195 మందితో బీజేపీ ఫస్ట్ లిస్ట్ రెడీ

ఈ క్రమంలోనే తాజాగా 195 మంది అభ్యర్థుల పేర్లతో తొలి జాబితాను బీజేపీ ప్రధాన కార్యదర్శి వినోద్‌ తావ్‌డే ఢిల్లీలో ప్రకటించారు.

Update: 2024-03-02 14:40 GMT

మరో నెలన్నర రోజుల్లో దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో లోక్ సభ ఎన్నికల బరిలో దిగే అభ్యర్థుల జాబితాపై ఇటు కాంగ్రెస్ పార్టీ అటు, బీజేపీ ముమ్మరంగా కసరత్తు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా 195 మంది అభ్యర్థుల పేర్లతో తొలి జాబితాను బీజేపీ ప్రధాన కార్యదర్శి వినోద్‌ తావ్‌డే ఢిల్లీలో ప్రకటించారు. 2024 ఎన్నికల్లో 400 సీట్లే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తున్నామని అన్నారు. తొలి జాబితాలో తెలంగాణ నుంచి తొమ్మిది మందికి అవకాశం దక్కింది.

తొలి జాబితాలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతోపాటు పలువురు హేమాహేమీలు ఈ జాబితాలో ఉన్నారు. వరుసగా మూడోసారి మోడీ వారణాసి నుంచి పోటీ చేయబోతున్నారు. ప్రధాని మోడీ నేతృత్వంలో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సుదీర్ఘ చర్చలు జరిపిన తర్వాత ఈ తొలి జాబితాను విడుదల చేసింది. బెంగాల్ నుంచి 27 మందికి, మధ్యప్రదేశ్ నుంచి 24 మందికి, గుజరాత్ నుంచి 15 మందికి తొలి జాబితాలో చోటు దక్కింది.

రాజస్థాన్ కు 15 మంది అభ్యర్థులను, కేరళకు 12 మంది అభ్యర్థులను, తెలంగాణకు 9 మంది అభ్యర్థులను, జార్ఖండ్ కు 11 మంది అభ్యర్థులను, ఛత్తీస్ గఢ్ కు 12 మంది అభ్యర్థులను, ఢిల్లీకి ఐదుగురు అభ్యర్థులను, జమ్మూ కాశ్మీర్ కు ఇద్దరు అభ్యర్థులను, ఉత్తరాఖండ్ కు ముగ్గురు, అరుణాచల్ ప్రదేశ్ కు ఇద్దరు, గోవాకు ఒక అభ్యర్థిని, త్రిపురకు ఒక అభ్యర్థిని, అండమాన్ నికోబార్ కు ఒక అభ్యర్థిని, డమన్ అండ్ డయ్యూకు ఒక అభ్యర్థిని బీజేపీ ప్రకటించింది.

ఇక, తొలి జాబితాలో 28 మంది మహిళలు, 47 మంది యువతీ యువకులు స్థానాలు దక్కించుకున్నారు. ఇక, ఎస్సీలకు 27 సీట్లు కేటాయించగా ఎస్టీలకు 18 స్థానాలు కేటాయించారు. 57 మంది ఓబీసీలు తొలి జాబితాలో చోటు దక్కించుకోగా 34 మంది మంత్రులు, ఇద్దరు సీఎంలు కూడా తొలి జాబితాలో ఉన్నారు.

Tags:    

Similar News