మ్యాట్రిమోని సైట్ల మాటున కేటుగాళ్లు.. తెరపైకి కొత్త రివేంజ్ స్టోరీ!

అవును... తాజాగా ఓ వ్యక్తి మ్యాట్రిమోనీ సైట్లలో అందమైన అమ్మాయి ఫోటోలు చూసి సంబంధం కలిపే ప్రయత్నం చేశాడు.

Update: 2024-08-10 15:30 GMT

సాధారణంగా మ్యాట్రిమోని సైట్లలో అందమైన అమ్మాయిల ప్రొఫైల్స్ కనిపిస్తే "ఇంట్రస్ట్" ఆప్షన్ పై వెంటనే క్లిక్ చేసేస్తుంటారు! తర్వాత టెస్ట్ మెసేజ్ ల దగ్గర మొదలై, నెంబర్స్ షేర్ చేసుకుని వాట్సప్ మెసేజ్ ల వరకూ వ్యవహారం వెళ్తుంటుంది. ఈ సమయంలో అన్నీ అనుకూలంగా జరిగితే ఏడు అడుగులు... ఒక్కోసారి తేడా వస్తే ఎవరో ఒకరికి ఏడు ఊచలు! ఇటీవల కాలంలో మ్యాట్రీమోని సైట్లలో జరుగుతున్న మోసాలు అలానే ఉన్నాయి!

అవును... తాజాగా ఓ వ్యక్తి మ్యాట్రిమోనీ సైట్లలో అందమైన అమ్మాయి ఫోటోలు చూసి సంబంధం కలిపే ప్రయత్నం చేశాడు. ఈ లోపు అవతలివైపు నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ రావడంతో మాటా మాటా కలవడమే కాదు.. నోటు వరకూ వెళ్లింది వ్యవహారం! కట్ చేస్తే... అవతల ఉన్నది అమ్మాయి కాదు.. అమ్మాయిల ఫోటోలతో కేటుగాళ్లు మ్యాట్రిమోనీ సైట్లలో మాటు వేశారని తెలుసుకున్నాడు. దీంతో.. రివేంజ్ డ్రామా ఒకటి ప్లాన్ చేశాడు!

వివరాళ్లోకి వెళ్తే... కాకినాడకు చెందిన ఓ వ్యక్తి.. షేర్ మార్కెట్ లో ట్రేడింగ్ చేస్తుంటాడు. ఈ సమయంలో పెళ్లి చేసుకుని ఫిక్సై మ్యాట్రిమోని సైట్లో యువతుల కోసం వెతికాడు. ఈ సమయంలో ఓ అమ్మాయి ప్రొఫైల్ చూసి మనసుపడ్డాడు.. అనుకున్నదే తడవుగా అన్నట్లుగా పెళ్లి చేసుకొవాలని భావించి సంబంధం కలుపుకున్నాడు. ఈ సమయంలో ఆ యువతి పేరుతో కేటుగాళ్లు సూర్యప్రకాశ్ నుంచి లక్షలు దండుకుని నిండా ముంచారు.

అయితే... తాను మోసపోయాయని పోలీసులకు ఫిర్యాదు చేసి, తనలా మరొకరు మోసపోవద్దని నలుగురికి జాగ్రత్తలు చెబితే ఏమి వస్తుంది.. ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలి అని భావించాడో ఏమో కానీ... ఇతడు కూడా తను మోసపోయిన తరహాలోనే అమ్మాయిల ఫోటోలు పెట్టి మ్యాట్రిమొనీ సైట్లలో ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేశాడు. పెళ్లి సంబంధాల పేరుతో మోసాలు చేయడం మొదలుపెట్టాడు.

ఈ సమయంలో తనతో ఓ స్నేహితుడు సతీష్ ని కలుపుకున్నాడు! ఈ సమయంలో లేడీ వాయిస్ వచ్చేలా యాప్స్ ఇన్ స్టాల్ చేసుకుని.. అబ్బాయిలను కవ్వించే మాటలతో ట్రాప్ లోకి లాగడం మొదలుపెట్టారట. ఈ సమయంలో అవతలి వ్యక్తి పూర్తిగా ప్రేమలో ముంగిపోయాడు, మనం ఏమి చెబితే అది వింటాడు అని ఓ క్లారిటీకి వచ్చిన తర్వాత అసలు కథ మొదలుపెడతారంట.

ఇందులో భాగంగా.. అమ్మ, నాన్నల అనారోగ్యం పేరుచెప్పో.. ఓ స్టార్టప్ బిజినెస్ పెడితే లాస్ వచ్చిందనో ఏదో ఓ కథ చెప్పి ఆ సదరు యువకుడిని డబ్బులు అడుగుతారట. ఎలాగో కాబోయే భార్యే కదా అనే పెద్ద మనసుతో ఆ యువకుడు డబ్బులు ట్రాన్స్ ఫర్ ఛేస్తున్నారట. తీరా డబ్బులు అందిన తర్వాత కేటుగాళ్ల నుంచి రెస్పాన్స్ ఉండదు.. మ్యాట్రిమోనీలో ఉన్న అడ్రస్ తప్పని తెలియడానికి ఆ యువకులకూ పెద్ద ఎక్కువ సమయమేమీ పట్టదు.

ఈ సమయంలో మోసపోయిన ఓ బాధితుడి ఫిర్యాదుతో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. కేటుగళ్ల ఆటకట్టించారు. పలు ప్రాంతాల్లో బాధితులు ఈ కేటుగాళ్ల మోసానికి బలైనట్లు గుర్తించారట. ఈ నేపథ్యంలోనే కాకినాడకు చెందిన వ్యక్తిని, అతడి స్నేహితుడిని అదుపులోకి తీసుకున్నారని తెలుస్తోంది. ఈ సమయంలో నిందితులపై 406, 420, 66సీ, 66 డీ యాక్ట్ ల కింద కేసులు నమోదు చేసినట్లు చెబుతున్నారు.

Tags:    

Similar News