ఏపీ రాజకీయాల్లో సోషల్ మీడియా లేదా...?
ఇపుడు ఏపీలో చూస్తే పట్టుమని రెండు నెలలు కూడా సార్వత్రిక ఎన్నికల టైం లేదు. కానీ సోషల్ మీడియాలో అయితే ఏ విధంగానూ రీ సౌండ్ కనిపించడంలేదు అని అంటున్నారు.
సోషల్ మీడియా యుగం ఇది. రాజకీయాలలో బిగ్ ట్విస్ట్ ఇస్తూ అనూహ్య పరిణామాలకు దారి తీసేలా చేస్తున్నది కూడా సోషల్ మీడియానే. రాజకీయ పార్టీలకు కూడా బుర్రకు తట్టని వ్యూహాలు వారి ఆశలు ఊహలు అన్నీ కూడా సోషల్ మీడియాలో కనిపిస్తూంటాయి. అలా తామే ఒక రోడ్ మ్యాప్ ఇచ్చేసి పార్టీలను నాయకులను నడిపించే విషయంలో గత రెండు ఎన్నికల నుంచి సోషల్ మీడియా పాత్ర చాలా ఎక్కువగానే ఉంది అని చెప్పడంలో అతిశయోక్తి అయితే లేదు.
సోషల్ మీడియా ఎత్తులు పొత్తులు స్ట్రాటజీస్ కూడా రాజకీయ పార్టీలు పరిగణనలోకి తీసుకుని తమను తాము సరిదిద్దుకుని ముందుకు వెళ్ళిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇదిలా ఉంటే ఇటీవల జరిగిన తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల్లో సోషల్ మీడియా నిర్వహించిన పాత్ర అమోఘం అద్భుతం అద్వితీయం అని చెప్పాలి.
సోషల్ మీడియా ఏకంగా తెలంగాణా రాజకీయాన్ని ఊపేసింది. తెలంగాణా ఎన్నికల్లో సోషల్ మీడియా పెద్ద ఎత్తున పని చేసింది కూడా. అధికార పార్టీ అయిన బీఆర్ఎస్ అయితే సోషల్ మీడియా ఇంఫ్లుయెన్సర్స్ ని విపరీతంగా వాడుకుంది. వారి ద్వారా వీలైనంత ఎక్కువగా ప్రచారం చేయించుకుంది. గడ్డు పరిస్థితి బీఆర్ఎస్ కి ఉంది అన్న దాని నుంచి భేషైన ఫలితాలను బీఆర్ఎస్ సాధించడంతో సోషల్ మీడియా పాత్ర చాలా కీలకంగా మారింది.
ఇక కాంగ్రెస్ అయితే తాను ఏ మాత్రం తీసిపోలేదు. ఏకంగా ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలుని తెచ్చి పెట్టి మరీ బీఆర్ఎస్ కి గట్టిగానే కౌంటర్ ఇచ్చేసింది. బీఆర్ఎస్ ధీటుగా కాంగ్రెస్ కూడా సోషల్ మీడియా నిలిచి గెలిచింది. చివరిని అనూహ్యమైన ఫలితాలు సాధించి అధికారాన్ని కూడా అందుకుంది.
ఇపుడు ఏపీలో చూస్తే పట్టుమని రెండు నెలలు కూడా సార్వత్రిక ఎన్నికల టైం లేదు. కానీ సోషల్ మీడియాలో అయితే ఏ విధంగానూ రీ సౌండ్ కనిపించడంలేదు అని అంటున్నారు. ఇక తెలంగాణాలో ఎన్నికల్లో చూసుకుంటే రోజుకు ఒకటికి మించి సర్వేలు కనిపించేవి. అవి ఫేక్ సర్వేలా లేక రియల్ సర్వేలా అన్నది పక్కన పెడితే సర్వేలతో విస్తృతమైన చర్చ అయితే జరుగుతూ వచ్చేది.
ఏపీలో చూస్తే ఎన్నికలు దగ్గరకు వచ్చేశాయి. అయినా సోషల్ మీడియాలో సర్వేలు అయితే పెద్దగా రావడంలేదు. సర్వేలు ఎక్కడా జరిగినట్లుగా లేదు. ఇక ఫేక్ సర్వేలు అయితే వస్తున్నాయి కానీ వాటిని ఎవరూ పట్టించుకోవడంలేదు. ఇక ఏపీలో చూస్తే ఎన్నికల రాజకీయం ఇంకా జోరు అందుకోలేదు.
ఒకవైపు టీడీపీ జనసేనలలో అభ్యర్ధుల జాబితా ఫైనల్ కాలేదు. ఇక టీడీపీ జనసేన పొత్తుల వల్ల సీట్లు ఎవరికి ఎక్కడ ఇస్తారు అన్న పంచాయతీ అలాగే ఉంది. అది ఎక్కడా తెగడంలేదు. అసలు అంత వరకూ కధ సాగడంలేదు అని అంటున్నారు.
సీట్ల విషయం తెలిస్తే ఆ తరువాత అభ్యర్ధులు బయటకు వస్తే అపుడు సర్వేలు చేస్తారేమో అన్నట్లుగా సీన్ ఉంది. మరో వైపు చూస్తే ఏపీలో పార్టీల పరంగా కూడా సర్వేలు అయితే రావడంలేదు అని అంటున్నారు. ఎందుకో గానీ సోషల్ మీడియాలో ఎన్నికల హడావుడి అయితే పెద్దగా కనిపించడంలేదు అని అంటున్నారు.
ఇక టీడీపీకి చూసుకుంటే ఐటీడీపీ పని చేస్తోంది. కానీ దాని ప్రభావం అయితే పెద్దగా కనిపించడంలేదు అని అంటున్నారు వైసీపీకి అయితే ఇతర పార్టీల నుంచి ట్రోల్స్ ఒక లెవెల్ లో వస్తున్నా కూడా వాటిని ఖండించే టీం కూడా సరిగ్గా లేదు అని అంటున్నారు.
దీంతో సోషల్ మీడియాలో అన్ని పార్టీల యాక్టివిటీ ఈసారి ఎన్నికల్లో బాగా తగ్గింది అని అంటున్నారు. దీనికి కారణాలు ఏమైనా కూడా కేవలం రెండు నెలలలో ఎన్నికలు ఉంటే ఇంత చప్పగా సోషల్ మీడియా కార్యకలాపాలు ఉండడం అంటే ఆలోచించాల్సిందే అంటున్నారు. అసలు వీటికి అంతటికీ కారణం జనాలలో కూడా ఏపీ ఎన్నికల మీద ఆసక్తి లేదు కాబట్టే ఇదంతా అన్న అసలైన నిజాన్ని కూడా చెబుతున్న వారూ ఉన్నారు. చూడాలి మరి ముందు ముందు ఏమి జరుగుతుందో.