టీడీపీ అధ్యక్షురాలిగా నారా భువనేశ్వరి...?
తెలుగుదేశం పార్టీలో ఏమి జరుగుతోంది అన్నది ఇపుడు చర్చగా ఉంది. నారా భువనేశ్వరి అంటే చంద్రబాబు సతీమణి అని మాత్రమే అందరికీ తెలుసు. అలాంటి ఆమె గత యాభై రోజులుగా ఏపీలో ఉంటున్నారు.
తెలుగుదేశం పార్టీలో ఏమి జరుగుతోంది అన్నది ఇపుడు చర్చగా ఉంది. నారా భువనేశ్వరి అంటే చంద్రబాబు సతీమణి అని మాత్రమే అందరికీ తెలుసు. అలాంటి ఆమె గత యాభై రోజులుగా ఏపీలో ఉంటున్నారు. జనంలో ఉంటున్నారు. టీడీపీ క్యాడర్ తో మమేకం అవుతున్నారు. నిజం గెలవాలి అంటూ ఆమె యాత్రకు కూడా శ్రీకారం చుట్టారు.
అలా టీడీపీలో ఆమె పాత్ర రోజురోజుకు పెరిగిపోతోంది. ఆమె టీడీపీలో ఏ బాధ్యతలో ఉన్నారు అంటే జవాబు లేదు కానీ ఆమె టీడీపీ అని ఇపుడున్న పరిస్థితుల్లో అనుకుంటే మాత్రం అదే అసలైన జవాబు అవుతుంది. భువనేశ్వరి వర్తమానంలో జరుగుతున్న అనేక రాజకీయ అంశాల మీద స్పందిస్తున్నారు.
విజయనగరం రైలు ప్రమాదం మీద రియాక్ట్ అయ్యారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియచేశారు. ఇపుడు ఆమె నేరుగా బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు విజయనగరం జిల్లాకు వస్తున్నారు. వారిని స్వయంగా కలసి భరోసా ఇస్తారని అంటున్నారు. అదే విధంగా ప్రమాద ఘటన వివరాలను కూడా తెలుసుకుంటారు అని అంటున్నారు.
ఏపీ టీడీపీకి చాలా మంది లీడర్స్ ఉన్నారు. అంతవరకూ ఎందుకు జాతీయ ప్రధాన కార్యదర్శిగా నారా లోకేష్ ఉన్నారు. ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ గా అచ్చెన్నాయుడు ఉన్నారు. అలాగే యనమల రామక్రిష్ణుడు సహా ఇతర సీనియర్ నేతలు ఉన్నారు. అయినా భువనేశ్వరే ఇపుడు పార్టీ అన్నట్లుగా ఉంది అని ప్రచారం సాగుతోంది.
దాంతో భువనేశ్వారి చంద్రబాబు జైలులో లేని టైం లో తాత్కాలిక టీడీపీ ప్రెసిడెంట్ గా బాధ్యతలను నిర్వహిస్తున్నారా అన్న చర్చ కూడా మొదలైంది. దీని మీద అధికార వైసీపీ అయితే ప్రశ్నలను సంధిస్తోంది. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక్రిష్ణారెడ్డి అయితే భువనేశ్వరి పాత్ర హోదా టీడీపీలో ఏమిటి అని ప్రశ్నిస్తున్నారు.
టీడీపీ అంతర్గతంగా దివాళా తీసిందని ఆయన హాట్ కామెంట్స్ చేశారు. అందుకే రైల్వే క్షతగాత్రుల పరామర్శకు భువనేశ్వరి వెళుతున్నారని కూడా సజ్జల విమర్శించారు. ఇక భువనేశ్వరి టీడీపీ అధ్యక్షురాలు కానున్నారా అని సజ్జల ప్రశ్నించారు. అసలు నారా లోకేష్ ఏమయ్యాడు, ఎందుకు దూరం పెడుతున్నారని కూడా సజ్జల రామకృష్ణారెడ్డి అంటున్నారు. ఇవన్నీ చూస్తూంటే టీడీపీలో ఏదో జరుగుతోందా అనిపిస్తోంది. నిజానికి పక్క జిల్లాలోనే అచ్చెన్నాయుడు ఉన్నారు. ఆయన అనుకుంటే క్షణాలలో పరామర్శించవచ్చు. కానీ భువనేశ్వరి రావడం అంటే ఆమెతోనే టీడీపీ ఉందా అన్న ప్రశ్నలు కూడా ఎదురవుతున్నాయి.
మరి భువనేశ్వరి మీద పెద్ద బాధ్యతలు రానున్న రోజులలో పెట్టబోతున్నారా చంద్రబాబు పరోక్షంలో భువనేశ్వరినే పార్టీని నడుపుతారా అని కూడా డౌట్లు వస్తున్నాయి. మరి భువనేశ్వరి నిజంగా టీడీపీ ప్రెసిడెంట్ అవుతారా అన్నది కూడా చర్చకు వస్తోంది.