ట్రంప్ కు బైడెన్ ఊహించిన షాక్... తెరపైకి 1953 నాటి యాక్ట్!

గత ఏడాది నవంబర్ లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్.. ఈ నెల 20న ప్రమాణ స్వీకారం చేయబోతున్న సంగతి తెలిసిందే.

Update: 2025-01-07 11:30 GMT

గత ఏడాది నవంబర్ లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్.. ఈ నెల 20న ప్రమాణ స్వీకారం చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో.. బాధ్యతలు స్వీకరించిన అనంతరం డొనాల్డ్ ట్రంప్ చేపట్టే కార్యక్రమాల్లో.. శిలాజ ఇంధన ఉత్పత్తిని పెంచడం కూడా ఒకటి. అయితే.. దానికి ఊహించని షాక్ ఇచ్చారు బైడెన్!

అవును... శిలాజ ఇంధనం ఉత్పత్తిని పెంచలన్న ట్రంప్ ప్లాన్ అమలును మరింత జఠిలం చేసే ప్రయత్నం తాజాగా జో బైడెన్ చేశారు. ఇందులో భాగంగా... ట్రంప్ లక్ష్యాల్లో ఒకటైన గ్యాస్, చమురు డ్రిల్లింగ్ పనులు ముందుకు వెళ్లకుండ బైడెన్ ఏకంగా 75 ఏళ్ల నాటి ఓ చట్టాన్ని తెరపైకి తీసుకొచ్చారు. ఈ విషయాన్ని వైట్ హౌస్ తాజాగా ప్రకటించింది.

ఇప్పుడు ఇది ట్రంప్ టీమ్ కి షాకింగ్ గా మారిందని అంటున్నారు. దీనిపై స్పందించిన వైట్ హౌస్... అమెరికా సముద్ర జలాల్లోని సుమారు 62 కోట్ల ఎకరాల ప్రదేశాన్ని గ్యాస్, ఆయిల్ కోసం డ్రిల్లింగ్ చేయడం నుంచి కాపాడేందుకే ఈ చట్టాన్ని తెరపైకి తెచ్చినట్లు చెబుతున్నారు. అయితే... ఇది పూర్తిగా ట్రంప్ కు ఇబ్బందులు సృష్టించడానికి బైడెన్ చేసిన ప్రయత్నంగా పలువురు అభివర్ణిస్తున్నారు.

వివరాళ్లోకి వెళ్తే... ట్రంప్ లక్ష్యాల్లో ఒకటైన గ్యాస్, చమురు డ్రిల్లింగ్ పనులు ముందుకు వెళ్లకుండా అన్నట్లుగా బైడెన్ ఓ కీలక చట్టాన్ని తెరపైకి తెచ్చారు. ఇందులో భాగంగా... 1953 ఔటర్ కాంటినెంటల్ షెల్ఫ్ ల్యాండ్ యాక్ట్ ని బైడెన్ వాడుతున్నారు. ఈ యాక్ట్ ప్రకారం... గ్యాస్, చమురు డ్రిల్లింగ్ నుంచి ఔటర్ కాంటినెంటల్ షెల్ఫ్ ను పూర్తిగా మినహాయించే అధికారం ప్రెసిడెంట్ కి ఉంటుంది.

పైగా... ఈ చట్టం అమలులోకి వచ్చిన తర్వాత వచ్చే కొత్త అధ్యక్షుడికి దానిని అడ్డుకొనే శక్తి లేదు! దీని ఆపాలంటే.. ట్రంప్ కాంగ్రెస్ ఆమోదం పొందాల్సి ఉంటుంది. దీంతో... ట్రంప్ ఆశయానికి 75 ఏళ్ల నాటి చట్టంతో బైడెన్ చెక్ పెట్టినట్లేననే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ సందర్భంగా స్పందించిన ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇందులో భాగంగా... వారు (ట్రంప్ & కో!) అనుకొన్న చోట్ల డ్రిల్లింగ్ చేస్తే, దానివల్ల కోలుకోలేనంత నష్టం వాటిల్లుతుంది.. అమెరికా ఇంధన అవసరాలు తీర్చుకోవడానికి ఇది రిస్క్ చేయాల్సినంత విలువైందేమీ కాదు! మనం క్లీన్ ఎనర్జీ ఆర్థిక వ్యవస్థ దిశగా అడుగులు వేస్తున్నాం.. ఈ నేపథ్యంలో ఈ తీరలను భవిష్యత్ తరాల కోసం సంరక్షించి తీరాల్సిందే అని అన్నారు.

ఈ విషయంలో... కాలిఫోర్నియా నుంచి ఫ్లోరిడా వరకూ రిపబ్లికన్లు, డెమోక్రట్ గవర్నర్లు, కాంగ్రెస్ సభ్యులతో పాటు తీరప్రాంత ప్రజానికం అంతా ఏకతాటిపైకి రావాలని.. చమురు, గ్యాస్ డ్రిల్లింగ్ నుంచి తీరాలను రక్షించడానికి నడుం బిగించాలని జో బైడెన్ పిలుపునిచ్చారు. దీనిపై ట్రంప్ టీమ్ నిప్పులు చెరుగుతుంది.

Tags:    

Similar News