ప్రజా భవన్ లోకి డిప్యూటీ సీఎం.. కుటుంబ సమేతంగా గృహ ప్రవేశం
ఇక పాలనా పరమైన వెసులుబాటు కోసం మంత్రులకు కేటాయించిన భవనాలు, నివాసాల్లోకి వారు కుటుంబ సమేతంగా వెళ్తున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం పాలనను పరుగులు పెట్టిస్తోంది. మంత్రులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు ఇలా ఎవరికి వారు వారి వారి ప్లేస్ లోకి వెళ్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించిన గుర్తులను కనిపించకుండా రేవంత్ ప్రభుత్వం చర్చలు తీసుకుంటుంది. ఇప్పటికే నామినేటెడ్ పదవుల్లో చైర్మన్లుగా కొనసాగుతున్నవారు స్వచ్ఛందంగా రాజీనామా చేసి తప్పుకుంటున్నారు. ఇక పాలనా పరమైన వెసులుబాటు కోసం మంత్రులకు కేటాయించిన భవనాలు, నివాసాల్లోకి వారు కుటుంబ సమేతంగా వెళ్తున్నారు. ఇందులో భాగంగా ప్రగతి భవన్ లోకి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెళ్లారు. ఉదయం కుటుంబ సమేతంగా ఆయన గృహ ప్రవేశం చేశారు. అధికారిక లాంచనాలతో ఆయనకు ఆహ్వానం పలికారు.
‘ప్రగతి భవన్’ పేరుతో ఉన్న ఈ నివాసంలో మాజీ సీఎం (అప్పటి ముఖ్యమంత్రి) కేసీఆర్ కుటుంబ సమేతంగా ఉన్నారు. ఆయన అధికారిక కార్యక్రమాలు కూడా ఇక్కడి నుంచే నిర్వహించేవారు. ప్రముఖులు, ఐఏఎస్ అధికారులతో సమావేశాలు ఇక్కడి నుంచే నిర్వహించేవారు. కేసీఆర్ హయాంలో ప్రతిపక్ష నాయకులను ఇక్కడికి రానిచ్చే వారు కాదు. ఒకటి రెండు సార్లు ఇప్పటి సీఎం అప్పటి ఎంపీ సీఎంను కలుద్దామని వెళ్తే గేట్ల ముందే అవమానించారు. దీంతో అప్పటి నుంచి ప్రగతి భవన్ ను ఎలాగైనా అధికారంతో ఆక్రమిస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే ప్రగతి భవన్ ను ప్రభుత్వ తరుఫున స్వాధీనం చేసుకున్నారు. ఇందులో ప్రజావాణి నిర్వహించి బాధితుల నుంచి అర్జీలను స్వీకరించారు. ఆ తర్వాత మంత్రులు కొండా సరేఖ, సీతక్క కూడా ఇక్కడ ప్రజా వాణిలో పాల్గొని బాధితుల నుంచి అర్జీలు స్వీకరించింది. అయితే సీఎంగా రేవంత్ రెడ్డి ఇక్కడ ఉండేందుకు ఇష్టపడలేదు. దీంతో ఆయనకు మరో చోట నివాసం చూస్తున్నారు అధికారులు
ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో భాగంగా ప్రగతి భవన్ ను ‘మహాత్మా జ్యోతిభా ఫూలే ప్రజా భవన్’గా పేరు మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పాటు ఈ ప్రజా భవన్ ను భట్టీకి అధికారిక నివాసంగా అప్పగించారు. ఇందులో ఆయన తన వసతితో పాటు కార్యకలాపాలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు (డిసెంబర్ 14) ఉదయం కుటుంబ సమేతంగా భట్టి గృహప్రదేశం చేశారు. హిందూ శాస్త్రీయ పద్ధతిలో కుటుంబంతో కలిసి ప్రజా భవన్ లోకి అడుగుపెట్టారు. ఇక డిప్యూటీ సీఎంగా తన కార్యక్రమాలు ఇక్కడి నుంచే నిర్వహించనున్నారని అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి.