జాక్ పాట్ కొట్టిన బీజేపీ వర్మ !

మున్సిపల్‌ కౌన్సిలర్‌గా, డీఎన్‌ఆర్‌ విద్యా సంస్థల జాయింట్ సెక్రెటరీ, కరస్పాండెంట్‌గా, భూపతిరాజు బాపిరాజు ఎడ్యుకేషనల్‌ సొసైటీ ఛైర్మన్‌గా వ్యవహరించారు.

Update: 2024-06-09 08:59 GMT

భీమవరానికి చెందిన భూపతిరాజు శ్రీనివాస వర్మ ఆలియాస్ బీజేపీ వర్మ కేంద్ర మంత్రివర్గంలో అనూహ్యంగా స్థానం సంపాదించాడు. దశాబ్దాలుగా ఆయన బీజేపీలో కొనసాగడంతో ఆయనకు బీజేపీ వర్మ అన్న పేరు వచ్చింది. మున్సిపల్‌ కౌన్సిలర్‌గా, డీఎన్‌ఆర్‌ విద్యా సంస్థల జాయింట్ సెక్రెటరీ, కరస్పాండెంట్‌గా, భూపతిరాజు బాపిరాజు ఎడ్యుకేషనల్‌ సొసైటీ ఛైర్మన్‌గా వ్యవహరించారు. 1980ల్లో కమ్యూనిస్ట్ విద్యార్థి సంఘం ఏఐఎస్‌ఎఫ్‌లో పని చేశారు. విద్యార్థుల సమస్యల పరిష్కారం.. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడారు.

తర్వాత బీజేపీ విధానాలకు ఆకర్షితులై ఆ పార్టీలో చేరారు. 1991-1997 మధ్య బీజేపీ భీమవరం టౌన్, పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షునిగా ఉన్నారు. తర్వాత జిల్లా కార్యదర్శిగా, నరసాపురం పార్లమెంట్‌ కన్వీనర్‌గా, జాతీయ కౌన్సిల్‌ మెంబర్‌గా వ్యవహరించారు. 2020-23 మధ్య బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా వ్యవహరించారు. అయితే, 2009 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ తరఫున నరసాపురం పోటీ చేసి ఓటమి పాలయ్యాడు.

ఏపీ నుండి ఈసారి కేంద్రంలో పురంధేశ్వరి, రామ్మోహన్ నాయుడు, పెమ్మరాజులకు అవకాశం దక్కుతుందని అంతా అనుకున్నారు. కానీ అనూహ్యంగా రెండు రాష్ట్రాలకు చెరో రెండు పదవులు దక్కాయి. అదనంగా ఆంధ్రా నుండి వర్మకు అవకాశం దక్కడం విశేషం.

Tags:    

Similar News