బంగ్లాదేశ్ లో భర్త... భారత ప్రియుడి కోసం బోర్డర్ దాటింది!
ఈ సమయ లో ఆ బజార్ లో బంగ్లాదేశ్ కు చెందిన ఫాతిమా పరిచయమైంది. చూపు చూపు కలిసింది.. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది.
గతకొతకాలంగా పొరుగున ఉన్న దేశాలనుంచి భారత్ లోకి అక్రమ చొరబాట్లకు ప్రయత్నిస్తున్న మహిళలకు సంబంధించిన విషయాలు జరుగుతున్నాయి. దీంతో.. ఎవరు ఉగ్రవాదులో, ఎవరు సామన్య ప్రజలో తేల్చడం పెద్ద పనవుతుంది! ఈ నేపథ్యంలో భారత్ లో ఉన్న ప్రియుడి కోసం ఒక మహిళ భారత్ బోర్డర్ దాటింది. ఇప్పుడు మరోసారి ప్రియుడి పేరు చెప్పి బంగ్లా నుంచి ఒక మహిళ భారత్ కు వచ్చేసింది.
అవును... ప్రియుడి కోసం పాకిస్థాన్ నుంచి నలుగురు పిల్లలను వెంటపెట్టుకుని భారత్ కు వచ్చిన సీమా హైదర్ సంఘటన గుర్తుండే ఉంటుంది. ఆన్ లైన్ లో పరిచయమైన ప్రియుడి కోసం... పాకిస్థాన్ లోని భర్తకు విడాకులిచ్చి.. వాటాగా వచ్చిన ఇంటిని అమ్ముకుని.. డబ్బులను, పిల్లలను చేతపట్టి.. పాక్ నుంచి ఇండియాకు... వయా దుబాయ్ వచ్చేసింది సీమా! ఆ టైంపులోనే తాజాగా బంగ్లాదేశ్ నుంచి ఒక మహిళ భారత్ కు అక్రమంగా వచ్చేసింది.
వివరాళ్లోకి వెళ్తే... త్రిపురలోని ధర్మసాగర్ కు చెందిన నూర్ జలాల్ అనే వ్యక్తి ఆయుర్వేద మందుల కోసం బంగ్లాదేశ్ బార్డర్ లో ఉన్న మౌళ్వీ బజార్ కు వెళ్తుంటాడు. ఇది అక్కడ అత్యంత సహజమైన విషయం. ఈ సమయ లో ఆ బజార్ లో బంగ్లాదేశ్ కు చెందిన ఫాతిమా పరిచయమైంది. చూపు చూపు కలిసింది.. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది.
దీంతో ఎడబాటు భరించలేకపోయిందో.. లేక, మరేదైనా కారణం ఉందో ఏమో తెలియదు కానీ... ఇద్దరూ కలిసి ఉండాలనుకున్నారు. ఈ విషయంలో బంగ్లాదేశ్ వెళ్లడానికి ప్రియుడు నూర్ జలాల్ కాస్త సందేహించాడో ఏమో కానీ... ఫాతిమా మాత్రం భారీ చొరవ చూపింది. ప్రియుడి కోసం ఇండియాకు వచ్చేసింది.. అది కూడా అక్రమంగా!
అలా ఇండియాలోకి అడుగుపెట్టిన ఫామితా... త్రిపురలోని ధర్మసాగర్ డివిజన్ లో ఉన్న పుల్బరీకి చేరుకుంది. అక్కడే తన ప్రియుడు నూర్ జలాల్ ను కలుసుకుంది. ఇద్దరూ కలిసి ఒక ఇల్లు అద్దెకుతీసుకున్నారు. గత రెండు వారాలుగా ఆ ఇంట్లోనే కలిసి ఉంటున్నారు. ఈ సమయంలో స్థానికులకు అనుమానం వచ్చింది.. పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. దీంతో అసలు విషయం బయటపడింది. ప్రియుడి కోసం బంగ్లా నుంచి భారత్ లోకి అక్రమంగా చొరబడిందని తెలుసుకున్నారు. దీంతో... ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఫాతిమా ప్రియుడు నూర్ జలాల్ పరారయ్యాడు. అతడిని నమ్మి బంగ్లా నుంచి వచ్చిన ఫాతిమా మాత్రం జైళ్లో ఉంది.
ఇక్కడ పెద్ద ట్విస్ట్ ఏమిటంటే... ప్రియుడి కోసం అంత రిస్క్ చేసి బంగ్లా నుంచి భారత్ లోకి వచ్చిన ఫాతిమాకు అప్పటికే పెళ్లైంది. అంతే కాదు సుమా... నూర్ జలాల్ కూడా తక్కువేమీ తినలేదు! ఇతడికి కూడా పెళ్లైంది. అయినప్పటికీ ఈమెతో కలిసి మరో ఇంట్లో కొత్త కాపురం పెట్టాడు!! ఈ సమయంలో స్థానికులకు అనుమానం వచ్చి... పోలీసులకు ఫిర్యాదు చేశారు.