కనిపించకుండా పోయిన భార్య.. భర్త కంప్లైంట్ తో షాకింగ్ న్యూస్
ఏడు నెలలు గర్భవతి అయిన భార్య కనిపించకుండా పోవటంతో సదరు భర్త టెన్షన్ తో విలవిలలాడాడు.
ఏడు నెలలు గర్భవతి అయిన భార్య కనిపించకుండా పోవటంతో సదరు భర్త టెన్షన్ తో విలవిలలాడాడు. పోలీస్ స్టేషన్ కువెళ్లి.. తన భార్య కనిపించకుండా పోయిందని.. ఆమె ఆచూకీ వెతికి పట్టుకోవాలని కోరుకున్నాడు. గుజరాత్ లోని అహ్మదాబాద్ లో చోటు చేసుకున్న ఈ ఘటనపై పోలీసులు ఫోకస్ చేసిన తర్వాత కానీ విస్తుపోయే విషయాలు వెలుగు చూశాయి. భర్త ఫిర్యాదు నేపథ్యంలో ప్రాథమిక విచారణ చేపట్టిన పోలీసులకు.. ఆమె సేఫ్ గా ఉందని..కాకుంటే తన లెస్బియన్ ప్రియురాలితో కలిసి పరారైనట్లుగా తేల్చారు
దీంతో.. సదరు భర్తకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యింది. అసలు విషయం ఏమన్నది తెలుసుకునేందుకు అత్తమామల్ని ప్రశ్నించగా వారు అసలు విషయాన్ని బయటపెట్టారు. కనిపించకుండా పోయిన మహిళకు పెళ్లికి ముందే స్వలింగ సంపర్కురాలైన లెస్బియన్ ప్రియురాలు ఉంది. ఆమెతో సదరు మహిళకు పెళ్లికి ముందు నుంచి రిలేషన్ ఉంది. ఈ విషయం ఆమె కుటుంబ సభ్యులకు కూడా తెలుసు,
ఈ విషయాన్ని బయటకు చెప్పుకోలేక.. పెళ్లి చేసేస్తే పరిస్థితులు చక్కబడతాయన్న ఉద్దేశంతో ఒక సంబంధాన్ని చూశారు. వీరి పెళ్లిని 2022లో చేశారు. ప్రస్తుతం ఆమె ఏడు నెలల గర్భవతి. ఈ అక్టోబరులో ఆమె కనిపించకుండా పోయింది. దీంతో సదరు భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ జరిపిన పోలీసులు ఆమె వివరాలు సేకరించారు. ఆమె కనిపించకుండా వెళ్లిపోవటానికి కారణాల్ని తేల్చారు. ఆమె క్షేమంగా ఉందనన విషయాన్ని ఖరారు చేసుకున్నప్పటికి.. ఆమె ఎక్కడ ఉందన్న వివరాలు మాత్రం రాబట్టలేకపోయారు
ఈ నేపథ్యంలో కనిపించకుండా పోయిన తన భార్య తిరిగి రాకపోవటంపై సదరు భర్త కోర్టును ఆశ్రయించారు. గుజరాత్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో స్పందించిన న్యాయస్థానం.. డిసెంబరు 24 లోపు ఆమెను కోర్టు ఎదుట ప్రవేశ పెట్టాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో.. ఇప్పుడామె ఆచూకీతో పాటు.. ఆమెను కోర్టు ఎదుట హాజరుపర్చేందుకు పోలీసులు ఉరుకులు పరుగులు తీస్తున్నారు. ఈ ఉదంతం స్థానికంగా సంచలనంగా మారింది.