ఏఐలో పెట్టుబడులు పెడుతున్నారా? ఒక్కసారి ఇది చదవండి!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ).. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అన్ని రంగాల్లోనూ దీనిని ప్రవేశ పెడుతు న్న పరిస్థితి కనిపిస్తోంది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ).. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అన్ని రంగాల్లోనూ దీనిని ప్రవేశ పెడుతు న్న పరిస్థితి కనిపిస్తోంది. విద్యారంగం నుంచి వైద్య రంగం నుంచి ఎంటర్‌టైన్‌మెంటు నుంచి ఎంటైర్ అన్ని రంగాల్లోనూ ఏఐ దూకుడు పెరుగుతోంది. దీంతో పెట్టుబడి దారులు ఏఐపై దృష్టి పెడుతున్నారు. సహజంగానే భవిష్యత్తులో డిమాండ్ ఉన్నవాటినే పెట్టుబడి దారులు ఎంచుకుంటారు. ఇప్పుడు ఏఐని కూడా అలానే ఎంచుకుంటున్నారు.
ఏఐలో పెట్టుబడులు పెడితే పెద్ద ఎత్తున లాభాలు కురుస్తాయని భావిస్తున్నవారు పెరుగుతున్నారు. అయితే.. ఇక్కడే నిపుణులు కొన్ని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఏఐలో పెట్టుబడులు.. భవిష్యత్తులో ఏఐ సామర్థ్యం వంటి విషయాలపై అధ్యయనం చేసిన అమెరికాలోని మస్సాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎకనమిస్టు.. డాక్టర్ డారన్ అసిమో ఈ పెట్టుబడులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే పదేళ్ల కాలంలో ఏఐ పెద్ద ఎత్తున విస్తరిస్తుందన్నది కేవలం భ్రమేనని తెలిపారు.
ప్రపంచ వ్యాప్తంగా ఏఐ ప్రభావం ఎలా ఉన్నప్పటికీ.. ఉద్యోగరంగంలో మాత్రం ఏఐ ప్రభావం పెద్దగా ఉండబోదన్నారు. తద్వారా.. ఉద్యోగ కల్పన తప్పదని చెప్పుకొచ్చారు. వచ్చే దశాబ్ద కాలంలో ఏఐ కేవలం 5 శాతం మాత్రమే ప్రభావం చూపిస్తుందన్నారు. దీనివల్ల 95 శాతం మంది ఉద్యోగులను కూడా కంపెనీలు కొనసాగించకతప్పదని డారన్ చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో ఏఐని నమ్ముకుని భారీ మొత్తంలో పెట్టుబడు లు పెట్టడం ఎవరికీ క్షేమం కాదన్నారు. ఏఐలో పెట్టే పెట్టుబడులతో ఎలాంటి ప్రొడక్టు ఉండబోదన్నారు. కేవలం 5 శాతం మార్పుతో ఆర్థిక విప్లవం ఏమీ రాబోదన్నారు.
ఆ కంపెనీలకు ఇబ్బందే!
ఏఐలో భారీ ఎత్తున పెట్టుబడులు పెడుతున్న మైక్రోసాఫ్ట్, మెటా(ఎలాన్ మస్క్ కంపెనీ), అమెజాన్‌ల పరిస్థితి భవిష్యత్తులో ఇబ్బందిగా మారనుందని డాక్టర్ మారన్ చెప్పారు. ఈ పెట్టుబడులకు రాబడులు పెద్దగా ఉండే అవకాశం లేదన్నారు. చాట్-జీపీటీ వంటి వాటిపై విశ్వసనీయత లేదని.. దీంతో వ్యక్తుల స్థానాన్ని అవి భర్తీ చేయలేవని పేర్కొన్నారు. ఇప్పుడున్న ఏఐ ప్రభావం 2025 తర్వాత ఉండకపోవచ్చని.. దీంతో పెట్టుబడులు పెట్టేవారు ఆలోచించుకోవాలని మారన్ సూచించారు.