బంగ్లాదేశ్ లో నరకం చూస్తున్న హిందువులు !

పాక్ లో హిందువుల పరిస్థితి మీద భారత్ ఐక్యరాజ్య వేదికగా ఎన్ని సార్లు పోరాడినా పరిస్థితి అలాగే ఉంది

Update: 2024-08-07 03:47 GMT

ముస్లిం దేశాలలో హిందువులు ఎపుడూ ద్వితీయ శ్రేణి పౌరులుగానే జీవిస్తూ ఉంటారు. 1947లో భారత్ నుంచి పాకిస్థాన్ విడిపోయిన నాటికి రెండు కోట్ల మంది దాకా హిందువులు ఆ దేశంలో ఉన్నారని ఒక లెక్క. కానీ ఈ రోజుల చూస్తే అది కనిష్టంగా పడిపోయింది. లక్షలకి వచ్చేసింది.

పాక్ లో హిందువుల పరిస్థితి మీద భారత్ ఐక్యరాజ్య వేదికగా ఎన్ని సార్లు పోరాడినా పరిస్థితి అలాగే ఉంది. ఇక దాని కంటే కాస్తా మెరుగు బంగ్లాదేశ్. ఆ దేశం ముస్లిం ఆధిపత్యంలో ఉన్న దేశ జనాభాలో 12 శాతం గా హిందువులు ఉన్నారు. మొత్తం దేశ జనాభా 14 కోట్ల దాకా ఉంటే కోటిన్నర మంది దాకా హిందువులు ఉన్నారు అన్న మాట.

షేక్ హసీనా ప్రభుత్వంలో హిందువులకు రక్షణ ఉండేది. పైగా ఆమె భారత్ అనుకూలవాదిగా ఉండడంతో హిందువులకు ఇబ్బంది లేకుండా పోయింది. కానీ ఇపుడు షేక్ హసీనా ప్రభుత్వం కుప్పకూలడం అదే టైం లో బంగ్లాదేశ్ సైనికుల ఆధిపత్యంలోకి వెళ్లడంతో అక్కడ శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి.

రిజర్వేషన్ల విషయంలో పోరాటం చేస్తూ వచ్చిన ఆందోళనకారులు షేక్ హసీనా రాజీనామాతో వెనక్కి తగ్గాలి. కానీ అలా జరగలేదు. అరాచకం వైపుగా దారి తీస్తోంది. పైగా హిందువుల మీద దాడులు చేస్తూ మతపరమైన హింసను వారు చేస్తున్నారు. హిందువుల ఇళ్ళలోకి నేరుగా వెళ్ళి వారిని చిత్రహింసలు పెడుతున్నారు. హిందువుల దేవాలయాలు గత కొన్ని రోజులుగా చూస్తే మాడి మసై పోయాయి.

గాంధీ ఇందిరాగాంధీ వంటి భారత జాతి నేతల విగ్రహాలు ద్వంసం చేశారు. ఇవన్నీ చూస్తూంటే బంగ్లా ఆందోళన కాస్తా భారత వ్యతిరేక హిందూ వ్యతిరేక ఆందోళనగా మారింది అని అంటున్నారు. దీంతో హిందువులు బయటకు రావడం లేదు, బిక్కుబిక్కుమంటూ తన ఇళ్ళలోనే గడుపుతున్నారు.

అయినా సరే ఆందోళనకారులు హిందువుల ఇళ్ళకు వెళ్ళి మారణాయుధాలతో తలుపులు బద్ధకు కొట్టి మరీ వారి ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. హిందూ మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. వారికి నరకం చూపిస్తున్నారు. ఇదంతా కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ వైరల్ చేస్తున్నారు.

దీని మీద భారత ప్రభుత్వం స్పందించాలని నెటిజన్లు కోరుతున్నారు. అయితే విదేశాంగ మంత్రి జై శంకర్ హిందువుల విషయంలో వెనక్కి రప్పించేటంతగా పరిస్థితులు లేవని అన్నారు. అక్కడ లా అండ్ ఆర్డర్ దెబ్బ తిందని తాము మొత్తం పరిస్థితిని గమనిస్తున్నామని చెప్పారు.

అయితే భారత ప్రభుత్వం ఇలా చెబుతున్నా బంగ్లాదేశ్ లో హిందువులకు మాత్రం రక్షణ లేదని నెటిజన్లు అంటున్నారు. అక్కడ సైన్యం అయినా కొత్త ప్రభుత్వం అయినా హిందువులకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు. all eyes on bangladeSh hindoos అనే హ్యాష్ ట్యాగ్ తో సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు.

బంగ్లాదేశ్ లో హిందూ మహిళలు మేము ఇక్కడ ఉండలేమని భద్రత లేదని మొరపెట్టుకుంటున్న దృశ్యాలను కూడా సోషల్ మీడియాలో నెటిజన్లు పెడుతున్నారు. మరి కేంద్రం ఏ విధంగా బంగ్లా హిందువులను రక్షిస్తుందో తెలియదు కానీ హిందువులు అయితే నరకం చూస్తున్నారు. వారు ఏమి పాపం చేశారని ఈ విధంగా అందోళనకారులు టార్గెట్ చేస్తున్నారు అన్నది ప్రపంచ దేశాలు కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి. ఇదంతా చూస్తూంటే రిజర్వేషన్ల పేరుతో సాగిన ఉద్యమం వెనక చాలా దురాలోచనలు ఉన్నాయని కుట్ర పూరితంగా ఉద్యమం నడిచింది అని అర్ధం అవుతోంది అంటున్నారు.

Tags:    

Similar News