దొరికిన నిధిని దాస్తే చిక్కుల్లో పడతారు.. ఆంగ్లేయుల చట్టం ఏం చెబుతుందో తెలుసా?

ఎక్కడైనా భూమిలో నిధి దొరికితే ఉద్యోగం మానేసి హాయిగా బతకాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు.;

Update: 2025-04-05 04:41 GMT
Struck Gold? Why That Treasure Might Not Be Yours!

ఎక్కడైనా భూమిలో నిధి దొరికితే ఉద్యోగం మానేసి హాయిగా బతకాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. చాలా మంది కలలో నిధి కనిపించిందని, ఆ ప్రదేశంలో తవ్వకాలు కూడా మొదలు పెడతారు. కానీ భూమిలో పాతిపెట్టిన నిధిపై హక్కు సాధించడం అంత సులభమా? మీ ఇంటిలో లేదా పొలంలో దొరికిన నిధి మీ సొంతం అవుతుందా? వివరంగా తెలుసుకుందాం. భారత ప్రభుత్వం భూమిలో పాతిపెట్టిన ఇలాంటి నిధుల కోసం ఒక చట్టాన్ని రూపొందించింది. దీనిని దఫీనా చట్టం అని పిలుస్తారు. అయితే, భారతదేశంలో దొరికిన నిధిపై తమ హక్కును నిరూపించుకోవడానికి ఆంగ్లేయులు కూడా ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. నిధి దొరికిన వెంటనే మొదట ఏమి చేయాలో తెలుపుతూ ఆంగ్లేయులు తీసుకొచ్చిన ఈ చట్టం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత చాలా మంది భూమిలో పాతిపెట్టిన నిధులు దొరికాయని పేర్కొన్నారు. 1971లో ప్రభుత్వం ఇలాంటి కేసులను పరిష్కరించడానికి ఒక చట్టాన్ని రూపొందించింది. దీనినే దఫీనా చట్టం అని పిలుస్తారు. ఈ చట్టం ప్రకారం, ఇల్లు లేదా పొలం తవ్వే సమయంలో ఏదైనా నిధి లేదా బంగారం దొరికితే, దఫీనా చట్టం ప్రకారమే చర్యలు తీసుకుంటారు. నిధి దొరికిన వెంటనే సంబంధిత జిల్లా కలెక్టర్ లేదా జిల్లా మేజిస్ట్రేట్‌కు సమాచారం ఇవ్వాలి. ఆ తర్వాత ఆ నిధిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ప్రభుత్వ ఖజానాలో జమ చేస్తుంది. దఫీనా చట్టం ప్రకారం.. నిధి మీ ఇంట్లో దొరికినా లేదా పొలంలో దొరికినా దానిపై ప్రభుత్వానికి పూర్తి హక్కు ఉంటుంది. అయితే, ఆ వ్యక్తి కోర్టులో దానిపై తన యాజమాన్యాన్ని నిరూపించుకుంటే నిధి అతనికి అప్పగించవచ్చు.

దఫీనా చట్టంలో ఒక నిబంధన ఉంది. ఎవరైనా నిధి దొరికిన తర్వాత దానిని దాచిపెడితే లేదా ప్రభుత్వానికి సరైన సమాచారం ఇవ్వకపోతే వారిపై చర్యలు తీసుకుంటారు. ఇలాంటి కేసులో మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు అరెస్టు కూడా చేయవచ్చు. ఈ విషయంలో 6 నెలల జైలు శిక్ష లేదా జరిమానా విధించే అవకాశం కూడా ఉంది. భారతదేశంలో భూమిలో పాతిపెట్టిన నిధిపై తమ హక్కును నిరూపించుకోవడానికి ఆంగ్లేయులు కూడా చట్టం తీసుకొచ్చారు. దీని కోసం ఆంగ్లేయులు 1878 నాటి భారతీయ ఖజానా నిధి చట్టాన్ని అమలు చేశారు. దీని ప్రకారం, ఎవరికైనా 10 రూపాయల కంటే ఎక్కువ విలువైన నిధి దొరికితే..దానిపై ఆంగ్లేయుల ప్రభుత్వానికి హక్కు ఉండేది. ఎవరైనా దానిని దాచిపెడితే వారికి కఠిన శిక్షలు కూడా విధించేవారు.

Tags:    

Similar News