వైసీపీ మాజీ మంత్రులు ఇద్దరూ రెడీ కావాల్సిందేనా ?
వైసీపీకి ఏపీలో గడ్డు కాలం నడుస్తోంది. రాజకీయంగా చూస్తే అసలు కలిసి రావడం లేదు. కేసుల మీద కేసులు పడుతున్నాయి.;
వైసీపీకి ఏపీలో గడ్డు కాలం నడుస్తోంది. రాజకీయంగా చూస్తే అసలు కలిసి రావడం లేదు. కేసుల మీద కేసులు పడుతున్నాయి. ఆఖరుకు సెటైర్ వేసినా కూడా కేసులు పెడుతున్నారు రాజకీయాల్లో విమర్శలు ఉంటాయి. కౌంటర్లు ఉంటాయి. కానీ వైసీపీ మాట్లాడితే మాత్రం కేసులు పడిపోతున్నాయి. దీంతో చాలా మంది ఎందుకొచ్చిన తంటా అని నోరు మెదపడం లేదు.
అయితే ఇపుడు సైలెంట్ గా ఉన్నా వైసీపీ అధికారంలో ఉన్నపుడు గోల చేసి టీడీపీ అధినాయకత్వం మీద తీవ్ర విమర్శలు చేసి అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని అసలు వదిలిపెట్టేది ఉండదని అంటున్నారు. అన్ని వివరాలూ రెడ్ బుక్ లో ఉన్నాయి. దాని ప్రకారం అలా పనిచేసుకుని పోతుందని అంటున్నారు.
ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ జైలులో ఉన్నారు. ఆయన మీద బలమైన సెక్షన్లతో కేసులు పెట్టారు. బెయిల్ రావడానికి చాలా సమయం పడుతుంది. ఇక పోసాని క్రిష్ణ మురళి విషయంలోనూ ఇలాగే ఉంది. ఆయనను ఏపీలోని అన్ని పోలీస్ స్టేషనలోనూ తిప్ప్పుతున్నారు. కేసులు కూడా లెక్కకు మిక్కిలి ఉన్నాయి.
ఇక ఈ ఇద్దరి తరువాత ఎవరూ అంటే వైసీపీలో ఫైర్ బ్రాండ్లుగా ఉన్న మరో ఇద్దరి పేర్లు వినిపిస్తున్నాయి. వారే మాజీ మంత్రులు కొడాలి నాని ఆర్కే రోజా. ఈ ఇద్దరూ అధికారంలో ఉన్నపుడు టీడీపీని జనసేనను టార్గెట్ చేసుకుని హాట్ కామెంట్స్ చేశారు. కొడాలి నాని అయితే పార్టీ ఓడిన తరువాత గత తొమ్మిది నెలలుగా సైలెంట్ గనే ఉన్నారు.
అసలు ఆయన ఎక్కడ ఉన్నారో కూడా ఎవరికీ తెలియడం లేదు అని అంటున్నారు. కొడాలి నాని ఈ మధ్య వంశీని అరెస్టు చేసినపుడు జగన్ ములాఖత్ కి వెళ్తే ఆయనతో పాటు కనిపించారు. ఇక ఆయన మీద అనేక కేసులు పెట్టడానికి పూర్వరంగం సిద్ధం అవుతోని. కొడాలి నాని మంత్రిగా ఉండగా అవినీతి చేశారా అన్నది చూస్తే కనుక పెద్దగా ఏమీ దొరకలేదని అంటున్నారు.
దాంతో ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారు అన్న దాని మీదనే కేసులు పెడతారు అని అంటున్నారు. అంటే పోసాని కేసుల మాదిరిగానే అని అంటున్నారు. అంతే కాదు ఈ కేసులు కూడా ఒక దాని తర్వాత ఒకటి అన్నట్లుగా పీటీ వారెంట్లు ఇస్తూ పెడితే కనుక ఆయనకు కూడా ఇబ్బంది అవుతుందని అంటున్నారు.
గతంలో యువగళం సందర్భంగా నారా లోకేష్ అయితే కొడాలి నాని మీద హాట్ కామెంట్స్ చేశారు. ఇపుడు తొమ్మిది నెలలు అయిపోయింది. అందువల్ల కొడాలి మీద చర్యలకు డిమాండ్ అయితే ఉంది. దాంతో సడెన్ గా ఈ పరిణామం జరుగుతుందని అంటున్నారు.
అలాగే మాజీ మంత్రి ఆర్కే రోజా ఓటమి పాలు అయినా వైసీపీ నుంచి గట్టి వాయిస్ నే వినిపిస్తున్నారు. మహిళా దినోత్సవం వేళ కూడా ఆమె కూటమి ప్రభుత్వాన్ని వదలలేదు. దాంతో ఆమె మీద కేసుల ఉచ్చు బిగుస్తోందని అంటున్నారు. ఈ విషయం తెలిసినట్లుగానే రోజా కూడా మాట్లాడుతున్నారు. తన మీద కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోంది అని కూడా ఆరోపిస్తున్నారు.
రోజా మీద కేసులు అనుఇచిత వ్యాఖ్యలతో పాటు అవినీతికి సంబంధించి ఉండొచ్చు అని అంటున్నారు. ఆడుదాం ఆంధ్రా పేరుతో అవినీతి చోటు చేసుకుందని కేసులు పెట్టవచ్చు అని వినిపిస్తోంది. దాంతో పోసాని అరెస్ట్ తరువాత కొన్నాళ్ళ పాటు స్తబ్దుగా ఉన్న ఏపీ రాజకీయ వాతావరణం మళ్ళీ ప్రకంపనలు పుట్టించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.