బాబు జైలు ఖర్చు చూస్తే షాక్ తినాల్సిందే...!
చంద్రబాబు మీద ఇపుడు సోషల్ మీడియాలో సెటైర్ల పర్వం ఒక్క లెక్కన సాగుతోంది. ఒక్క రోజు గడిస్తే అంటే అక్టోబర్ 29 నాటికి చంద్రబాబు జైలు జీవితానికి యాభై రోజులు పూర్తి అవుతాయి
చంద్రబాబు మీద ఇపుడు సోషల్ మీడియాలో సెటైర్ల పర్వం ఒక్క లెక్కన సాగుతోంది. ఈ రోజుకి అంటే అక్టోబర్ 29 నాటికి చంద్రబాబు జైలు జీవితానికి యాభై రోజులు పూర్తి అయ్యాయి. దాంతో కటకటాల చంద్రన్న అంటూ కామెంట్స్ చేస్తున్నారు వైసీపీ సోషల్ మీడియాలో. మరో వైపు చూస్తే చంద్రబాబుని అకారణంగా బంధీగా చేశారని, ఆయనను ప్రజలకు దూరం చేయడానికే ఇదంతా అంటూ ఆయన తనయుడు నారా లోకేష్ మీడియా ముందు తాజాగా మరోసారి ఘాటైన విమర్శలు చేశారు.
ఈ యాభై రోజులలో బాబు నేరం చేశారు అనడానికి ఏమి ఆధారాలు చూపించారు అని డైరెక్ట్ క్వశ్చన్ నే లోకేష్ ప్రభుత్వానికి వేశారు. ఇదంతా టీడీపీని అడ్డుకోవడానికే తప్ప మరేమీ కాదని, ఇదంతా దురుద్దేశ్యంతో రాజకీయ కక్షతో చేస్తున్నారు అని ఆయన అంటున్నారు. చంద్రబాబు మీద పెట్టే శ్రద్ధ రైతు సమస్యల మీద ప్రజల సమస్యల మీద పెడితే ఏపీ బాగుపడుతుందని లోకేష్ సూచించారు.
లోకేష్ అన్నారని కాదు కానీ బాబు మీద ఏపీ సర్కార్ ఫుల్ ఫోకస్ పెట్టింది. అలా ఇలా కాదు ఆయన భద్రత కోసం ప్రభుత్వం పెడుతున్న ఖర్చు చూస్తే షాక్ తినాల్సిందే. ప్రతీ రోజూ యాభై వేల నుంచి లక్ష రూపాయల దాకా బాబు భద్రత కోసం ఆయన సదుపాయాల కోసం ప్రభుత్వం రాజమండ్రి జైలులో ఖర్చు చేస్తోంది. కోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం ఇలా చేస్తోంది. బాబు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.
దాంతో చంద్రబాబు సెక్యూరిటీ ప్రభుత్వానికి చాలా ఇంపార్టెంట్ అయింది. బాబును జైలుకు తరలించిన వెంటనే ఆయన కోసం ఏకంగా స్నేహా బ్లాక్ ప్రభుత్వం ఖాళీ చేయించి మొత్తం అంతా ఆయనకే కేటాయించింది. అందులో ఉన్న ఖైదీలను ఇతర బ్లాకులలో సర్దడానికి ఇతరత్రా స్నేహ బ్లాకులో సదుపాయాల కోసం ప్రభుత్వం లక్షలలో ఖర్చు చేసింది అంటున్నారు.
చంద్రబాబుకు ఇపుడు టవర్ ఏసీ సదుపాయం ఇస్తున్నారు. అలాగే ఆయనకు ఫ్యాన్లు, బెడ్స్ సీసీ కెమెరాల వంటి వాటి కోసం ఏకంగా పది నుంచి పదిహేను లక్షల దాకా ప్రభుత్వం ఖర్చు చేసినట్లుగా ప్రచారంలో ఉంది. ఇక ప్రతీ రోజూ బాబుకు అయ్యే ఖర్చు ఒక లకారం అని అంటున్నారు. ఇలా యాభై రోజులలో బాబుకు ప్రభుత్వం పెట్టిన ఖర్చు అర కోటి అని మామూలుగా వేస్తున్న లెక్కలు. ఇంకా వీటికి అదనపు ఖర్చులు కలుపుకుంటే కోటి రూపాయలు పై దాటుతుంది అని అంటున్నారు.
ఇంత ఖర్చు పెట్టి జైలులో బాబుని కాపలా కాస్తూ ఆయన భద్రత కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటే తనకు ప్రాణహాని ముప్పు అని బాబు లేఖలు రాస్తున్నారు అని అంటున్నారు. బాబు భద్రత విషయంలో చూస్తే ఈ రోజున అరెస్ట్ అయి జైలుకు వెళ్ళిన ఏ వీవీఐపీకి పెట్టనంత ఖర్చు పెడుతోంది ఏపీ ప్రభుత్వం అంటున్నారు. ఏసీ ఏ వీఐపీ ఖైదీకి దేశ చరిత్రలో లేదని అంటున్నారు.
దేశాన్ని హోం మంత్రిగా అయిదేళ్ళ పాటు పాలించి శాసించిన పి చిదంబరం బీజేపీ హయాంలో జైలుకు వెళ్ళి ఏకంగా 110 రోజుల పాటు అందులో ఉన్నారు. ఆయనకు కనీస సౌకర్యాలే తప్ప వీఐపీ సదుపాయాలు ఇవ్వలేదు, ఆయన ఫ్యామిలీ కూడా డిమాండ్ చేయలేదు అని అంటున్నారు. ఇక బాబు విషయంలో ఇంటి నుంచి భోజనం అందుతోంది, అలాగే ఆయనకు నిరంతరం వైద్య పరీక్షలకు అత్యున్నత వైద్య బృందం అందుబాటులో ఉంటోంది. బాబుకు డైలీ చూసేందుకు పత్రికలు అందుబాటులో ఉంటాయి. ఒక విధంగా చూస్తే ఇంటి కంటే గుడి పదిలం అన్నట్లుగా బాబుకు ఏ రకమైన వత్తిడి లేని జీవితమే జైలులో ఉందని అంటున్నారు.
అయితే బాబు అరెస్ట్ అన్నది రాజకీయంగా వైసీపీ టీడీపీల మధ్య అగ్గి రాజేస్తోంది. కాబట్టి బాబుని బాధ పెడుతున్నారు హింస పెడుతున్నారు అని టీడీపీతో పాటు ఆ పార్టీ సానుభూతిపరులు సెలిబ్రిటీలు అంటున్నారు. నిజంగా రిమాండ్ ఖైదీకి ఎక్కడా ఇన్ని సదుపాయలు లేవు అని అంటున్నారు. బాబు ఈ విషయంలో అదృష్టవంతుడే అని అంటున్నారు.