ఇజ్రాయెల్ ప్రధాని ఇంట్రస్టింగ్ ప్రజెంటేషన్... భారత్ ఓ 'బ్లెస్సింగ్'!

రెండు చేతుల్లోనూ రెండు మ్యాపులను ప్రదర్శించిన ఆయన అందులో ఒకదానికి "శాపం" అని.. మరొక దారిని "ఆశీర్వాదం" అని పేర్లు పెట్టారు.

Update: 2024-09-28 11:15 GMT

ఐక్యరాజ్యసమితి వేదికగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆసక్తికర ప్రసంగం చేశారు. రెండు చేతుల్లోనూ రెండు మ్యాపులను ప్రదర్శించిన ఆయన అందులో ఒకదానికి "శాపం" అని.. మరొక దారిని "ఆశీర్వాదం" అని పేర్లు పెట్టారు. వాటిలో పలు దేశాల పేర్లను ఆయన పేర్కొన్నారు. అందులో ఓ మ్యాప్ లో భారత్ పేరునూ ప్రస్థావించారు.

అవును... గత ఏడాది గాజాలో హమాస్ తో పోరు మొదలైన తర్వాత తొలిసారిగా ఇజ్రాయెల్ ప్రధాని ఐరాస వేదికగా ఆసక్తికరంగా స్పందించారు. ఈ సందర్భంగా రెండు చేతుల్లో రెండు మ్యాప్ లు పట్టుకుని చూపించారు. ఇందులో కుడిచేతిలో "శాపం" పేరిట ఉన్న నలుగు రంగు మ్యాప్ లో ఇరాన్, ఇరాక్, సిరియా, యెమన్ వంటి దేశాలున్నాయి.

ఇదే సమయంలో ఎడమచేతిలోని మ్యాప్ ఆకుపచ్చ రంగులో కనిపించింది. దీనికి "బ్లెస్సింగ్" అని పేరు పెట్టగా.. అందులో ఈజిప్టు, సౌదీ అరేబియా, సూడాన్, ఇండియాను చూపించారు. ఇలా గ్రీన్ మ్యాప్ లో పేర్కొన్న దేశాల్లో కొన్ని నెతన్యాహు ప్రభుత్వానికి మిత్రదేశాలు కాగా.. మరికొన్ని సంబంధాలను పునరుద్ధరించుకునే ప్రయత్నంలో ఉన్నాయి!

ఈ సందర్భంగా స్పందించిన బెంజెమన్ నెతన్యహు... లెబనాన్, సిరియా, యెమెన్ దేశాల్లో హింసకు ఇరాన్ కారణమని చెబుతూ తీవ్రంగా విమర్శలు చేశారు. ఇదే సమయంలో... హెజ్ బొల్లా, హమాస్, హుతీలకు అన్ని విధాలుగాను ఇరాన్ సాయం చేస్తోందని ఆయన నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా హెజ్ బొల్లా గ్రూప్ ను చావుదెబ్బ తీస్తామని బెంజెమన్ తెలిపారు.

ఈ సందర్భంగా హమాస్ ప్రస్థావన తెచ్చిన ఆయన... వారంతా లొంగిపోయి, ఆయుధాలు వీడి, బందీలను విడిచిపెడితేనే గాజా యుద్ధం ఆగుతుందని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే.. అప్పటి వరకూ దాడులు మాత్రం ఆపే ప్రసక్తే లేదని ఇజ్రాయెల్ ప్రధాని స్పష్టం చేశారు.

కాగా.. అక్టోబరు 7న ఇజ్రాయెల్ పై హమాస్ దాడిని ఖండించిన మొదటి ప్రపంచ నాయకులలో ప్రధాని నరేంద్ర మోడీ ఒకరు అనే సంగతి తెలిసిందే.

Tags:    

Similar News