రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన ఖరారు... లక్ష్యం ఇదే!

ఈ మేరకు ఆయన వచ్చే నెల 3వ తేదీన బయలుదేరి తన బృందంతో అమెరికాకు బయలుదేరనున్నారు.

Update: 2024-07-20 03:40 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన ఖరారైంది. ఇందులో భాగంగా... ఆగస్టు 3వ తేదీ రాత్రి రేవంత్ రెడ్డి బృందం అమెరికాకు బయలుదేరనుంది. ఈ పర్యటనలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి బృందం పలువురు పారిశ్రామికవేత్తలు, పలు కంపెనీల సీఈవోలతో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా వారితో చర్చించి రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురానున్నారు.

అవును... తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అగ్రరాజ్యం అమెరికా పర్యటన ఖరారైంది. ఈ మేరకు ఆయన వచ్చే నెల 3వ తేదీన బయలుదేరి తన బృందంతో అమెరికాకు బయలుదేరనున్నారు. ఈ పర్యటనలో పెట్టుబడులను ఆకర్షించడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా... డల్లాస్ తో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ రేవత్ బృందం పర్యటించనుందని తెలుస్తుంది.

వాస్తవానికి ఇప్పటికే రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్న పలు కంపెనీల గురించి అక్కడున్నవారికి చెప్పి, పెట్టుబడులకు తెలంగాణ రాష్ట్రం.. ప్రధానంగా హైదరాబాద్ మహానగరం ఎంతటి సురక్షిత ప్రాంతమో, అనువైన ప్రదేశమో వివరించనున్నారని అంటున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణకు మరిన్ని పెట్టుబడులను ఆహ్వానించి పలు కంపెనీలతో ఒప్పందాలు చేసుకోనున్నారు.

సుమారు ఎనిమిది రోజుల పాటు అగ్రరాజ్యంలో పర్యటించనున్న రేవంత్ రెడ్డి బృందం... తిరిగి ఆగస్టు 11వ తేదీన హైదరాబాద్ కు చేరుకోనుంది. ఈ పర్యటనలో గతంలో కంటే ఎక్కువ పెట్టుబడులూ అకర్షించాలని లక్షయంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. కాగా... ఈ ఏడాది జనవరిలో స్విట్జర్లాండ్, లండన్, దుబాయ్‌ దేశాల్లో రేవంత్ పర్యటించిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News