విశాఖ విజయసాయిరెడ్డికే...జగన్ డెసిషన్ ఫైనల్

అందులో విజయసాయిరెడ్డికి తిరిగి విశాఖ జిల్లా బాధ్యతలు అప్పగిస్తున్నారు అని అంటున్నారు.

Update: 2024-10-17 03:57 GMT

విశాఖ సహా ఉత్తరాంధ్ర బాధ్యతలను రాజ్యసభ సభ్యుడు వి విజయసాయిరెడ్డికి అప్పగించాలని జగన్ నిర్ణయించారని అంటున్నారు. తాజాగా వైసీపీ కో ఆర్డినేటర్లతో పార్టీ సమావేశాన్ని జగన్ నిర్వహించారని చెబుతున్నారు. అందులో విజయసాయిరెడ్డికి తిరిగి విశాఖ జిల్లా బాధ్యతలు అప్పగిస్తున్నారు అని అంటున్నారు.

అంతే కాదు ఆయన విశాఖ సహా ఉత్తరాంధ్ర జిల్లాల వైసీపీ బాధ్యతలను పర్యవేక్షిస్తారు అని అంటున్నారు. గతంలో 2016 నుంచి 2022 దాకా ఆరేళ్ల పాటు విజయసాయిరెడ్డి ఉత్తరాంధ్ర జిల్లాల బాధ్యతలు చూశారు. ఆయన హయాంలో 2019లో వైసీపీ ఉత్తరాంధ్రా జిల్లాలలో విజయ దుందుభి మోగించింది. అంతే కాదు 2021లో విశాఖ మేయర్ పీఠాన్ని దక్కించుకుని సిటీలో పాగా వేసింది.

తనను 2022లో తప్పించారు అని విజయసాయిరెడ్డికి అసంతృప్తి ఉండేది అని అంటారు. ఆయన తరువాత వచ్చిన వైవీ సుబ్బారెడ్డి విశాఖ సహా ఉత్తరాంధ్ర బాధ్యతలను సరిగ్గా నిర్వహించలేక పోయారు అని విమర్శలు వచ్చాయి. ఆయన హయాంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదలైన ఓటమి కాస్తా సార్వత్రిక ఎన్నికలో ఉత్తరాంధ్ర ఊడ్చిపెట్టుకుని పోయి అక్కడితో సమాప్తం అయింది అని కూడా సెటైర్లు పేల్చిన వారూ ఉన్నారు.

అయితే విజయసాయిరెడ్డిని గతంలో వైసీపీలో వ్యతిరేకించిన వారే ఇపుడు కూడా వ్యతిరేకిస్తున్నారు అని అంటున్నారు. ముఖ్యంగా శాసనమండలిలో వైసీపీ పక్ష నాయకుడు సీనియర్ నేత బొత్స సత్యనారాయణ విజయసాయిరెడ్డిని రీజనల్ కో ఆర్డినేటర్ గా నియమించడాన్ని వ్యతిరేకిస్తున్నారు అని అంటున్నారు.

అయితే ఈ రకమైన ప్రచారాలు ఎన్ని వచ్చినా జగన్ మాటే ఫైనల్ అని అంటున్నారు. జగన్ ఇపుడు పోయిన చోట వెతుక్కునే పనిలో ఉన్నారని చెబుతున్నారు. పైగా గతంలో తనకు విజయం అందించిన వారు అన్న సెంటిమెంట్ తో పాత వారితోనే వైసీపీ కధను కొత్తగా మలుపు తిప్పాలని ఆయన చూస్తున్నారు అని అంటున్నారు.

ఈ క్రమంలో ఆయన ఉత్తరాంధ్రలో వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ల నియామకాన్ని ప్రారంభించారు అని అంటున్నారు. విజయసాయిరెడ్డికి ఉత్తరాంధ్ర పట్లు అన్నీ తెలుసు అని ఆయన మళ్ళీ వైసీపీకి పూర్వ వైభవం తీసుకుని వస్తారని కూడా నమ్ముతున్నారు. ఉత్తరాంధ్రాలో టీడీపీ గట్టిగా ఉంది.

ఆ నేపథ్యంలో వైసీపీని మళ్లీ కదిలించాలనా గ్రాస్ రూట్ లెవెల్ నుంచి ముందుకు తీసుకుని పోవాలన్నా దూకుడుతో రాజకీయాలు చేసే వారు అవసరం అంటున్నారు. బొత్సకు కీలక పదవి కట్టబెట్టినా పార్టీకి అయితే జోష్ రావడం లేదు. వెళ్లే వారు వెళ్ళిపోతున్నారు. వారిని సర్దిచెప్పి ఉంచే ప్రయత్నం జరగడం లేదు అని అధినాయకత్వం భావిస్తోంది. అలాగే పార్టీలో సీనియర్లు సైలెంట్ గా ఉన్నారు వారిని తట్టి లేపే పని కూడా జరగడం లేదు దాంతో విజయసాయిరెడ్డినే జగన్ మరో మారు నమ్ముతున్నారు అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

Tags:    

Similar News