ్చాడు. నటుడిగానూ అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. మెంటల్ హెల్త్ అండ్ అవేర్ నెస్ , చిన్నారుల మానసిక ఆరోగ్యం-అవగాహనపై రెండు పుస్తకాలు కూడా రాసాడు. జాస్మిన్ అమెరికాకు చెందిన అమ్మాయి. మోడల్ గా పనిచేసింది. అంతకు మించి ఆమె కుటుంబ వివరాలేవి తెలియలేదు.
బ్యాంకులకు తొమ్మిది వేలకోట్లు పంగనామం పెట్టి లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా విదేశాలకు చెక్కేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం యూకే లో ఉన్నాడు. అక్కడ ఎంచక్కా లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నాడు. అక్కడ కూడా భారీగా ఆస్తులు కూడబెట్టిన సంగతి తెలిసిందే.