చంద్రబాబు వినూత్న క్యాబినెట్ !

ప్రతి ఏడుగురు ఎమ్మెల్యేలకు ఒక మంత్రి పదవి చొప్పున టీడీపీకి సీఎం సహా 21, జనసేనకు 3, బీజేపీకి ఒక మంత్రి పదవి దక్కింది

Update: 2024-06-12 03:40 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేయనున్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తన క్యాబినెట్ సహచచరులను వినూత్నంగా ఎంచుకున్నారు. అన్ని జిల్లాలు, అన్ని సామాజిక వర్గాలు క్యాబినెట్ లో ఉండేలా చర్యలు తీసుకున్నారు. 24 మంది మంత్రులలో 17 మంది కొత్తవారికి స్థానం కల్పించారు.

ప్రతి ఏడుగురు ఎమ్మెల్యేలకు ఒక మంత్రి పదవి చొప్పున టీడీపీకి సీఎం సహా 21, జనసేనకు 3, బీజేపీకి ఒక మంత్రి పదవి దక్కింది. జిల్లాల వారీగా చిత్తూరు - 1 (ముఖ్యమంత్రి), కడప - 1, విశాఖపట్నం - 1, శ్రీకాకుళం - 1, తూర్పు గోదావరి - 2, ప్రకాశం - 2, విజయనగరం - 2, కృష్ణా - 2,

నెల్లూరు - 2, పశ్చిమ గోదావరి - 2, గుంటూరు - 3, అనంతపురం - 3, కర్నూలు - 3 మంత్రి పదవులు దక్కాయి. పార్టీల వారీగా మంత్రి పదవులు దక్కిన వారి వివరాలు ఇలా ఉన్నాయి.

తెలుగుదేశం

1. నారా లోకేశ్‌, మంగళగిరి

2. కింజారపు అచ్చెన్నాయుడు, టెక్కలి

3. కొల్లు రవీంద్ర, బందరు

4. పొంగూరు నారాయణ, నెల్లూరు సిటీ

5. వంగలపూడి అనిత, పాయకరావుపేట

6. నిమ్మల రామానాయుడు, పాలకొల్లు

7. ఎన్‌ఎండీ ఫరూక్‌, నంద్యాల

8. ఆనం రామనారాయణ రెడ్డి, ఆత్మకూరు

9. పయ్యావుల కేశవ్‌, ఉరవకొండ

10. అనగాని సత్యప్రసాద్‌, రేపల్లె

11. కొలుసు పార్థసారథి, నూజివీడు

12. డోలా బాల వీరాంజనేయ స్వామి, కొండపి

13. గొట్టిపాటి రవికుమార్‌, అద్దంకి

14. గుమ్మడి సంధ్యారాణి, సాలూరు

15. బీసీ జనార్దన రెడ్డి, బనగానపల్లి

16. టీజీ భరత్‌, కర్నూలు

17. ఎస్‌.సవిత, పెనుకొండ

18. కొండపల్లి శ్రీనివాస్‌,గజపతినగరం

19. ఎం.రాంప్రసాద్‌ రెడ్డి, రాయచోటి

20. వాసంశెట్టి సుభాష్‌, రామచంద్రాపురం

జనసేన

1. పవన్‌ కల్యాణ్‌, పిఠాపురం

2. నాదెండ్ల మనోహర్‌, తెనాలి

3. కందుల దుర్గేశ్‌, నిడదవోలు

బీజేపీ

1. సత్యకుమార్‌ యాదవ్‌, ధర్మవరం

Tags:    

Similar News