"చంద్రబాబు కోసం చచ్చిపోతా"... ఓపెన్ అయిపోయిన బండ్ల గణేష్!

తాజాగా హైదరాబాద్ బాలయోగి స్టేడియంలో నిర్వహించిన సీబీఎన్ గ్రాటిట్యూడ్ కన్సర్ట్ కార్యక్రమంలో పాల్గొన్న బండ్ల గణేష్.. ఈ మేరకు సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2023-10-30 04:14 GMT

స్టేజ్ పై మైక్ అందుకుంటే.. తనకు నచ్చిన వ్యక్తుల గురించి మాట్లాడాలంటే.. నటుడు, నిర్మాత బండ్ల గణేష్ ఏ స్థాయిలో స్పందిస్తారనేది తెలిసిన విషయమే! పలు ఆడియో ఫంక్షన్స్ లో పవన్ కల్యాణ్ తన దేవుడని, భగత్ సింగ్ అని, సుభాష్ చంద్రబోస్ అని, తన గాడ్ అని, నిజాయితీ అంటే పవన్ కల్యాణ్ అని మాట్లాడిన సంగతి తెలిసిందే. దీంతో... బండ్లకు చరిత్ర పాఠాలు పంపాలంటూ వినిపించిన కామెంట్ల సంగతి కాసేపు పక్కనపెడితే... మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు బండ్లగణేష్. అయితే ఈసారి చంద్రబాబు గురించి కావడం గమనార్హం.

స్కిల్ డెవలప్ ప్మెంట్ స్కాం కేసులో అరెస్టై రాజమండ్రి సెంట్రలో జైల్లో గత 50 రోజులుగా రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబు కోసం తాను చనిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు, తన ఆయుష్షు చంద్రబాబుకి ఇవ్వడానికి రెడీగా ఉన్నట్లు, ఆ కేసు తనపై వేసుకుని వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు బండ్ల గణేష్. తాజాగా హైదరాబాద్ బాలయోగి స్టేడియంలో నిర్వహించిన సీబీఎన్ గ్రాటిట్యూడ్ కన్సర్ట్ కార్యక్రమంలో పాల్గొన్న బండ్ల గణేష్.. ఈ మేరకు సంచలన వ్యాఖ్యలు చేశారు.

"భగవంతుడు ఆయుష్షు ఇస్తే సార్ మీ కోసం చచ్చిపోతా అని చెబుతా అంటూ మొదలుపెట్టిన బండ్ల గణేష్... చంద్రబాబు కేసు ఎవరైనా మార్చుకోండని అంటే... నన్ను చంపేయండి, నన్ను తీసుకెళ్లి జైల్లో పెట్టండి అని చెబుతాను.. ఎందుకంటే నేను చచ్చిపోయినా ఏమీ కాదు.. కానీ, చంద్రబాబు దేశానికి అవసరం, ప్రపంచానికి అవసరం" అని బండ్ల గణేష్ వ్యాఖ్యానించారు.

అనంతరం... "తెలుగు వాడిగా పుట్టడం చంద్రబాబు నేరమా.." అని ప్రశ్నించిన బండ్ల గణేష్... ఏ తమిళనాడులోనో, గుజరాత్ లోనో, మహారాష్ట్రలోనో పుట్టి ఉంటే... చంద్రబాబుని ఆకాశంలో పెట్టుకుని చూసుకునేవారని బండ్లగణేష్ చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా చంద్రబాబు జైలు ఖర్చులకు సంబంధించి వస్తున్న విషయాలపై గణేష్ స్పందించారు. కొంతమంది ఈ విషయాలు అడుగుతున్నారని అన్నారు.

ఈ సందర్భంగా... చంద్రబాబు జైలు ఖర్చులు మేమందరం పెట్టుకుంటున్నాం అని చెప్పిన బండ్ల... "మా రక్తాన్ని ఆయనకు కమిషన్.. జీవితాన్ని ఆయనకు ఇచ్చి.. ఈ రోజు ఉద్యోగులందరూ ఒక్క రోజు జీతం ఇస్తే ఎన్ని కోట్లయినా ఖర్చుపెట్టుకుంటాం.. చంద్రబాబుని నిజాయితీగా బయటకు తీసుకొస్తాం" అని బండ్ల గణేష్ అనర్గలంగా మాట్లాడారు.

ఇదే సమయంలో... ధమ్మున్నోడు, ధైర్యమున్నోడు, నిజాయితీపరుడు, నీతిమంతుడు, మొనగాడు చంద్రబాబు అని బండ్లగణేష్ చెప్పుకొచ్చారు. అనంతరం... “చంద్రబాబు ఒక గాడ్” అని బండ్ల గణేష్ తెలిపారు. అనంతరం లోకేష్ గురించి స్పందించిన గణేష్... చంద్రబాబు రాబోయే 40 ఏళ్లకు బ్రహ్మాండమైన వారసుడిని ఇచ్చారని, లోకేష్ మరో సైబరాబాద్, మరో అమరావతిని అద్భుతంగా కడతారని అన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది!

Full View
Tags:    

Similar News