రెండు ఎన్నికలు ఒకేసారి...బీజేపీ ఏపీలో న్యూట్రల్...?

ఏపీ తెలంగాణాలో ఒక్కమారే ఎన్నికలు జరిగితే బీజేపీ ఏపీలో కూడా పొత్తుకు రాదు.

Update: 2023-09-08 04:02 GMT

అటూ ఇటూ తిరిగి ఏపీకి తెలంగాణాకు ఒకేసారి ఎన్నికలు జరగనున్నాయని అంటున్నారు. తెలుగు రాష్ట్రాలలో ఒకేసారి ఎన్నికలు జరిపించడం ద్వారా బీజేపీ తనదైన రాజకీయ లాభాన్ని కోరుకుంటోంది. తెలంగాణాలో బీజేపీకి అంతో ఇంతో ఊపు ఉంది. దానితో అక్కడ అధికారంలోకి వచ్చేస్తామన్న ఫీలింగ్ కలిగించి ఆ ఫీలింగ్ ని ఏపీలో కూడా కొనసాగించి ఎంతో కొంత ఆంధ్రాలో కూడా లాభపడాలని బీజేపీ చూస్తోంది అని అంటున్నారు.

ఇది ఒక ఎత్తుగడ అయితే మరొకటి ఏంటి అంటే ఏపీలో పూర్తిగా న్యూట్రల్ గా ఉండడం కోసం అని అంటున్నారు. ఏపీలో వైసీపీ కావాలి. అలాగే టీడీపీని దూరం చేసుకోకూడదు అని మరో స్ట్రాటజీ. అయితే ఎటు వైపు ఉంటే మరో వైపు వారికి కోపం తెప్పిస్తామన్నది బీజేపీ ఆలోచన.

ఇలా ఆలోచించి బీజేపీ న్యూట్రల్ విధానం అనుసరించడానికి ఒకేసారి ఏపీ తెలంగాణాలో ఎన్నికలకు తెర లేపుతోంది అని అంటున్నారు. ఏపీ తెలంగాణాలో ఒక్కమారే ఎన్నికలు జరిగితే బీజేపీ ఏపీలో కూడా పొత్తుకు రాదు. తెలుగుదేశంతో ఏపీలో పొత్తు పెట్టుకుని తెలంగాణాలో కేసీయార్ మీద పోరాడితే కచ్చితంగా ఆ ప్రభావాన్ని సెంటిమెంట్ ని కేసీయార్ వాడుకుంటారు అని బీజేపీ ఆలోచిస్తోంది.

అందువలన ఏపీలో పొత్తులు లేవు తెలంగాణాలో అంతకంటే లేవు. మేము సోలోగానే అని వెళ్ళడానికి వీలు కుదురుతుంది అని అంటున్నారు. ఇక జనసేన విషయం తీసుకుంటే ఆ పార్టీ తెలంగాణాలో పోటీ చేయడం లేదు, పైగా ఎక్కడా అధికారంలో లేదు. అందువల్ల ఆ పార్టీతో కలసి ఏపీలో నడచినా ఇబ్బంది లేదు అన్నది బీజేపీ వ్యూహంగా కనిపిస్తోంది.

ఈ పరిణామాల నేపధ్యంలో బీజేపీ తెలుగు రాష్ట్రాలలో ఒకేసారి ఎన్నికలకు రెడీ చేస్తోంది అని అంటున్నారు. ఇక ఒకేసారి ఎన్నికలు అంటే చంద్రబాబు పూర్తిగా ఏపీకే పరిమితం అవుతారు. తెలంగాణాలో ఆ పార్టీ ఓటు బ్యాంక్ ఏమైనా ఉంటే అది బీజేపీ తన వైపు తిప్పుకోవడానికి వీలు అవుతుంది అని భావిస్తోంది. ఇక దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికలు అంటూ పన్నెండు పదమూడు రాష్ట్రాలకు ఒకేసారి పెడితే కేసీయార్ జాతీయ పార్టీ బీయారెస్ కూడా తెలంగాణకే పరిమితం అవుతుంది.

ఆ విధంగా కేసీయార్ కి కూడా దెబ్బ పడుతుంది అని బీజేపీ ఆలోచిస్తోంది. తెలంగాణాకు వేరుగా ఎన్నికలు పెట్టి ఆ తరువాత లోక్ సభ ఎన్నికలు పెడితే కాంగ్రెస్ కూటమితో కేసీయార్ చేతులు కలిపినా కలుపుతారు అన్న ఆలోచన కూడా బీజేపీ పెద్దలకు ఉంది అని అంటున్నారు. అది కాంగ్రెస్ కి బలంగా మారుతుంది. అందుకే ఎక్కడివారిని అక్కడ కట్టిపడేసేలా ఒకేసారి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు తీసుకుని వస్తే ట్రయాంగిల్ ఫైటింగ్ గట్టిగా సాగి తెలంగాణాలో లబ్ది చేకూరుతుంది అలాగే జాతీయ స్థాయిలో బీజేపీకి లాభం కలుగుతుంది అన్నదే బిగ్ ప్లాన్ అని అంటున్నారు.

మొత్తానికి రెండు తెలుగు రాష్ట్రాలకు ఎన్నికలు ఒకేసారి అంటే బీజేపీ ఏపీలో న్యూట్రల్ రోల్ లోకి వెళ్తుంది అని అంటున్నారు. అది ఏపీలో వైసీపీకి ప్లస్ అయ్యేలా ఉంటుంది అని కూడా అంటున్నారు. ఇక తెలంగాణాలో సైతం బీజేపీకి రాజకీయంగా ఇది ఎంతో కొంత మేలు చేసేదే అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో. అన్నీ అనుకూలిస్తే జనవరిలో లోక్ సభతో పాటు రెండు తెలుగు రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు వస్తాయని అంటున్నారు.

Tags:    

Similar News