‘బ్లూ డ్రమ్స్’ పై మీరట్ హత్య ప్రభావం... తెరపైకి షాకింగ్ విషయాలు!
ఇటీవల మీరట్ లో మాజీ మర్చంట్ నేవీ అధికారిని అతని భార్య, ఆమె ప్రియుడు కలిసి హత్య చేసిన ఘటన తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే.;

ఇటీవల మీరట్ లో మాజీ మర్చంట్ నేవీ అధికారిని అతని భార్య, ఆమె ప్రియుడు కలిసి హత్య చేసిన ఘటన తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో భర్తను ముక్కలుగా చేసి బ్లూ డ్రమ్ లో దాచిన పరిస్థితి. ఈ ఘటన తీవ్ర సంచలనంగా మారింది. పైగా నాన్న డ్రమ్ము లో ఉన్నాడని ఆ దంపతుల కుమార్తె పక్కింటివారికి తరచూ చెప్పేదనే విషయం పలువురిని కంటనీరు పెట్టించింది!
ఇదే సమయంలో... అదే యూపీలోని మీరట్ లో మరో మహిళ భర్తను గట్టిగానే బెదిరించింది. ఇందులో భాగంగా... ప్రవర్తన మార్చుకోకపోతే నరికి చంపి, శరీర భాగాలను డ్రమ్ లో వేసి సీల్ చేస్తానని తన భార్య బెదిరిస్తోందని ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇలా వరుసగా బ్లూ డ్రమ్ కి సంబంధించిన వార్తలు తెరపైకి రావడం.. వాటి అమ్మకాలపై తీవ్ర ప్రభావం చూపాయని అంటున్నారు.
అవును... ఇలా వరుస బెదిరింపులు, హత్యల ఘటన తెరపైకి రావడంతో అలీఘర్ లో సాధారణ హార్డ్ వేర్ వస్తువు అయిన బ్లూ డ్రమ్ అమ్మకాన్ని గణనీయంగా ప్రభావితం చేసిందని చెబ్బుతున్నారు. మీరట్ ఘటన అనంతరం.. చాలామంది ఇప్పుడు ఈ బ్లూ డ్రమ్స్ ని భయంతో చూస్తున్నారని చెబుతూ సోషల్ మీడియాలో రీల్స్ చక్కర్లు కొడుతున్నాయి!
ఇందులో భాగంగా... అలీఘర్ లో బ్లూ డ్రమ్స్ అమ్మకాలు గణనీయంగా తగ్గాయి.. ఇప్పుడు ప్రజలు వీటిని కొనే విషయంలో కాస్త జాగ్రత్తగా ఉంటున్నారు.. ఈ సమయంలో ఆ డ్రమ్మ్ కొనుక్కుని వెళ్తున్న వారితో "మర్డర్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా?" అని జోకులు చేస్తున్న పరిస్థితి అని సోషల్ మీడియాలో నెటిజన్లు సరదా పోస్టులు పెడుతున్నారు.
అయితే.. ఈ ఎఫెక్ట్ నిజంగానే ఉందని అంటున్నారు. ఈ సందర్భంగా స్పందించిన ఓ దుకాణదారుడు... అలీఘర్ లోని రసల్ గంజ్ లో డ్రమ్ మార్కెట్ అమ్మకాలు గణనీయంగా తగ్గాయని.. నెలకు 40-50 డ్రమ్ముల నుంచి ఇప్పుడు 15 కి పడిపోయాయని చెబుతున్నారు. ఆ భయంకరమైన ఘటనతో ఈ డ్రమ్ములను ముడిపెట్టడమే ఇందుకు కారణం అని అంటున్నారు.