పిక్ ఆఫ్ ది డే : చరిత్రలో మరుపురాని చిత్రమిదీ

ఈరోజు అత్యంత వైరల్ అయిన ఫొటోలో భారతదేశపు ఏకైక మహిళా ప్రధాని ఇందిరా గాంధీ యొక్క చారిత్రక ఫోటో మహిళా లోకానికి గొప్ప స్ఫూర్తినిస్తోంది.;

Update: 2025-03-09 06:39 GMT

అది 70 దశకం.. దేశం ఇంకా వెనుకబడే ఉంది. ఆడవాళ్లు వంటింటి కుందేళ్లు అన్న నానుడి రాజ్యమేలతున్న రోజులు అవి. అంత ముతక సంప్రదాయంలో ఒక మహిళ బయటకు వచ్చి ఏకంగా ప్రధాని అయ్యి .. ఉద్దండులు అయిన రాజకీయ దురందురలను తన ముందు నిలబడేల చేస్తే ఎలా ఉంటుంది. అదే పనిచేసింది మన భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ.. ఈరోజు అత్యంత వైరల్ అయిన ఫొటోలో భారతదేశపు ఏకైక మహిళా ప్రధాని ఇందిరా గాంధీ యొక్క చారిత్రక ఫోటో మహిళా లోకానికి గొప్ప స్ఫూర్తినిస్తోంది.

ఈ శక్తివంతమైన ఫొటోలో ఆ కాలంలోని ప్రతిష్టాత్మకమైన పురుష నాయకులు ముందు నిలిచొని వుండగా ఆమె ఆత్మవిశ్వాసంతో ప్రధాని కుర్చీలో కూర్చొన్నట్టు కనిపిస్తోంది.

ఈ చిత్రం మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మరొకసారి వెలుగులోకి వచ్చి వైరల్ అయింది. ఇది రాజకీయాల్లో లింగ అసమానతలను అధిగమించిన ఆమె బలాన్ని, నాయకత్వాన్ని ప్రతిబింబిస్తోంది.

పురుషాధిక్య రాజకీయ వ్యవస్థలో ఆమె బలమైన , నిర్ణయాత్మక నాయకురాలిగా కొనసాగిన ఆశయాన్ని గుర్తుచేసే చిత్రంగా ఇది నిలిచింది.

మహిళల సాధికారత, నాయకత్వాన్ని ప్రోత్సహించడానికి అనేక మంది ఈ చిత్రాన్ని షేర్ చేస్తూ సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్‌గా మార్చారు.

Tags:    

Similar News