అమెరికా గడ్డ నుంచి కామ్రెడ్ నారాయణ సందేశం.. ఏంటంటే!
అది అమెరికా పార్లమెంటు భవనం(క్యాపిటల్ హిల్స్) ఎదురుగా నిలబడడమే ఎక్కువ. ఎందుకంటే.. అక్కడకు సాధారణంగా ఎవరినీ రానివ్వరు. అలాంటి చోట నిలబడి.. అగ్రరాజ్యాన్ని దుయ్యబట్టారు కామ్రె డ్ నారాయణ.
అది అమెరికా పార్లమెంటు భవనం(క్యాపిటల్ హిల్స్) ఎదురుగా నిలబడడమే ఎక్కువ. ఎందుకంటే.. అక్కడకు సాధారణంగా ఎవరినీ రానివ్వరు. అలాంటి చోట నిలబడి.. అగ్రరాజ్యాన్ని దుయ్యబట్టారు కామ్రె డ్ నారాయణ. సీపీఐ జాతీయ కార్యదర్శిగా ఉన్న నారాయణ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా అక్రమ వలసదారుల విషయంలో అమెరికా వ్యవహరిస్తున్న తీరును నారాయణ దుయ్యబ ట్టారు. భారత ప్రభుత్వం తమ అక్రమ వలసదారులను వెనక్కి తీసుకుంటామని చెప్పిన తర్వాత కూడా ట్రంప్ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించడం సరిగాలేదన్నారు.
ప్రధాని మోడీ అమెరికాకు వచ్చి ట్రంప్‌తో భేటీ అయ్యాక.. అక్రమ వలసదారులను తాము వెనక్కి తీసు కుంటామని ప్రకటించారని, అయినా కూడా ట్రంప్ ఇలా వ్యవహరించడం సరికాదన్నారు. అక్రమ వలస లను తాము కూడా ప్రోత్సహించబోమన్న నారాయణ.. అయితే.. దేనికైనా ఒక పద్ధతి ఉంటుందన్నా రు. దశాబ్దాలుగా అమెరికాలో ఉంటున్న వలస దారులకు కొంత సమయం ఇచ్చి వెనక్కి పంపిస్తే.. బాగుండే దని అభిప్రాయపడ్డారు. కానీ, వారిని ద్రోహుల్లా చూస్తూ.. వెనక్కి పంపడం సరికాదన్నారు.
ట్రంప్ వ్యవహరించిన తీరు అమెరికా చరిత్రలో లేదన్నారు. గతంలోనూ అనేక మంది అక్రమ వలసదారు లను చూసీ చూడనట్టే వదిలేశారని తెలిపారు. కానీ, ఇప్పటికప్పుడు రాత్రికిరాత్రి వారిని వెనక్కి పంపడం వల్ల యువకులు తీవ్ర మానసిక వేదనకు గురవుతారని ఆందోళన వ్యక్తం చేశారు. వారు చేస్తున్న ఉద్యోగా లు, వ్యాపారాలు కోల్పోయి.. కుటుంబాలు సైతం రోడ్డున పడే ప్రమాదం ఉంటుందన్నారు.
ఇలాంటి వారి విషయంలో ట్రంప్ ప్రభుత్వం ఆచితూచి వ్యవహరించాలని, వలసదారులతో చర్చించి ఉంటే బాగుండేదన్నారు. అదేవిధంగా వారికి కొంత సమయం ఇచ్చి దేశం నుంచి పంపించే అవకాశం కూడా ఉందన్నారు. అయినా.. ఇవేవీ పట్టించుకోకుండానే.. ట్రంప్ వ్యవహరించిన తీరు దారుణమని వ్యాఖ్యానించారు. కాగా.. అమెరికా గడ్డపై నిలబడి.. ఆదేశాన్ని చాలా సునిశితంగా విమర్శించడం.. నారాయణకే చెల్లిందని అంటున్నారు పరిశీలకులు.