ఆ ద్వీపంలో ఒకే ఇల్లు.. అక్కడ ఒక రాత్రి గడపాలంటే గగనమే..!
యూరప్‌లోని ఐస్‌లాండ్ దక్షిణ తీరంలో అట్లాంటిక్ మహాసముద్రంలో 'ఎల్లాయామ్ (Ellioaey)' అనే ద్వీపం ఉంది.
ఎవరమైనా సాధారణంగా ఊరికి కొంచెం దూరాన ఇల్లు కట్టుకొని ఉండాలంటేనే ఒకటికి వంద సార్లు ఆలోచిస్తాం. గ్రామంలో చివరి ఇల్లుగా నిర్మించుకున్నా కూడా నిత్యం భయాందోళన చెందుతూనే ఉంటాం. ఆ ఏరియాలోని ఇంట్లో ఉదయం పూట ఉండాలంటే కూడా సింగిల్ కాకుండా తోడు కోరుకుంటాం. అంతలా భయపడిపోతుంటాం.
ఇలా కొందరికి భయాందోళన ఉంటే.. మరికొందరేమో ఊరికి దూరంగా ఉండాలని కలల కంటుంటారు. ఊరికి దూరంగా ఇల్లు కట్టుకోవాలని చూస్తుంటారు. జన సంచారం లేని ఏరియాలో ఇల్లు నిర్మించుకొని సేద తీరాలని అనుకుంటారు. జీవనానికి ఆమోదయోగ్యం లేని ఏరియాల్లో ఇల్లు కట్టుకొని ఉంటారు. సరిగా ఓ వ్యక్తి ఇలానే వినూత్నంగా ఆలోచించాడు.
అదేదో ఊరి బయటనో.. నగరం శివారులోనే ఇల్లు కట్టుకున్నాడంటే పొరపాటే. ఏకంగా సముద్రం మధ్యలో మారుమూల ప్రాంతంలో ఏ మూలకు విసిరిపడేసినట్లుగా ఇల్లు నిర్మించుకున్నాడు. ఓ నిర్మానుష్య ప్రాంతంలో ఇల్లు నిర్మించుకోగా.. దానిని ప్రపంచంలోనే ఒంటరి ఇంటిగా గుర్తించారు. అయితే.. ఆ ఇల్లును అమెరికాకు చెందిన యూట్యూబర్ ర్యాన్ ట్రాహన్ ఓసారి సందర్శించాడు. తన అనుభవాలను పంచుకున్నాడు. ఆయన ద్వారానే ఈ ఇంటి అంశం వెలుగులోకి వచ్చింది.
యూరప్‌లోని ఐస్‌లాండ్ దక్షిణ తీరంలో అట్లాంటిక్ మహాసముద్రంలో ‘ఎల్లాయామ్ (Ellioaey)’ అనే ద్వీపం ఉంది. అక్కడి వెస్ట్‌మాన్ ద్వీపసమూహంలో ఇది ఒకటి. అయితే.. ఆ ద్వీపం పరిధిలో ఎక్కడ వేతికినా ఒక్క ఇల్లూ కనిపించదు. ఆ ద్వీపం మొత్తానికి ఈ ఒక్క ఇల్లే ఉంది. ఎవరూ లేని నిర్మానుష్య ప్రాంతంలో.. ఎలాంటి వసతులు లేని అక్కడ ఇల్లు ఎందుకు కట్టారనేది కూడా ఎవరికి స్పష్టత లేదు. అంతేకాదు.. అక్కడి చేరుకోవాలంటే కంపల్సరీ షిప్ జర్నీ చేయాల్సిందే.
ర్యాన్.. ఇంటి సందర్శనకు వెళ్లేందుకు జార్ని సిగుర్డ్సన్ అనే వ్యక్తిని గైడ్‌గా పెట్టుకున్నాడు. రాగ్నర్ అనే మరో వ్యక్తి కూడా ర్యాన్ జర్నీకి సహకరించాడు. చివరకు పడవ ప్రయాణం చేసి.. తాళ్ల సాయంతో ద్వీపం పైకి చేరుకున్నారు. చివరకు అక్కడ చూసే సరికి గొర్రెలు, పఫిన్లు, సీల్స్ వంటి జంతువులు దర్శనం ఇచ్చాయి. మనుషులు ఎవరూ కనిపించలేదు. ఈ ఇంటిని ఎవరైనా బిలియనీర్ నిర్మించారా అని జార్నిని ర్యాన్ అడిగాడు. దానికి ఆయన సమాధానం ఇస్తూ.. ఈ ద్వీపంలో అరుదైన పఫిన్‌లపై అధ్యయనం చేయడానికి వచ్చే పక్షి శాస్ర్తవేత్తల కోసమే ఈ ఇల్లు నిర్మించారని చెప్పాడు. శాస్త్రవేత్తలకు అకామిడేషన్ కోసమే ఈ ఇంటిని నిర్మించారని వివరించాడు. అయితే.. అక్కడి అనుభవాన్ని ర్యాన్ తన యూట్యూబ్‌లో వీడియో పోస్ట్ చేశాడు.