ఫాల్కన్ స్కామ్ : నిందితుడి విమానాన్ని సీజ్ చేసిన ఈడీ?
ప్రస్తుతం అమర్ దీప్ సహా ఈ స్కామ్‌లో ప్రధాన నిందితులంతా పరారీలో ఉన్నారు.;
ప్రముఖ ఫాల్కన్ కుంభకోణంలో ప్రధాన నిందితుడైన అమర్ దీప్‌కు చెందిన ఓ విమానాన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) హైదరాబాద్లో స్వాధీనం చేసుకుంది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. అతను రూ. 14 కోట్లతో ఈ విమానాన్ని కొనుగోలు చేసినట్లు గుర్తించారు. ప్రస్తుతం అమర్ దీప్ సహా ఈ స్కామ్‌లో ప్రధాన నిందితులంతా పరారీలో ఉన్నారు.
-పవన్, కావ్య ఈడీ అదుపులో
ఈ భారీ మోసంలో కీలకంగా వ్యవహరించిన నిందితులలో పవన్, కావ్య అనే ఇద్దరు ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్నారు. ఫాల్కన్ సంస్థ తమ వద్ద డిపాజిట్లు పెడితే తక్కువ కాలంలోనే భారీ లాభాలు అందిస్తామని మోసం చేసి, మొత్తం 6979 మంది నుంచి రూ. 1700 కోట్ల వరకు వసూలు చేసినట్లు అధికారులు గుర్తించారు.
-సాధారణ ప్రజల్ని మోసం చేసిన నిందితులు
ఫాల్కన్ కంపెనీ అధిక వడ్డీ లాభాల ప్రలోభంతో డిపాజిట్లను స్వీకరించి, అనంతరం మూలధనాన్ని తిరిగి చెల్లించకుండా మోసం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. బాధితులు న్యాయం కోసం అధికారులను ఆశ్రయించగా, ఈడీ దర్యాప్తును ముమ్మరం చేసింది. దీంతో కంపెనీ యజమాన్యంపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
-ఈడీ దర్యాప్తు వేగవంతం..
ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు త్వరలో వెలుగులోకి వచ్చే అవకాశముంది. పరారీలో ఉన్న నిందితులను గుర్తించి, వారిపై కఠిన చర్యలు తీసుకునే దిశగా ఈడీ దర్యాప్తు వేగవంతం చేసింది. బాధితులు తమ డబ్బు తిరిగి పొందే అవకాశం ఎంతవరకు ఉంటుందనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
ఈ కుంభకోణం గురించి మరిన్ని వివరాలు త్వరలోనే వెలుగు చూడనున్నాయి. అధికారుల ప్రకారం, మరిన్ని ఆస్తులను స్వాధీనం చేసుకునే ప్రక్రియ కూడా కొనసాగుతోంది.