అక్కడ వలసొచ్చిన వారికే పెద్దపీట

దేశంలో జరుగుతున్న లోక్ సభ ఎన్నికలలో బీజేపీ పోటీ చేస్తున్న స్థానాల సంఖ్య 435.

Update: 2024-05-16 15:30 GMT

దేశంలో జరుగుతున్న లోక్ సభ ఎన్నికలలో బీజేపీ పోటీ చేస్తున్న స్థానాల సంఖ్య 435. అందులో 106 మంది ఇతర పార్టీల నుండి వచ్చిన వారే కావడం గమనార్హం. అంటే ఇది దాదాపు 25 శాతం కావడం విశేషం. పోటీ చేస్తున్న ప్రతి నలుగురిలో ఒకరు పార్టీ ఫిరాయించిన వారు ఉన్నారు. దేశంలో మూడో సారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా మోడీ ఈసారి ఎన్నికలలో పాత మొఖాలను మార్చి కొత్త వారికి టికెట్లు ఇస్తున్నారు.

అభ్యర్థుల మీద వ్యతిరేకత పార్టీ మీద పడుతుందన్న భయంతో బీజేపీ కొత్తవారికి టికెట్లు ఇచ్చేందుకు మొగ్గు చూపుతున్నది. గడిచిన ఐదేళ్లలో దేశంలో 90 మంది ఎంపీలు బీజేపీ పార్టీలో చేరారు. ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ తరపున పోటీ చేసిన వారిలో 5 గురు పార్టీ ఫిరాయించిన వారు ఉండగా, తెలంగాణలో 11 మంది ఫిరాయించిన వారికి టికెట్లు ఇచ్చారు.

హర్యానాలో 10 స్థానాలలో ఆరుగురికి, పంజాబ్, జార్ఖండ్ రాష్ట్రాలలో 26 స్థానాలకు గాను 14 మందికి. యూపీలో 74 స్థానాలలో 23 మందికి, ఒడిశాలో 21 స్థానాలకు గాను ఆరుగురికి, తమిళనాడులో 19 స్థానాలలో ఐదుగురికి, మహారాష్ట్రలో 28 స్థానాలకు గాను ఏడుగురికి, పశ్చిమ బెంగాల్ లో 42 స్థానాలకు గాను 10 మందికి, బీహార్ లో 17 స్థానాలలో ముగ్గురికి, కర్ణాటకలో 25 స్థానాలకు గాను నలుగురికి, కేరళ, రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్ లలో ఇద్దరు చొప్పున వలసవచ్చిన వారికే బీజేపీ టికెట్లు కేటాయించింది.

Tags:    

Similar News