రూ.100 కోట్ల స్కామ్.. ఏపీతో లింకులు.. ఎవరీ చైనా పౌరుడు!

ఈ క్రమంలో వాట్సప్ గ్రూపుల ద్వారా నిర్వహించే ఆన్ లైన్ స్టాక్ ట్రేడింగ్ మోసం వ్యవహారం ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది.

Update: 2024-11-19 21:30 GMT

ఇటీవల కాలంలో సైబర్ మోసాలు తీవ్ర స్థాయిలో పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. ఏ మాత్రం అప్రమత్తంగా లేకపోయినా సైబర్ కేటుగాళ్ల బారిన పడటం తప్పదనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో వాట్సప్ గ్రూపుల ద్వారా నిర్వహించే ఆన్ లైన్ స్టాక్ ట్రేడింగ్ మోసం వ్యవహారం ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది.

అవును... భారీ సైబర్ మోసం వ్యవహారం ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. ఓ బాధితుడి ఫిర్యాదు మేరకు రూ.43.5 లక్షల మోసం వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్న పోలీసులకు ఇది రూ.100 కోట్ల వ్యవహారం అని తేలిందని చెబుతున్నారు. ఈ వ్యవహారంలో చైనా జాతీయుడిని ఢిల్లీలో అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఫాంగ్ చెంజిన్ అనే చైనా జాతీయుడు వాట్సప్ గ్రూపుల ద్వారా ఆన్ లైన్ స్టాక్ ట్రేడింగ్ నిర్వహిస్తుంటాడట! ఈ సమయంలో ఈ వ్యవహారం పేరు చెప్పి మోసాలకు పాల్పడ్డాడు. ఈ సమయంలో ఇతడి బాధితుల్లో ఒకరైన సురేష్ అచ్యుతన్ అనే వ్యక్తి సైబర్ క్రైం పోర్టల్ లో ఫిర్యాదు చేశారు.

ఈ ఫిర్యాదులో... తనకు తొలుత ఈ స్టాక్ మార్కెట్ శిక్షణ ఇచ్చారని.. అనంతరం అనేక లావాదేవీలలో డబ్బు పెట్టుబడి పెట్టించారని.. అనంతరం నిందితుల నియంత్రణలో ఉన్న బ్యాంక్ ఖాతాలకు తన నిధులు రూ.43.5 లక్షలు బదిలీ చేయబడ్డాయని పేర్కొన్నాడు. ఈ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులకు.. ఏప్రిల్ లో ఒకసారి రూ.1.25 లక్షలు ట్రాన్స్ ఫర్ అయిన బ్యాంక్ అకౌంట్ దొరికిందంట!

అది ఢిల్లీలోని ముండ్కాలో ఉన్న మహాలక్ష్మీ ట్రేడర్స్ పేరిట ఉందని గుర్తించారట పోలీసులు. ఇదే సమయంలో ఈ నేరంతో సంబంధం ఉన్న ఫోన్ నెంబర్ ను కూడా పోలీసులు గుర్తించారు. ఈ క్రమలోనే ఢిల్లీలోని సఫ్దర్ గంజ్ ఎన్ క్లేవ్ లో నివాసం ఉంటున్న చైనీయుడి వ్యవహారం తెరపైకి వచ్చిందని చెబుతున్నారు.

ఇదే సమయంలో.. సైబర్ క్రైం పోర్టల్ లో కనీసం 17 ఫిర్యాదులు నమోదయ్యాయని.. అన్నీ ఒకే బ్యాంక్ అకౌంట్ కు లింక్ చేయబడ్డాయని చెబుతున్నారు. ఈ క్రమంలోనే రూ.100 కోట్ల మోసానికి సంబంధించిన ఫిర్యాదులు ఉన్నాయని అంటున్నారు.

ఇదే క్రమంలో... ఆంధ్రప్రదేశ్, ఉత్తర ప్రదేశ్ లలో సైబర్ క్రైం తో పాటు మనీలాండరింగ్ తో కూడిన మరో రెండు కేసులు ఈ ఫాంగ్ చెంజిన్ తో ముడిపడి ఉన్నాయని చెబుతున్నారు.

Tags:    

Similar News