ముహూర్తం చూసుకోలేదా? ఆషాఢంలో తెలుగు సీఎంల తొలి భేటీనా?

బాబు నాయుడు కేంద్రంలోని బీజేపీ సారథ్య ఎన్డీఏ కూటమి భాగస్వామి. రాష్ట్రంలోనూ బీజేపీకి అధికారంలో భాగస్వామ్యం ఇచ్చింది

Update: 2024-07-02 16:30 GMT

బాబు నాయుడు కేంద్రంలోని బీజేపీ సారథ్య ఎన్డీఏ కూటమి భాగస్వామి. రాష్ట్రంలోనూ బీజేపీకి అధికారంలో భాగస్వామ్యం ఇచ్చింది. వాస్తవానికి చంద్రబాబుతో రేవంత్ కు సాన్నిహిత్యం ఉన్నప్పటికీ.. కాంగ్రెస్ సీఎం కావడంతో అనివార్యంగా అయినా దూరంగా ఉండక తప్పదు. అయితే, వీరిద్దరూ ఇప్పుడు భేటీ అయ్యే సందర్భం వచ్చింది.

తొలి భేటీ..

తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు-రేవంత్ తొలి భేటీ ఈ నెల 6న జరగనుంది. ఆ రోజు చంద్రబాబు హైదరాబాద్ రానున్నారు. ప్రజా భవన్ లో సమావేశం కానున్నారు. రేవంత్ లోని చురుకైన నాయకుడిని గుర్తించిన టీడీపీ అధినేత చంద్రబాబు15 ఏళ్ల కిందట ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. ఇప్పుడు అదే రేవంత్ సీఎం కావడం ఎంతైనా చంద్రబాబుకు మనసులో గర్వకారణమే. మరోవైపు రేవంత్ కూడా చంద్రబాబును గౌరవభావంతో చూస్తారనడంలో సందేహం లేదు.

ముహూర్తం సరైనదేనా?

చంద్రబాబు-రేవంత్ భేటీ కానున్నశనివారం (6వ తేదీ) అషాఢ మాసం తొలి రోజు. శుక్రవారం 5వ తేదీ అమావాస్య. దీంతోనే సీఎంల తొలి సమావేశం ముహూర్తంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అసలు ఆ రోజు సమావేశం పెట్టుకోకూడని సంప్రదాయ వాదులు అంటున్నారు. మధ్యే వాదులైతే సరైన సమయం చూసుకోవాల్సిందని పేర్కొంటున్నారు. ఇక ఇవేమీ పట్టించుకోనివారైతే ఎప్పుడైతే ఏమిటని వ్యాఖ్యానిస్తున్నారు.

ఆచారాల్లో ఇద్దరూ ఇద్దరే..

ముహూర్తాలు, మంచి రోజులు, శుభ ఘడియలు వంటివాటికి చంద్రబాబు, రేవంత్ పెద్దగా పట్టించుకోరు. అయితే, పూర్తిగా విస్మరించరు. ఇద్దరూ సీఎంలు అయ్యాక తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దర్శించుకున్న సంగతి తెలిసిందే. అయితే, ప్రతిదానికి ముహూర్తం, మంచి రోజు అంటూ వేచి చూడరు. మరి అలాంటివారు ఆషాఢ మాసం తొలి రోజు భేటీ అవుతుండడం గమనార్హం.

Tags:    

Similar News

eac