పాకిస్థాన్ కంటే బంగ్లాలోనే దాడులు ఎక్కువ.. కేంద్రం లెక్కలిలా..!

బంగ్లాదేశ్‌లో హిందువులపైనే కాకుండా.. హిందూ ఆలయాలపైనా దాడులు జరిగాయి. అధికారిక లెక్కల ప్రకారమే.. దాదాపు 200 వరకు దాడులు జరిగాయి.

Update: 2024-12-21 15:30 GMT

బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు పెరుగుతూనే ఉన్నాయి. ఇన్నాళ్లు మాజీప్రధాని షేక్ హసినానే హిందువులకు అండగా నిలిచారా.. ఇప్పుడు ఆమె లేకపోవడం వల్ల బంగ్లాదేశ్‌లో హిందువులకు లైఫ్ లేకుండా పోయిందా..? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అంతేకాదు.. భారత్ శత్రుదేశంగా భావించే పాకిస్థాన్‌లో కంటే బంగ్లాదేశ్‌లోనే హిందువులపై దాడులు పెరిగిపోయినట్లుగా వెల్లడైంది.

బంగ్లాదేశ్‌లో హిందువులపైనే కాకుండా.. హిందూ ఆలయాలపైనా దాడులు జరిగాయి. అధికారిక లెక్కల ప్రకారమే.. దాదాపు 200 వరకు దాడులు జరిగాయి. ఇందులో హిందూ ఆలయాలు ఉన్నాయి. హిందూ ఆలయాలు ఉన్నాయి. అందుకే.. పాకిస్థాన్‌లో కంటే బంగ్లాదేశ్‌లో హిందువులపై హింస 20 రెట్లు ఎక్కువగా ఉన్నట్లు రాజ్యసభకు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ ఏడాది బంగ్లాదేశ్‌లో హిందువులపై జరిగిన దాడులకు సంబంధించి 2,200 కేసులు నమోదైనట్లు తెలిపారు. అదే సమయంలో పాకిస్థాన్‌లో మాత్రం 112 కేసులు నమోదయ్యాయని వెల్లడించింది.

హిందువులపై దాడులకు సంబంధించిన బంగ్లాదేశ్, పాకిస్థాన్ దేశాలకు లేఖలు రాసినట్లు కేంద్రం స్పష్టం చేసింది. హిందువుల భద్రత కోసం ఆయా దేశాలు భరోసా ఇవ్వాలని కోరినట్లు తెలిపింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం లెక్కలను విడుదల చేసింది. బంగ్లాదేశ్‌లో 2022లో హిందవులపై 47 హింసాత్మక ఘటనలు చేసుకున్నట్లు వెల్లడించింది. 2023లో 302 జరిగాయి. 2024లో డిసెంబర్ 8 వరకు 2,200 హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి.

ఇక పాకిస్థాన్‌లో మాత్రం 2022లో హిందువులపై 241 హింసాత్మక ఘటనలు జరిగాయి. 2023లో 103, 2024 అక్టోబర్ వరకు 112 ఘటనలు చోటుచేసుకున్నట్లు లెక్కలు తెలిపింది. బంగ్లాదేశ్, పాకిస్థాన్ మినహా ఇతర పొరుగు దేశాలలో హిందువులపై హింసాత్మక కేసులేం లేవని ప్రభుత్వం తెలిపింది.

మరోవైపు.. బంగ్లాదేశ్‌లో హిందువుల జనాభా తగ్గుతూ వస్తుంటే ముస్లింల జనాభా గణనీయంగా పెరుగుతోంది. ఇక్కడ ముస్లింల జనాభా 91 శాతం పెరిగిందని లెక్కలు తెలిపాయి. ఇలా జరగడానికి అనేక చారిత్రక కారణాలు ఉన్నట్లు తెలిపింది. ప్రత్యేక దేశంగా ఏర్పడడం.. స్థానికంగా సమస్యలు పేరుకుపోవడం.. ఆర్థిక స్థితిగతులు.. పేదరికం.. జనాభా పెరుగుదలపై కంట్రోలింగ్ లేకపోవడం వల్ల ముస్లింల జనాభా పెరిగినట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News