సరదాగా కలిసిపోతున్న చంద్రబాబు.. పిక్ వైరల్!

ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరినప్పటి నుంచీ బాబు ఇలానే ఆలోచిస్తున్నారని అంటున్నారు.

Update: 2024-10-02 15:59 GMT

ఏపీలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించడంతో చంద్రబాబు మరోసారి ముఖ్యమంత్రి అయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తనమార్కు పాలనతో దూసుకుపోతున్న చంద్రబాబు.. ఈ దఫా మాత్రం ప్రజలతో మరింత మమేకమవుతూ.. వారిని వారున్న చోటకే వెళ్లి కలిసే విధంగా ముందుకు వెళ్తున్నారని అంటున్నారు.

అవును... నవ్యాంధ్రప్రదేశ్ కు రెండోసారి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు ప్రజలతో మరింతగా మమేకమవ్వడంపై ఆసక్తి కనబరుస్తున్నారని.. ప్రజలు నాయకుల వద్దకు రావడం కాదు, నాయకులే ప్రజల వద్దకు వెళ్లి వారి యోగక్షేమాలు, కష్ట సుఖాలూ చూడాలన్నట్లుగా భావిస్తున్నారని అంటున్నారు.

ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరినప్పటి నుంచీ బాబు ఇలానే ఆలోచిస్తున్నారని అంటున్నారు. ఇందులో భాగంగా... ప్రతీనెల 1వ తేదీన ఇచ్చే సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ కార్యక్రమలోనూ చంద్రబాబు స్వయంగా పాల్గొంటున్నారు. పేదల ఇళ్లకు వెళ్లి వారికి తానే స్వయంగా పెన్షన్స్ పంపిణీ చేస్తున్నారు.

ఈ సమయంలో చంద్రబాబు ఆ పేదలు ఆత్మీయంగా టీ ఇస్తే టీ, మజ్జిగ ఇస్తే మజ్జిగ.. ఆప్యాయంగా ఇచ్చింది కాదనకుండా తీసుకుంటున్నారు. ఈ క్రమంలో తాజాగా గాంధీ జయంతిని పురస్కరించుకుని చంద్రబాబు మచిలీపట్నం నియోజకవర్గంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు.

మహాత్మ గాంధీ జయంతిని పురస్కరించుకుని ఎన్డీయే ప్రభుత్వం దేశవ్యాప్తంగా "స్వచ్చతే సేవ" కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఏపీలోనూ కూటమి ప్రభుత్వం చేపట్టింది. ఈ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులతో కలిసి కూర్చిని టీ తాగుతూ.. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.

దీంతో... పారిశుద్ధ్య కార్మికుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయని అంటున్నారు. దీనికి సంబంధించిన పిక్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఈ సందర్భంగా చంద్రబాబుతో మంత్రులు నారాయణ, కొల్లు రవీంద్ర మొదలైన నాయకులు ఉన్నారు.

Tags:    

Similar News