కుమార్తెపై అసభ్య ప్రవర్తన... కువైట్ నుంచి వచ్చి మరీ చంపిన తండ్రి!

దీంతో... ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Update: 2024-12-12 10:00 GMT

తన బిడ్డ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడంటూ బంధువుపై స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసినా పోలీసులు సరిగా స్పందించకపోవడంతో ఓ వ్యక్తి ఏకంగా కువైట్ నుంచి వచ్చి అతడిని హత మార్చాడు.. తిరిగి కువైట్ కు వెళ్లిపోయి.. ఓ వీడియో విడుదల చేశాడు. దీంతో... ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

అవును... తమకు అన్యాయం జరిగిందంటూ ఎవరైనా ఆశ్రయించినప్పుడు.. పోలీసులు సరిగ్గా స్పందించకపోతే బాధితుల్లో ఎంత ఆవేదన కలుగుతుందో, దాని ఫలితం ఒక్కోసారి ఎలాంటి పరిణామాలు దారితీస్తుందో తెలియజేసే ఉదంతం తెరపైకి వచ్చింది! తన బిడ్డ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడంటూ ఫిర్యాదు చేసినా స్పందన సరిగా లేదనే ఆరోపణా వైరల్ గా మారింది.

వివరాళ్లోకి వెళ్తే... అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె మండలం కొత్తమంగంపేటకు చెందిన ఆంజనేయ ప్రసాద్, ఆమె భార్య చంద్రకళ కువైట్ లో ఉంటున్నారు. దీంతో.. వారి తమ కుమార్తె (12)ను ఊళ్లో ఉంటున్న చంద్రకళ చెల్లెలు లక్ష్మి - వెంకటరమణ దంపతుల వద్ద ఉంచారట. అయితే ఇటీవల తమ కుమార్తెపై దారుణం జరిగిందని ప్రసాద్ చెబుతున్నారు.

ఇందులో భాగంగా... ఇటీవల వెంకటరమణ తండ్రి.. మనవరాలి వరసయ్యే ఆ బాలికపట్ల అసభ్యంగా ప్రవర్తించాడని అంటున్నారు. ఆమె నిద్రపోతున్న సమయంలో అత్యంత తప్పుడు పనులు చేశాడని.. దీంతో... ఉలిక్కి పడిన ఆ బాలిక ఒక్కసారిగా గట్టిగా అరిచిందని చెబుతున్నారు. దీంతో... ఈ విషయాన్ని బాలిక తన తల్లికి చెప్పిందని అంటున్నారు.

దీంతో... ఆమె వెంటనే చెల్లెలు లక్ష్మికి ఫోన్ చేసి అడగ్గా.. ఆమె సరిగా స్పందించలేదు. దీంతో.. తీవ్ర ఆందోళనతో కువైట్ నుంచి వచ్చిన చంద్రకళ.. ఓబులవారి పల్లె పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో... పోలీసులు నిందితుడు ఆంజనేయులును పిలిపించి మందలించి వదిలేశారంట. ఆమె ఈ విషయాన్ని కువైట్ లో ఉన్న భర్త ఆంజనేయ ప్రసాద్ కు చెప్పింది.

మరోపక్క.. ఆ బాలికపై అసభ్యంగా ప్రవర్తించినందూ కేసు పెట్టగా.. తమ వద్ద పోలీసులు డబ్బులు తీసుకుని వదిలేశారనే ప్రచారం ఒకవైపు నుంచి బలంగా జరుగుతుందని అంటున్నారు. ఈ సమయంలో తీవ్ర ఆవేదనకు గురైన ఆంజనేయ ప్రసాద్ కువైట్ నుంచి ఇండియాకు వచ్చారు. అనంతరం శనివారం తెల్లవారుజామున ఆంజనేయులుని హత మార్చాడు!!

తర్వాత తిరిగి కువైట్ కు వెళ్లిపోయాడు. ఈ విషయాన్ని వివరిస్తూ తాజాగా సోషల్ మీడియా వేదికగా ఓ వీడియో పోస్ట్ చేశాడు. ఆడ బిడ్డ తండ్రిగా తను చేసింది న్యాయమేనని.. దీనిపై అంతా ఓ సారి ఆలోచించాలని.. ఈ వీడియో సీఎం చంద్రబాబుకు చేరేవరకూ షేర్ చేయాలని.. పోలీసులకు తాను లొంగిపోతానని వెల్లడించాడు.

ఈ వ్యవహరంలో తనవైపు మాట్లాడమని అడగడం లేదు కానీ.. చట్ట ప్రకారం న్యాయం జరగకే తాను ఈ పనికి పూనుకోవాల్సి వచ్చిందని ఆంజనేయ ప్రసాద్ వెల్లడించాడు. ఈ ఘటనలో తన కుటుంబ సభ్యులకు కానీ, తన భార్య తరుపువారికి కానీ ఏమాత్రం సంబంధం లేదని.. ఇది తానొక్కడినే చేశానని తెలిపాడు!

Tags:    

Similar News