బాబుకు మ‌ద్ద‌తిచ్చిన ఓవైసీ.. ఇదేం ట్విస్ట్‌

తాజాగా మీడియాతో మాట్లాడిన ఎంఐఎం పార్టీ ర‌థ‌సార‌థి, హైద‌రాబాద్ ఎంపీ అస‌దుద్దీన్ ఓవైసీ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

Update: 2024-11-03 04:01 GMT

హైద‌రాబాద్ పాతబ‌స్తీ కేంద్రంగా ఎదుగుతూ త‌న ఉనికిని చాటుకునేందుకు సీరియ‌స్ ప్ర‌య‌త్నాల్లో ఉన్న ఎంఐఎం పార్టీ, ప‌లు సంద‌ర్భాల్లో త‌మ సంప్ర‌దాయ మ‌త రాజ‌కీయంతో పాటుగా వివిధ సామాజిక అంశాల‌పై సైతం స్పందిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇలాగే తాజాగా ఆ పార్టీ రెండు కీల‌క అంశాల‌పై ఆస‌క్తిక‌ర కామెంట్లు చేసింది. ఈ కామెంట్ల ద్వారా అటు ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు విధానానికి మ‌ద్ద‌తు మ‌రోవైపు తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కు షాక్ ఇచ్చింది. ఇక ఇదే స‌మ‌యంలో, ఊహించ‌ని రీతిలో సీఎం రేవంత్ రెడ్డికి మ‌ద్ద‌తు ప‌ల‌క‌డం గ‌మ‌నార్హం.

తాజాగా మీడియాతో మాట్లాడిన ఎంఐఎం పార్టీ ర‌థ‌సార‌థి, హైద‌రాబాద్ ఎంపీ అస‌దుద్దీన్ ఓవైసీ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. హైద‌రాబాద్ లో ర‌చ్చ‌రచ్చ‌గా మారిన మూసి ప్ర‌క్షాళ‌న‌, హైడ్రా అంశంపై స్పందిస్తూ, ఇళ్ల జోలికి రాకుండా మూసీ ప్రక్షాళన చేస్తే స్వాగతిస్తామని తెలిపారు. ఈ విష‌యంలో బీఆర్‌ఎస్ పార్టీ మూసీ ప్రక్షాళన కోసం ప్రణాళికలు చేసింద‌ని, అయితే, ఆ ప్లాన్‌ను వద్దని తాను చెప్పిన‌ట్లు వెల్ల‌డించారు. తాను నోరు విప్పితే బీఆర్‌ఎస్ నేతలు ఇబ్బందులు పడతార‌ని పేర్కొన్న ఓవైసీ...వాళ్లకి వారు ఆత్మపరిశీలన చేసుకోవాల‌ని హిత‌వు ప‌లికారు. బీఆర్ఎస్‌ విధానాలు స్థిరంగా ఉండాలంటూ సూచించారు. అంతేకాకుండా, బీఆర్ఎస్‌ పార్టీ నేతలకు అప్పట్లో అహంకారం ఉండేదని ప‌రోక్షంగా పేరు పెట్ట‌కుండా కేసీఆర్‌, కేటీఆర్ ల‌పై దుమ్మెత్తిపోశారు.

ఇక ఏపీ సీఎం చంద్రబాబు విధానాల‌కు ఓవైసీ మ‌ద్ద‌తు ప‌లికారు. 2025లో జనగణన, 2028 నాటికి డిలిమిటేషన్ ప్రక్రియ పూర్తి చేస్తామని

కేంద్రప్రభుత్వం ఇటీవల ప్రకటించడం, దీనివల్ల జనాభాను నియంత్రించని ఉత్తరాది రాష్ట్రాలకే లాభం ఉంటుందని.. జనాభాను నియంత్రించిన దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతుందనే విమర్శల‌పై ఏపీ సీఎం చంద్ర‌బాబు చేసిన కామెంట్ల‌కు ఓవైసీ మ‌ద్ద‌తు ప‌లికారు. దక్షిణ భారత్‌లో జననాల రేటు తక్కువగా ఉందని చంద్రబాబు గుర్తించారని ఓవైసీ ప్ర‌శంసించారు. ఎక్కువ మంది పిల్లల్ని కనాలని చంద్రబాబు నాయుడు, స్టాలిన్ అంటున్నారని...జనాభా ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాలే నష్టపోతాయని తెలిపారు.దేశ అభివృద్ధిలో బాగా పనిచేసిన రాష్ట్రాలను శిక్షించడం వల్ల ఏం లాభం అంటూ ప్రశ్నించిన ఓవైసీ, అసెంబ్లీ - లోక్‌సభ స్థానాల సంఖ్య తగ్గడ వల్ల దక్షిణాదికి అన్యాయం జరుగుతుందని అన్నారు.

మ‌రోవైపు మూసి ప్ర‌క్షాళ‌న విష‌యంలో అస‌దుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్య‌లు బీఆర్ఎస్ పార్టీకి పెద్ద షాకింగ్ వంటివ‌ని నిపుణులు పేర్కొంటున్నారు. ఇదే స‌మ‌యంలో అధికార కాంగ్రెస్ పార్టీకి ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డికి పెద్ద రిలీఫ్ వంటివ‌ని విశ్లేషిస్తున్నారు. ఒక‌నాడు కేసీఆర్ విధానాల‌కు మ‌ద్ద‌తుగా నిలిచిన ఓవైసీ ఇప్పుడు ఆ పార్టీ నేత‌ల‌ను కామెంట్ చేయ‌డం ఆస‌క్తిక‌ర ప‌రిణామ‌మ‌ని పేర్కొంటున్నారు.

Tags:    

Similar News