దుబాయ్ అని చెప్పి పాక్ లో దింపేశారు.. 22 ఏళ్ల ఎదురుచూపులకు తెర!

ఈ క్రమంలో కొంతమంది ఎన్నో ఇబ్బందులు పడి పడి చివరికి కట్టుబట్టలతో స్వదేశానికి తిరిగి వస్తుంటారు.

Update: 2024-12-17 21:30 GMT

విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని, మంచి జీతం వస్తుందని, ఫలితంగా ఇంట్లో పిల్లల భవిష్యత్తు బాగంటుందంటూ చాలా మంది ఏజెంట్లు పలువురు జనాలకు గాలం వేస్తుంటారు. దీంతో.. ఆ ఏజెంట్ల మాయ మాటలు నమ్మి చాలా మంది దెబ్బతినేస్తుంటారు. ఈ క్రమంలో కొంతమంది ఎన్నో ఇబ్బందులు పడి పడి చివరికి కట్టుబట్టలతో స్వదేశానికి తిరిగి వస్తుంటారు.

ఇటీవల కాలంలో కూడా ఈ విధంగా ఇబ్బందులు పడినవాళ్లు యూట్యూబ్ లో చాలా మంది విదేశాల నుంచి రిక్వస్టులు చేసుకోవడం.. దానిపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు స్పందిస్తుండటం జరుగుతుంటుంది. ఈ క్రమంలో ఇటీవల నారా లోకేష్ కూడా స్పందించి విదేశాల్లో చిక్కుకున్న తెలుగు వ్యక్తిని స్వదేశానికి రప్పించారు.

ఈ క్రమంలో సుమారు 22 ఏళ్ల క్రితం ఏజెంట్ చేతిలో మోసపోయి పాక్ లో ఇరుక్కుపోయిన ఓ మహిళ కథ తాజాగా తెరపైకి వచ్చింది. ఆమెను దుబాయ్ కి పంపిస్తాను అని చెప్పిన ఏజెంట్ మోసం చేశాడని.. ఆమెను పాకిస్థాన్ లోని హైదరాబాద్ జిల్లాకు తీసుకెళ్లాడని.. ఈ క్రమంలో అప్పటి నుంచి అటు స్వదేశానికి రాలేక నలిగిపోయిందనే విషయం తెరపైకి వచ్చింది.

అవును... ఏజెంట్ చేతిలో మోసపోయిన ఓ మహిళ.. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా గత 22 ఏళ్లుగా పాకిస్థాన్ లో చిక్కుకుపోయి, కుటుంబంతో కాంటాక్ట్ లేక, అయిన వారు ఎలా ఉన్నారో తెలియక, తెలిసినవారు ఎవరూ తెలియక నరకయాతన అనుభవించింది. ఈ క్రమంలో ఓ యూట్యూబర్ ద్వారా అసలు విషయం బయటపడింది. తాజాగా భారత్ కు తిరిగివచ్చారు.

వివరాళ్లోకి వెళ్తే... ముంబైకి చెందిన హమీదా బానో అనే మహిళ.. భర్త మరణించడంతో కుటుంబ బాధ్యతను తీసుకున్నారు. దీంతో... దోహా, ఖతార్, దుబాయ్, సౌదీఅరేబియా దేశాల్లో వంట మనిషిగా పని స్తూ..అలా వచ్చిన డబ్బులు భారత్ లో ఉన్న తన నలుగురు పిల్లలకు పంపేవారు. ఇలా సాగుతున్న వారి జీవితంలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది.

ఇందులో భాగంగా... 2002లో దుబాయ్ వెళ్లేందుకు ఆమె ప్రయత్నించగా.. ఏజెంట్ చేతిలో మోసపోయారు. ఈ క్రమంలో ఆమెను పాకిస్థాన్ లోని హైదరాబాద్ జిల్లాకు తీసుకెళ్లి వదిలేశారంట. దీంతో... ఆమె సుమారు 22 ఏళ్లుగా అక్కడే చిక్కుకుపోయారు.

అయితే... 2022లో ఓ యూట్యూబర్ తన బ్లాగ్ కోసం ఆమెను పలకరించడం.. ఆమె విషయాలు తెలుసుకోవడంతో అసలు విషయం బయటకు వచ్చింది. దీంతో.. ఆ వెంటనే ఆమెను తిరిగి భారత్ కు తీసుకొచ్చేందుకు ఆమె కుటుంబ సభ్యులు ప్రయత్నించారు. ఈ క్రమంలో తాజాగా అధికారుల సాయంతో భారత్ కు రప్పించారు.

ఈ సందర్భంగా స్పందించిన హమీదా బానో... తన కుటుంబ సభ్యులను మళ్లీ కలుసుకున్నందుకు ఎంతో అనందంగా ఉందని చెప్పారు. అసలు తాను తిరిగి భారత్ కు వస్తాననే ఆశ కోల్పోయానని.. కానీ, ఇలా తిరిగి స్వదేశానికి తిరిగిరావడం సంతోషంగా ఉందని అన్నారు.

Tags:    

Similar News